Tags :కోదండరామాలయం

వార్తలు

తితిదే ఆధీనంలోకి ఒంటిమిట్ట

మాట తప్పిన ప్రభుత్వం తితిదే అజమాయిషీలోకి కోదండరామాలయం కోదండరామయ్య బాగోగులకు ఇక కొండలరాయుడే దిక్కు ఒంటిమిట్ట: వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఒంటిమిట్టను మరో తిరుమలలా అభివృద్ది చేస్తానంటూ పోయిన బ్రహ్మోత్సవాల సందర్భంగా గొప్పలు పోయిన ముఖ్యమంత్రి చివరకు ఆ భాద్యత నుండి తప్పుకుని ఒంటిమిట్ట కోదండరాముని భారాన్ని కోనేటి రాయుడికి అప్పగించి చేతులు దులుపుకున్నారు. కడప జిల్లాలోని పురాతన ఆలయమైన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని తితిదేలో విలీనం చేస్తున్నట్టు ఆ సంస్థ పాలకమండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి […]పూర్తి వివరాలు ...

పర్యాటకం

ఒంటిమిట్ట కోదండరామాలయం

రాష్ర్టవిభజన నేపథ్యంలో భద్రాచల రామాలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమి వేడుకలను అధికార లాంఛనాలతో కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం వేదికగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ ఆలయ విశేషాల పట్ల తెలుగువారిలో సహజంగానే ఆసక్తి నెలకొంది. ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎన్నో విశిష్టతలను సంతరించుకున్న ఈ రామాలయం వివరాలు… కడప నుంచి తిరుపతికి వెళ్లే ప్రధానమార్గంలో కడపకు 24 కి.మీ. దూరంలో మండలకేంద్రం ఉంది. ఈ గ్రామం త్రేతాయుగం నాటిదని స్థలపురాణం వివరిస్తోంది. […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఒంటిమిట్టలో రోడ్ల పునరుద్ధరణకు 45లక్షలు

కడప: ఒంటిమిట్ట కోదండరామాలయం సమీపంలోని రోడ్లు పునరుద్ధరించేందుకు, అలాగే రథం తిరిగే రోడ్డు వెంబడి మరమ్మతులు చేసేందుకు గాను ప్రభుత్వం 45 లక్షల రూపాయలను  (G.O.RT.No. 242) మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం పేర (పంచాయతీ రాజ్ శాఖ) కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి  జీవో నెంబరు 242ను మార్చి 11న విడుదల చేశారు. ఇందులో 40 లక్షల రూపాయలను వెచ్చించి వాహనశ్రేణి (విఐపి) తిరిగేందుకు వీలుగా ఆలయ సమీపంలోని రోడ్లను పునరుద్ధరిస్తారు. మిగతా ఐదు […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

‘వాస్తు కోసం దక్షిణ ద్వారం మూయండి’: కలెక్టర్

ఒంటిమిట్ట: వాస్తు రీత్యా దక్షిణద్వారం అనర్థదాయకం కావడంతో కోదండ రామాలయ దక్షిణ ద్వారాన్ని మూసి వేయాలని జిల్లా సర్వోన్నత అధికారి కేవిరమణ అధికారులకు సూచించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శనివారం జిల్లాకలెక్టరు కేవీ రమణ పరిశీలించారు. కల్యాణం నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. బ్రహ్మోత్సవాల సమయంలో బారికేడ్లతో భక్తులకుఇబ్బందులు కలగకుండా పటిష్టమైన వరుసలు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. కల్యాణం నిర్వహించే ప్రాంత వంకను పూడ్చాలని జెడ్పీవైస్‌ఛైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కలెక్టరు సూచించారు. ప్రస్తుతం సమయంతక్కువగా […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

సంప్రదాయం ప్రకారమే కోదండరాముని పెళ్లి

ఒంటిమిట్ట : కోదండరాముని పెళ్లి ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్ తెలిపారు. స్థానిక కోదండ రామాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఆలయంలో కల్యాణం ఎప్పటిలాగానే రాత్రి సమయంలో నిర్వహిస్తామన్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి, తిరుమలను ఒక సర్క్యూట్‌గా ఏర్పాటు చేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు. […]పూర్తి వివరాలు ...

చరిత్ర శాసనాలు

ఒంటిమిట్ట రథోత్సవ వివాదం గురించిన శాసనం !

ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం రధోత్సవం జరుగుతుంది. కోదండరాముని కల్యాణోత్సవం జరిగిన మరుసటి రోజు ఈ రధోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోంది.మట్లి రాజుల కాలంలో కూడా ఈ ఆనవాయితీ ఉండేది. అప్పట్లో ఒంటిమిట్ట సిద్ధవటం తాలూకాలోనే పెద్దదైన గ్రామం (ఆధారం: కడప జిల్లా గెజిట్: 1914, 1875) , ఈ గ్రామంలో వివిధ కులాలకు చెందిన ప్రజలు నివశిస్తుండేవారు. కోదండరాముని బ్రహ్మోత్సవాలు అవీ గ్రామస్తుల ఆధ్వర్యంలోనే జరిగేవి. ఒకసారి రధోత్సవం విషయంలో ఒంటిమిట్ట కంసాలీలకు […]పూర్తి వివరాలు ...

పర్యాటకం

కోదండరామాలయంలో జరిగే పూజలు, సేవలు

ఒంటిమిట్ట కోదండరామాలయంలో జరిగే పూజలు, సేవలలో పాల్గొనాలనుకునే భక్తుల కోసం …. శాశ్వత పూజా వివరములు: నైవేద్య పూజ రూ 500 శాశ్వత అభిషేకం రూ 1116 పుష్ప కైంకర్యం రూ 1500 అన్నదానం రూ 2500 బ్రహ్మోత్సవ సమయములో పగటి ఉత్సవము రూ 15000 రాత్రి ఉత్సవము రూ 25000 సేవా టికెట్ల వివరములు అర్చన 10-00 కుంకుమార్చన 20-00 సహస్రనామార్చన 30-00 కేశఖండన 10-00 అభిషేకం 150-00 అంతరాలయ దర్శనం 50-00 వివాహ కట్టడి […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

15 వేలతో కోదండరామునికి తలంబ్రాలూ, పట్టు గుడ్డలు

ఒంటిమిట్ట (ఇంగ్లీషు: Ontimitta) కోదండరామునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించేందుకు ముందుకు వచ్చిన ఆం.ప్ర ప్రభుత్వం అందుకోసం 15 వేల రూపాయలు (INR 15000 Only) కేటాయించింది. ఇందుకు సంబంధించి ఆం.ప్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి  జెఎస్వి ప్రసాద్ పేర ప్రభుత్వం జీవో నెంబరు 63ను విడుదల చేసింది (ఫిబ్రవరి 21, 2015న). ఇందులో రాష్ట్ర విభజన నేపధ్యంలో ఒంటిమిట్ట ఆలయానికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాల కోసం […]పూర్తి వివరాలు ...

పర్యాటకం

ఒంటిమిట్టకు ఎలా చేరుకోవచ్చు?

ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన కోదండ రామాలయం ఉంది. వివిధ మార్గాలలో ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… రోడ్డు మార్గంలో… బస్సు ద్వారా… దగ్గరి బస్ స్టేషన్: కడప (27 KM), రాజంపేట (29 KM) కడప, రాజంపేటల నుంచి ప్రతి పది నిమిషాలకు ఒంటిమిట్ట మీదుగా వెళ్ళే బస్సు సర్వీసులు […]పూర్తి వివరాలు ...