Tags :యోగి వేమన విశ్వవిద్యాలయం

    ప్రత్యేక వార్తలు

    పరీక్షలు జరిగిన 24 గంటల్లోపే పీజీసెట్ ఫలితాలు

    యోగి వేమన విశ్వవిద్యాలయం ఘనత కడప: పరీక్షలు జరిగిన 24 గంటల్లోపే పీజీ ప్రవేశ పరీక్ష (పీజీసెట్ 2016) ఫలితాలను ప్రకటించి యోగి వేమన విశ్వవిద్యాలయ రికార్డు సృష్టించింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా పీజీసెట్ కన్వీనర్  ఆచార్య రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 1, 2 తేదీల్లో జరిగిన వైవీయూ సెట్‌కు 2,602 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 2,356 మంది అర్హత […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    యోగి వేమన విశ్వవిద్యాలయంపై ప్రభుత్వ వివక్ష

    నిధుల కొరతతో నీరసిస్తున్నయోగి వేమన విశ్వవిద్యాలయం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం కడప: నగరంలోని యోగి వేమన విశ్వవిద్యాలయంపై నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఫలితంగా విశ్వవిద్యాలయ అభివృద్ది కుంటుపడుతోంది. ఈ నేపధ్యంలో యోగివేమన విశ్వవిద్యాలయానికి సంబంధించి సాక్షి దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం రూ.383 కోట్లు నిధులు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    26నుంచి యోవేవి పీజీ కౌన్సిలింగ్

    కడప: యోగివేమన విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాల కోసం అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయ  సంచాలకులు ఆచార్య రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ కేంద్ర గ్రంథాలయంలో ఉదయం 9 గంటలకు అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. 26న ఉదయం ఉదయం బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్, మైక్రో బయాలజీ సబ్జెక్టులకు, మధ్యాహ్నం 2 గంటలకు పొలిటికల్ సైన్సు అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం, […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    వైవీయూసెట్-2015 దరఖాస్తుల సమర్పణకు ఏప్రెల్ 28 చివరి తేదీ

    కడప: యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ కళాశాల, అనుబంధ కళాశాలల్లో పోస్టుగ్రాడ్యుయేషనులో ప్రవేశం పొందగోరే విద్యార్థుల నుండి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు స్వీకరణకు ప్రకటన విడుదల చేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, పీజీ డిప్లొమా ఇన్ థియేటరు ఆర్ట్సు కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా సమర్పించేందుకు ఏప్రెల్ 28వ తేదీ వరకు గడువు ఉంది. అపరాధ […]పూర్తి వివరాలు ...

    చరిత్ర ప్రత్యేక వార్తలు

    ‘మల్లుగానిబండ’పై ఆది మానవులు గీసిన బొమ్మలు

    కడప: మైదుకూరు సమీపంలోని రాణిబాయి దగ్గర ఉన్న ‘మల్లుగానిబండ’పై ఆదిమానవులు గీసిన బొమ్మలను (రేఖా చిత్రాలను) యోగివేమన విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ వెలుగులోకి తెచ్చింది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ శనివారం ఈ రేఖాచిత్రాలను విడుదల చేశారు. చిత్రాలను అధ్యయనం చేసిన విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం అవి బృహత్ శిలాయుగం, నవీన శిలాయుగాలకు చెందినవిగా తేల్చింది. చరిత్ర పురావస్తుశాఖ విభాగాధిపతి డాక్టరు రామబ్రహ్మం, భూవిజ్ఞానశాఖ సహాయాచార్యులు డాక్టరు కె.రఘుబాబు, చరిత్ర పురావస్తుశాఖ పరిశోధక విద్యార్థి ఎస్వీ […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    యోవేవికి ఒకేసారి ఆరు రామన్ ఫెలోషిప్‌లు

    కడప: యోగివేమన విశ్వవిద్యాలయానికి ఒకేసారి ఆరు రామన్ ఫెలోషిప్‌లు దక్కాయి. విశ్వవిద్యాలయ సహాయాచార్యులు ఆరుగురికి యుజిసి(విశ్వవిద్యాలయ నిధుల సంఘం) ‘రామన్ ఫెలోషిప్’లను ప్రకటించింది. ఒక విశ్వవిద్యాలయం నుంచి ఒకేసారి ఆరుగురు ఫెలోషిప్లు  దక్కించుకున్న అరుదైన ఘనతను యోగివేమన విశ్వవిద్యాలయం దక్కించుకుంది. యోవేవి సహాయాచార్యులు డాక్టరు తుమ్మల చంద్రశేఖర్, డాక్టరు చంద్రఓబులరెడ్డి, డాక్టరు బి.విజయకుమార్‌నాయుడు, డాక్టరు కె.ఎస్.వి.కృష్ణారావు, డాక్టరు వై.వెంకటసుబ్బయ్య ఫెలోసిఫ్‌ కు ఎంపికైనారు. ఫెలోషిప్ కు ఎంపికైన ఆచార్యులు అమెరికాలోని పరిశోధనా సంస్థల్లో పరిశోధనలు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. […]పూర్తి వివరాలు ...