వర్గం: భిక్షకుల పాట అనువైన రాగం : సావేరి స్వరాలు (ఏక తాళం ) ఉత్తరాది ఉయ్యాలవాడలో ఉన్నది ధర్మం సూడరయా నేటికి బుడ్డా యంగలరెడ్డి ధర్మ పెబువని పాడరయా దానపరుడూ యంగళరెడ్డి ధర్మదేవత బిడ్డడయా పచ్చి కర్వులో పాసెమూ పోసేను బెమ్మదేవుడే ఆయనయా ||ఉత్తరాది|| యెచ్చుగానూ పుణ్యాత్ముడు రెడ్దని యంగళరెడ్డిని ఎంచరయా యంగళరెడ్డి దానపరుడని శానామంది పొగిడిరయా ||ఉత్తరాది|| గుడ్డోల్లకు కుంటోళ్లకు గురుతుగా బండ్లే సేయించేనయా దొడ్డా బుద్ది కలిగిన పెద్ద దొరకు దండామని తెలిపిరయా […]పూర్తి వివరాలు ...
Tags :బుడ్డా వెంగళరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో జానపదబ్రహ్మగా ఖ్యాతి పొందిన మునెయ్య వాడవాడలా తిరిగి సేకరించిన జానపద గేయాలు వేనవేలు. ఔత్సాహిక కళాకారులెందరికో స్పూర్తి ప్రదాత. మునెయ్య కేవలం గాయకులే కాక మంచి రచయిత, చిత్రకారులు. వీరపునాయునిపల్లె శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1943 సంవత్సరంలో కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా దొమ్మరనంద్యాలలో జన్మించారు మునెయ్య. సరిగ్గా ఇది (2013) ఆయన 70వ జయంతి సంవత్సరం. అబ్బ శ్రీ కలిమిశెట్టి చౌడప్ప శిష్యరికంలో యక్షగానం, కోలాటం, పండరి భజన, […]పూర్తి వివరాలు ...