Tags :గాలి త్రివిక్రమ్ వ్యాసాలు

అభిప్రాయం రాజకీయాలు

రామారావు విజేతా? పరాజితుడా?

“రామారావు తెలుగువాడిగా పుట్టటం మన అదృష్టం. ఆయన దురదృష్టం” అంటారు ఆయన అభిమానులు. అయన అంతటి ప్రతిభాశాలి కావడం, ఆ సినిమాలను మళ్ళా మళ్ళా చూసి ఆస్వాదించగలగడం తెలుగు ప్రేక్షకుల అదృష్టం. ఆయన దురదృష్టం ఏమిటంటే (బహుశా) తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడే మొదలైన డ్యాన్సులు చెయ్యలేక, చెయ్యకుండా ఉండలేక, డ్యాన్సుల పేరుతో ఆయన చేసిన ఎక్సర్‌సైజులు హాస్యాస్పదంగా, రొమాన్స్ పేరుతో హీరోయిన్ల మీద ప్రదర్శించే హింసాకాండ చూడడానికి ఇబ్బందిగా ఉంటాయి. విదేశీ సినిమాల్లో అయితే ఆ బాధ […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

‘తాళ్ళపొద్దుటూరు’లో ఏమి జరుగుతోంది?

2004లో రిజర్వాయర్ తొలి సామర్థ్యం 16.850 TMC, మునక గ్రామాలు 14. 2007లో పెంచిన రిజర్వాయర్ సామర్థ్యం 26.85 TMC, మునక గ్రామాలు 22. ———————————- పులివెందుల నియోజకవర్గంలో ఎండిపోతున్న చీనీ చెట్లకు ఆరునెలల్లో నీళ్లిస్తామని, అంతవరకు తాను గడ్డం కూడా తియ్యనని శపథం చేసిన అప్పటి తెదేపా నాయకుడు, శాసనమండలి ఉపాధ్యక్షుడు (ఇప్పుడు కూడా ఈయన “అధికార పార్టీ”లోనే ఉన్నాడు) రెండుమూడేళ్ళుగా గడ్డంతోనే తిరుగుతున్నాడని జాలిపడి, గడ్డం తీయించడానికి తొందరపడి 2017లో గండికోట రిజర్వాయర్ నుంచి […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

కడప రుచుల కేంద్రం వన్ టౌన్ సర్కిల్

నేను పెద్దగా రుచులు తెలిసినవాణ్ణి కాను. రుచుల విషయంలో నాది మా నాన్న తరహా. ఏదైనా పదార్థం తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటుందనే దాన్ని బట్టి కాకుండా ఎంత సులభంగా గొంతు దిగుతుంది, తిన్న తర్వాత ఎంత తేలిగ్గా అరుగుతుంది, అరిగాక వంట్లో ఏం చేస్తుంది అన్నదాన్ని బట్టే ఇష్టాయిష్టాలు ఏర్పడుతాయి :-). మా అమ్మ మా చిన్నప్పుడు ఇంట్లోనే ఎప్పటికప్పుడు రకరకాల స్వీట్లు, ఇతర చిరుతిండ్లు చేసి పెట్టేది. ఊర్లో మిగతా పిల్లలు గువ్వలచెరువు (యెస్, […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

కొత్త జిల్లా కేంద్రంగా కడప వద్దు !

ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు వస్తే కొన్ని నెలల క్రిందట పత్రికల్లో ఒక వార్త వచ్చింది – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ అభివృద్ధి/ప్రణాళిక మండళ్లను ఏర్పాటు చేయనుందని. నాలుగు రాయలసీమ జిల్లాలకు కలిపి కడపలో, ఉత్తరాంధ్రకు విజయనగరంలో, మధ్యాంధ్రకు కాకినాడలో, దక్షిణాంధ్రకు గుంటూరులో అన్నారు. మూడు రాజధానుల విషయంలో లాగే నగరాల ఎంపికలోనే నాకు అభ్యంతరం ఉంది తప్ప వికేంద్రీకరణ విషయంలో ఈ మండళ్ల ఏర్పాటును నేను పూర్తిగా సమర్థిస్తాను. ఉత్తరాంధ్రకు విజయనగరం, దక్షిణాంధ్రలోని మూడు […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

కడప జిల్లాలో నేరాలు – ఒక పరిశీలన

రోజూ కాకపోయినా వీలుకుదిరినప్పుడల్లా ఈనాడు.నెట్లో కడప జిల్లా వార్తలు చూసే నేను క్రైమ్ వార్తల జోలికి పోయేవాడ్ని కాదు. తునిలో రైలు దహనం జరిగిన రోజు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిన తర్వాత (ఆ వ్యాఖ్యల గురించి కూడా కొన్ని రోజుల తర్వాతే నాకు తెలిసింది) అడపా దడపా నేరవార్తలు కూడా చూడడం మొదలుపెట్టాను. ఎక్కువ జనాభా ఉన్న జిల్లాలో సహజంగానే ఎక్కువ నేరాలు నమోదౌతాయి. ఐతే కడప జిల్లాలో సహజసిద్ధమైన […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

పైత్యకారి పత్రికలు, మిడిమేలపు మీడియా

కడప జిల్లా విషయంలో విస్మయపరిచే తీరు పుష్కరం కిందట 2007లో ప్రొద్దుటూరికి చెందిన చదువులబాబు అనే రచయిత జిల్లాలోని అన్ని మండలాలూ తిరిగి శ్రమకోర్చి సమాచారం సేకరించి ‘కడప జిల్లా సాహితీ మూర్తులు’ అనే పుస్తకం రాశారు. వేరొకరు ముందుకొచ్చి ఖర్చులు భరించి దాన్ని ప్రచురించారు. బహుశా అదే సమయంలో తెలంగాణకు చెందిన మౌనశ్రీ మల్లిక్‌ రాసిన ‘కడప జిల్లా చైతన్యమూర్తులు’ అనే పుస్తకం కూడా వచ్చింది. అది ఆంధ్రజ్యోతి అనే పత్రికకు ఎంత భరించరానిదైందంటే ఆ రెంటిని […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం వ్యాసాలు

తప్పుదోవలో ‘బస్సు ప్రయాణం’

మామూలుగా ఐతే ఒక ప్రాంతం/వర్గంమీద అక్కసుతో అపోహలు, అకారణ ద్వేషం కలిగేలా రాసే కథలను విజ్ఞతగల సంపాదకులు ప్రచురించరు. ఒకవేళ ప్రచురించినా ఇలాంటి కథలకు పాత పత్రికలకు ఉన్నదానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ఐతే ఈ కథ అలా మరుగున పడలేదు. 87 సంవత్సరాల తెలుగు కథాచరిత్రలో 87 మంది రచయితల అత్యుత్తమ కథలుగా ఎంపికచేసిన కథాసాగర్ సంకలనంలో చోటు సంపాదించుకుంది. కథ అక్కడితో ఆగలేదు – ఆ కథాసంకలనాన్ని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా ఒకటే అనుకోవడం ఒక పద్ధతి (రాయలసీమలోనే జిల్లాల మధ్య అభివృద్ధిలో ఉన్న అంతరాల దృష్ట్యా, అలాగే విభజనానంతర అనుభవాల దృష్ట్యా కూడా నేను దీన్ని బలంగా వ్యతిరేకిస్తాను). అభివృద్ధిలో ఎక్కువ వెనుకబడిన జిల్లాలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలనుకోవడం ఇంకొక పద్ధతి. రాయలసీమలో హైకోర్టు అంటే కర్నూల్లో హైకోర్టు అనే అభిప్రాయం ఒకటి బలంగానే వ్యాప్తిలో ఉంది. […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర ప్రాబల్యం గురించిన అభిప్రాయాలు ఇప్పటికీ అలాగే ఉండడం వల్ల అప్పటి శ్రీభాగ్ ఒప్పందాన్ని అనుసరించి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయటం ఇప్పుడు అనివార్యతగా మారింది. ఐతే ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన అమరావతి ప్రాంతంలోనే జస్టిస్ సిటీ పేరుతో హైకోర్టు ఏర్పాటుచెయ్యబూనడంతో హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చెయ్యాలనే డిమాండుతో దీక్షలు, ఆందోళనలు జరుగుతున్నాయి…. పైకి ఉద్యమకారులు […]పూర్తి వివరాలు ...