Tags :రాయలసీమ జానపదాలు

జానపద గీతాలు

దూరం సేను దున్న‌మాకు – జానపదగీతం

దూరం సేను దున్న‌మాకు దిన్నెలెక్కి సూడ‌మాకు ఊరి ముందర ఉల‌వ స‌ల్ల‌య్యో కొండాలరెడ్డి ||దూరం సేను|| అత‌డుః కొత్త ప‌ల్లె చేల‌ల్లో న కంది బాగా పండి ఉంది కంది కొయ్య‌ను వ‌స్తావేమ్మా నా చిన్నారి సుబ్బులు కంది కొయ్య‌ను వ‌స్తావేమ‌మ్మా .. ఆమెః కంది కొయ్య‌ను వ‌స్తానబ్బీ ఎడ‌మ కంటికి ఎండా త‌గిలే కోరు మీటి గొడుగు ప‌ట్ట‌య్యో కొండాల రెడ్డి కోరు మీటి గొడుగు ప‌ట్ట‌య్యో  ||దూరం సేను|| అత‌డుః వ‌ల్లూరు సేల‌ల్లోన వ‌రి బాగా […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

మామరో కొండాలరెడ్డి – జానపదగీతం

మామరో కొండాలరెడ్డి మామిడీ పూవంటిదాన్ని పాయముంటే ఏలుకుంటావా కొండాలరెడ్డి-సేసుకొని సూసుకుంటావా అంతనైతి ఇంతనైతి సంతలో నెరవాజి నైతి తగులుకొని నీయంట నేనొత్తి కొండాలరెడ్డి ముగము సాటు సేయకోయబ్బి ||మామరో || సింతమాని ఇంటిదాన్ని సిలకలా కొమ్మాల దాన్ని సిలుకు సీరల వాలుజడదాన్ని కొండాలరెడ్డి కులుకు నడకల ఎర్రసినదాన్ని ||మామరో || కొత్తకుండల నీరుతీపి కోరిన మగవాడు తీపి వాడిన దంటెంతతీపబ్బి కొండాలరెడ్డి వాలలాడె బాలపాయము ||మామరో || బాయిగడ్డన బంగిసెట్టు ఎండితే ఒకదమ్ము పట్టు కోరేదాన్ని కొంగుపట్టబ్బి […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

దూరి సూడు దుర్గం సూడు మామా – జానపదగీతం

దూరి సూడు దుర్గం సూడు మామా దున్నపోతుల జాడ జూడు మైలవరమూ కట్టా మీద మామా కన్నె పడుచుల బేరీ జూడు అంచుఅంచుల చీరగట్టి మామా సింతపూల రయికా తొడిగీ కులికి కులికీ నడుస్తుంటే మామా పడుసోల్ల గోడు జూడు ||దూరి|| కడవ సంకనబెట్టుకోని నేను ఊరబాయికి నీళ్ళకు పొతే కపెల దోలే సిన్నవాడు మామా కడవనెత్తి కన్నూ గొట్టే ||దూరి|| కండ్ల కాటుక పెట్టూకోని మామా కోమిటింటికి నేనే పొతే కోమిటింటి శెట్టీ కొడుకు మామా […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు రాయలసీమ

ఓ రాయలసీమ రైతన్నా ! – జానపద గీతం

సాగునీటి సౌకర్యాల విషయంలో దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాయలసీమ రైతుకు వ్యవసాయం గుదిబండగా మారి, ప్రాణ సంకటమై కూర్చుండింది. కాయకష్టం చేసి గుట్టలు చదును చేసి తను సాగు చేసిన మెట్ట, పొట్ట కూడా నింపలేదని బాధపడుతున్న రైతు వ్యధను ‘ఓ రాయలసీమ రైతన్నా …’ అంటూ జానపదులు ఇలా ఆలపిస్తున్నారు. మెట్టలూ, గుట్టలుదీసి – పట్టుబట్టీ దున్నితేను చిట్టెడైన పండవేమిరా ఓ రాయలసీమ రైతన్నా..! పొట్టలైనా నిండవేమిరా ఎండలోస్తే పంటలేదు, కుండనొక్కా గింజ లేదు […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

అందమైన దాన … జానపద గీతం

అందమైన దాన,, సందమామ లాంటి దాన నీ అందమంతా సూసి నేను వాలిపోయాను పొద్దుటూరు లోనా పట్టు సీరలంగడి నాది సీరలన్నీ నీవు సింగారించుకోవే ।।అందమైన॥ ఆళ్ళగడ్డ లోన హారాలంగడి నాది హారాలన్ని నీవు రుంగారించుకోవే ॥అందమైన॥ అనంతపురంలోన అద్దాల మాడి నాది అద్దాల మాడిలోన ముద్దాడుకుందాము రావే ॥అందమైన॥ ముద్దనూరి లోన ముద్దాలంగడి నాది ఒక ముద్దయునా తిని పోదువు రావే ॥అందమైన॥పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

శివశివ మూరితివి గణనాతా – భజన పాట

కోలాట కోపుల్లో తాలుపుగట్టి మొదటిది. ‘శివశివ మూరితివి’ అనే ఈ పాట తాలుపుగట్టి కోపుల్లో కడప జిల్లాలో జానపదులు పాడుకునే గణపతి ప్రార్థనా గీతమిది.. వర్గం : భజన పాటలు శివశివ మూరితివి గణనాతా – నువ్వు శివునీ కుమారుడవు గణనాతా ||శివ|| బుద్ది నీదే బుద్ది నీదే గణనాతా ఈ జగతి గొలుచు దేవుడవు గణనాతా ||శివ|| సదువు నీదే సాము నీదే గణనాతా సారస్వతి నీకు దండం గణనాతా ||శివ|| బాపనోళ్ళు నిన్ను గొలువ […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

ఏమే రంగన పిల్లా – జానపదగీతం

ఒక పడుచు పిల్లగాడు తన అందమైన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయిదేశం పోయినాడు. వాడు చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన మగడిని చూసి అలిగింది ఆ అందాలభామ. ఆ మగడు ఆమెను ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో చూడండి. వర్గం: జట్టిజాం పాట (బృందగేయం) పాడటానికి అనువైన రాగం:తిలకామోద్ స్వరాలు (మధ్యాది తాళం) ఏమే రంగన పిల్లా నీ మకమే సిన్నబాయ – సెప్పే పిల్లా ఆలూరు సంతాకు పోతాన్ పిల్లా అడిగినన్ని […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

బుంగ ఖరీదివ్వరా పిల్లడ – జానపదగీతం

అందమైన ఆ పల్లె పిల్ల ఆకు వేసి, తమ్మ పుక్కిట పెట్టి చెంగావి రంగు సీర కట్టుకొని బుంగ తీసుకుని ఒయ్యారంగా నడుస్తూ నీటి కోసం ఏటికి వచ్చింది. ఏటి దగ్గర ఒక కొంటె కోనంగి సరదాపడి రాయి విసిరినాడు. ఆ రాయి గురి తప్పి ఆ గడుసు పిల్ల కడవకు తగిలి అది పగిలిపోయింది. ఆ పిల్ల రాయి విసిరిన పిల్లగాడిని నిలేసి ఇలా అడుగుతోంది… వర్గం: యాలపాట పాడటానికి అనువైన రాగం: ఆనందభైరవి స్వరాలు […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

వదిమాను సేనుకాడ : జానపదగీతం

అత్త కూతురుతో మనువు కుదిరింది మల్లన్నకు. ఆ చనువుతో మల్లన్న మరదలిని తనతో కోతకు రమ్మని పిలిచినాడు. పెళ్లి కాకుండా ఇద్దరం కలిసి తిరిగితే నిన్నూ, నన్నూ ఛీ కొడతారంది మరదలు. అందుకతడు నేను ధర్మం తప్పేవాన్ని కాదు అన్నాడు. ఎన్నో ఆశలు చూపినాడు. ఏది ఏమైనా పెళ్ళైన పెళ్లి తర్వాతనే నీ చేనంతా కోస్తానంటుంది. సున్నితమైన బావా మరదళ్ల సరసాలు ఈ పాటలో చూడండి. వర్గం: కోతల పాటలు పాడటానికి అనువైన రాగం: మాయామాళవ గౌళ […]పూర్తి వివరాలు ...