Tags :జానపదగేయాలు

    జానపద గీతాలు

    తుమ్మెదలున్నయేమిరా … జానపద గీతం

    అతడు : తుమ్మేదలున్న యేమిరా… దాని కురులు కుంచెరుగుల పైన – సామంచాలాడెవేమిరా ఆమె : ఏటికి పోరా శాపల్‌ తేరా – బాయికి పోరా నీళ్లు తేరా బండకేసి తోమర మగడ – సట్టికేసి వండర మగడా శాపల్‌ నాకు శారూ నీకూరా ఒల్లోరె మగడా! బల్లారం మగడా బంగారం మగడా… అహ శాపల్‌ నాకు శారూ నీకూరా || తుమ్మేద || ఆమె : కూలికి బోరా కుంచెడు తేరా – నాలికి పోరా […]పూర్తి వివరాలు ...

    జానపద గీతాలు

    ఏమే రంగన పిల్లా – జానపదగీతం

    ఒక పడుచు పిల్లగాడు తన అందమైన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయిదేశం పోయినాడు. వాడు చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన మగడిని చూసి అలిగింది ఆ అందాలభామ. ఆ మగడు ఆమెను ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో చూడండి. వర్గం: జట్టిజాం పాట (బృందగేయం) పాడటానికి అనువైన రాగం:తిలకామోద్ స్వరాలు (మధ్యాది తాళం) ఏమే రంగన పిల్లా నీ మకమే సిన్నబాయ – సెప్పే పిల్లా ఆలూరు సంతాకు పోతాన్ పిల్లా అడిగినన్ని […]పూర్తి వివరాలు ...

    జానపద గీతాలు

    భరతుడా! నా చిన్ని తమ్ముడా (చెక్కభజన పాట)

    ఒకప్పుడు రామాయణ, భారత, భాగవత కథలు జానపదుల జీవితంలో నిత్య పారాయణాలు. వారికి ఇంతకంటే ఇష్టమైన కథలు మరేవీ ఉండవేమో! పితృవాక్య పరిపాలనకై శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యాలకు వచ్చినాడు. ఆ సమయంలో భరతుడు అక్కడ లేడు. వచ్చిన తర్వాత జరిగిన ఘోరానికి బాధపడి తల్లి కైక దురాశను నిందించి అడవిలో అన్నను కలుసుకుంటాడు. భరతుని రాకకు సంతోషించిన రాముడు అయోధ్యలోని అందరి యోగక్షేమాలు అడిగినాడు. భరతుడు గుండెలవిసేట్లు ఏడుస్తూ తండ్రి చనిపోయిన విధం చెప్పి […]పూర్తి వివరాలు ...

    జానపద గీతాలు

    రాగల్లు యిసిరేటి ఓ రామ చిలుకా – జానపదగీతం

    వర్గం: ఇసుర్రాయి పాట రాగల్లు యిసిరేటి ఓ రామ చిలుకా మొగుడెందు బోయెనో మొగము కళదప్పే నాగలోకము బోయి – నాగుడై నిలిచే దేవలోకము బోయి – దేవుడై నిలిచే చింతేల నీలమ్మ చెల్లెలున్నాది చేతి గాజులు పోయె చెల్లెలెవరమ్మ యేడొద్దు నీలమ్మ తల్లి వున్నాది తలమింద నీడ బోయె తల్లె యెవరుమ్మా యేడొద్దు నీలమ్మ తండ్రి వుండాడు తాళిబొట్టూ బోయె తండ్రెవరమ్మా యేడొద్దు నీలమ్మ అక్క వుండాది అయిన సంసారం బోయె అక్కెవరమ్మా యేడొద్దు నీలమ్మ బావలున్నారు బందూ […]పూర్తి వివరాలు ...

    జానపద గీతాలు

    కదిరి చిన్నదానా …. జానపదగీతం

    వర్గం: యాలపాట పాడటానికి అనువైన రాగం: మాయా మాళవ గౌళ (త్రిశ్ర ఏకతాళం) కదిరి చిన్నదానా కదిరేకు నడుముదానా నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| నీ సిల్కు సీరెకు రేణిగుంట్ల రేయికాకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| నీ సైజు చేతులకు సైదాపురం గాజులకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| పులివెందుల పూలాకు నీ వాలు జడలాకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| ముద్దనూరి ముద్దులకు నీ సన్న పెదవులకు ముద్దెట్ల […]పూర్తి వివరాలు ...

    జానపద గీతాలు

    ఆశలే సూపిచ్చివా – వరుణా…. జానపదగీతం

    వర్గం: చెక్కభజన పాట పాడటానికి అనువైన రాగం: సావేరి స్వరాలు (ఏక తాళం) ఈ పొద్దు వానొచ్చె మలిపొద్దు సినుకోచ్చె కొండంత మబ్బొచ్చె కోరినా వానల్లు కురిపిచ్చి పోతావని ఆశలే సూపిచ్చివా – వరుణా అన్యాలమే సేచ్చివా ఏరులెండి పాయ సెరువులెండి పాయ దొరువులెండి పాయ సేల్లు బీల్లయిపాయ నీకు సేసిన పూజలన్ని భంగములాయ ఆశసంపి పొతివా – వరుణా అన్యాలమే సేచ్చివా గడ్డిపాసలు ల్యాక పసువులెండి పాయ తిననీకి తిండిల్యాక కండల్కరిగి పాయ గింజ గింటలు […]పూర్తి వివరాలు ...

    జానపద గీతాలు

    పచ్చొడ్లు నే దంచి…పాలెసరు బెట్టీ – జానపదగీతం

    వర్గం: ఇసుర్రాయి పాట పచ్చొడ్లు నే దంచి పాలెసరు బెట్టీ పాలేటి గడ్డనా మూడు నిమ్మల్లూ మూగ్గూ నిమ్మల కింద ముగ్గురన్నల్లూ ముగ్గూరన్నల కొగడు ముద్దు తమ్మూడు పెద్దవన్న నీ పేరు పెన్నోబలేసూ నడిపెన్న నీ పేరు నందగిరిస్వామీ సిన్నన్న నీ పేరు సిరివెంకటేసూ కడగొట్టు తమ్మూడ కదిరి నరసింహా ముగ్గురన్నలతోడ నాకి సరిబాలు సరిబాలు గాదమ్మ వొడిబాలు నీకు రత్నాలు ముత్యాలు చాటాకు బోసి వొడి నించ వచ్చెనే తల్లి బూదేవి రత్నాలు నాకొల్ల ముత్యాలు […]పూర్తి వివరాలు ...

    జానపద గీతాలు

    బండీరా..పొగబండీరా… జానపదగీతం

    వర్గం: కోలాటం పాట పాడటానికి అనువైన రాగం: హనుమత్తోడి స్వరాలు (తిశ్రం) బండీరా..పొగబండీరా దొరలేక్కే రైలూబండీరా దొరసానులెక్కే బండీరా అది జాతోడెక్కే బండీరా ||బండీరా|| బండీ సూస్తే ఇనుమూరా దాని కూతెంతో నయమూరా రాణీ లెక్కేది బండీరా రాజూ లెక్కేది బండీరా ||బండీరా|| పయనమంటె రైలుబండీ బయలుదేరుతాదన్నా బుగ బుగ సేలల్లో బుగ్గటించెను రైలు బండీ ||బండీరా|| యీడా కూతా లేసేనురా ఆడా కూతా లేసేనురా నీలాగిరి సెరువుకాడా నిలిసీ కూతా వేసేనూరా ||బండీరా|| ముందూ పెట్టెకు […]పూర్తి వివరాలు ...

    జానపద గీతాలు

    నా కొడకా నాగయో…. జానపదగీతం

    వర్గం: కలుపు పాట పాడటానికి అనువైన రాగం: సావేరి స్వరాలు (ఏకతాళం) దాయాదుల కారణంగా కొడుకు వ్యసనాలు మరిగి చివరకు జైలు పాలయినాడు. సర్కారోల్లు ఇంటికొచ్చి కొడుకుకు బేడీలు వేసి తీసుకుపోవటంతో అవమానపడిన ఆ తల్లి బాధతో రగిలిపోయింది. ఆ తల్లి బాధను జానపదులు ఇలా పాటగా పాడినారు.. నగుమాసం నినుమోసి నినుకంటిరో నా కొడకో నాకగుమానం సేస్తివిరో నా బాలనాగయో దాయాదుల దోవలోన పోవద్దంటే ఇనకపోతివిరో ఆరి కూతలు ఇని సెడితివి నా బాలనాగయో సారాయి […]పూర్తి వివరాలు ...