వైకుంఠ ఏకాదశి(ముక్కోటి దేవతలు వేచి దర్శనం పొంది స్వామి అనుగ్రహం పొందిన రోజు)ని పురస్కరించుకుని గురువారం దేవునికడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశి కావడంతో గురువారం తెల్లవారుజామున 4 గంటలకే స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. గోవిందనామస్మరణల నడుమ కడపరాయుడిని ఉత్తరద్వారం వద్ద దర్శించి తరించారు. ఆలయప్రధాన అర్చకులు శేషాచార్యులు పూజలు చేసిన అనంతరం భక్తులను స్వామి దర్శనానికి అనుమతించినారు. వైకుంఠ ఏకాదశి అంటే? ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు […]పూర్తి వివరాలు ...
Tags :దేవుని కడప
కడప: శ్రీదేవి భూదేవిలతో దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణం గురువారం వైభవంగా జరిగింది. స్వామి జన్మనక్షత్రం శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీవారి కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణల నడుమ కడపరాయని కల్యాణం కన్నుల పండువగా సాగింది. అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారి కల్యాణం చూసి తరించినారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.పూర్తి వివరాలు ...
‘దేవుని కడప’లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం కడప జిల్లాలోని ఒక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. కడప నగరంలోని ఉన్న ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించుకోవటానికి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. నిర్మాణ శైలి : విజయనగర ప్రత్యేకతలు : ఏటా ఉగాది పర్వదినాన దేవుని కడప ఆలయాన్ని ముస్లింలు దర్శించుకుని స్వామి వారికి భత్యం సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం ఈ గుడిలో అధిక సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. సమీపంలోని దేవుని కడప చెరువులో పడవ విహారం […]పూర్తి వివరాలు ...
దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల ౩౦ వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపధ్యంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని ఆలయ పర్యవేక్షణాధికారి ఈశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయశుద్ధి కార్యక్రమం చేపడతామని తెలిపారు. శ్రీవారి దర్శనం భక్తులకు ఈ సమయంలో ఉండదన్నారు. 11 గంటల నుంచి యథావిధిగా స్వామి దర్శనం కొనసాగిస్తామని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 30న ప్రారంభమవుతాయన్నారు. ప్రతిరోజు ఉదయ […]పూర్తి వివరాలు ...
Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మిక సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించినాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించినాడు. కడప గడపలో నడయాడిన ఆ భాగవతోత్తముడు దేవుని కడప […]పూర్తి వివరాలు ...
కడప: తిరుమల తర్వాత అంతటి గొప్ప క్షేత్రంగా దేవుని కడపను చెప్పినట్టే.. భద్రాచలం తర్వాత ఒంటిమిట్టకు అంత ప్రశస్తి ఉందంటారు. వాస్తవానికి భద్రాద్రి కన్నా ఒంటిమిట్ట ఎంతో పురాతనమైనది. దీన్ని రెండవ భద్రాద్రి అనడం కన్నా భద్రాచలాన్నే రెండవ ఒంటిమిట్టగా పేర్కొనడం సమంజసమంటారు ఇక్కడి పురాణ ప్రముఖులు. ఒంటిమిట్టలాంటి గొప్ప క్షేత్రమున్న ఈ జిల్లాలో శ్రీరాముని పవిత్ర హస్త స్పర్శతో పునీతమైన క్షేత్రాలుగా పేరుగాంచిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ప్రొద్దుటూరులోని ముక్తిరామేశ్వరాలయం. ఈ ఆలయంలోని […]పూర్తి వివరాలు ...