Tags :కథ

    ఈ-పుస్తకాలు కథలు

    కుట్ర (కథ) – కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి

    కడప జిల్లాకు చెందిన కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి ‘కుట్ర’ పేరుతో రాసిన కథ (కధానిక).  జ్యోతి మాసపత్రిక 1981 నవంబరు సంచికలో ప్రచురితమైన ఈ కథ కడప.ఇన్ఫో సందర్శకుల కోసం…పూర్తి వివరాలు ...

    వ్యాసాలు

    కథానికా, దాని శిల్పమూ – రాచమల్లు రామచంద్రారెడ్డి

    ‘జీవితంలో చూసి ఉపేక్షించే విషయాలనే యీ కథలలో చదివి షాక్ తింటాం.’ అని నా కథల గురించి కుటుంబరావు అన్నారు. షాక్ (దిమ్మరపాటు) మాట యేమైనా పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతి ముద్ర వేయాలనే ఉద్దేశంతోనే నేనీ కథానికలు రాసినాను. కథానికను గురించే కాదు. మొత్తం సాహిత్యం గురించే నా అవగాహన అది. అనుభూతి లేకుండా సాహిత్యమనేదే లేదు. సమస్త సాహిత్యమూ హృదయ వ్యాపారమే. అంటే అనుభూతి వ్యంజకమే. అయితే, అనుభూతి అనేది వెగటు కలిగించే […]పూర్తి వివరాలు ...

    కథలు

    బొమ్మ బొరుసు (కథ) – వేంపల్లి రెడ్డి నాగరాజు

    మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది.నియోజకవర్గ కేంద్రంలోని కోర్టు ఆవరణంలో లాయర్లు , వాళ్ళ జూనియర్లు,ప్లీడరు గుమాస్తాలతోపాటూ రకరకాల కేసుల్లో ముద్దాయిలుగా,సాక్షులుగా వచ్చినవారితోనూ,వారిని వెంటబెట్టుకుని వచ్చిన పోలీసు కానిస్టేబుళ్ళతోనూ కాస్తంత సందడిగానే వుంది. చెట్టు క్రింద వున్న సిమెంటు బెంచీలవద్ద, కాంపౌండ్ లోనూ ఓ వారగా వున్న టీ క్యాంటీన్ వద్ద వున్న కొందరు లాయర్లు, బోనులో నిల్చున్నపుడు ప్రతివాది తరపున అడిగే ప్రశ్నలకు ఏ రకమైన సమాధానాలు చెప్పాలనే అంశంపై ట్రైనింగ్ ఇస్తుండగా మెజిస్ట్రేట్ గారు అడిగే […]పూర్తి వివరాలు ...

    కథలు

    సొప్పదంటు ప్రెశ్నలు (కథ) – వేంపల్లి రెడ్డినాగరాజు

    “నాయినా, నాయినా” అని పరిగెత్తుకుంటా వొచ్చె మా పిల్ల నాకొడుకు నిన్న తెల్లార్తో జలదాట్లో నీల్లు పోసుకుంటాంటే. “ఏంటికిరా అట్ల గస పోసుకుంటావొస్తివి ?” అనడిగితి సబ్బుతో వొల్లు రుద్దుకుంటా. “నీ సెల్లు పోను మోగుతాంది, అది చెప్తామనే వొస్తి ” అని చెప్పె. “సరేపా, వస్తాండాగనీ” అంటి చెంబుతో నీల్లు మింద కుమ్మరిచ్చుకుంటా. “ఇబ్బుడికి రొండుతూర్లు మోగిండాది” అనె వాడు ఆట్నించీ ఎల్లబారకుండానే. “అట్లనా , ఎవురు చేసినారో చూస్తివ్యా”? అనడిగితి. “ఆ, చూసినా, ‘ […]పూర్తి వివరాలు ...

    కథలు

    నెమిలి కత (కథ) – వేంపల్లి రెడ్డినాగరాజు

    “ఏమ్మే, పొద్దు బారెడెక్కిండాది, వాన్ని లేపగూడదా, కొంచింసేపు సదువుకోనీ” అంటి నా పెండ్లాంతో. “సలికాలం గదా,ఇంగ రోంతసేపు పొణుకోనీలేబ్బా” అనె ఆయమ్మి. “నోరు మూసుకోని చెప్పిండే పని చెయ్,నువ్వే వాన్ని సగం చెడగొడతాండావ్” అంటి గదమాయిస్తా. “అట్లయితే నువ్వే లేపుకోపో” అంటా ఇంట్లేకెల్లిపాయ నా బాశాలి. “రేయ్ , టయిం ఏడు గంటల పొద్దయితాంది,ఇంగా నిగుడుకోనే పొణుకోనేవుండావే, లెయ్ వాయ్” అని మా పిల్ల నాకొడుకు పిర్రల మింద వొగటంటిస్తి. “ఏం నాయినా” అంటా వాడు కండ్లు నలుపుకుంటా లేసి కుచ్చుండె. […]పూర్తి వివరాలు ...

    కథలు

    సెగమంటలు (కథ) – దాదాహయత్

    సెగమంటలు కథ  మాల ఓబులేసు నీరసంగా రిక్షా తోసుకుంటూ వచ్చి తన ఇంటి ముందాపాడు. ఇల్లంటే ఇల్లు కాదది బోద వసారా. పేరుకు మాత్రం చుట్టూ నాలుగు మట్టిగోడలుంటాయి. ఆ నాలుగు గోడలు కూడబలుక్కొని కూడా ఆ ఇంకో మంచి కొట్టం రూపైనా ఇవ్వలేక పోతున్నాయి. ఓబులేసు ఇంటికాడ రిక్షా ఆపుతూనే బిలబిల మంటూ అతని ఆరుగురు సంతానం వచ్చి చుట్టేశారు. ”నాయన! నాయన! “ ”య్యా! యేందే సీదర పొండి” కసిరాడు ఓబులేసు. అతని భార్య […]పూర్తి వివరాలు ...

    కథలు

    శ్రుతి (కథ) – డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

    జీవితంలో ముందు ముందు ఎవరిదారి వాళ్ళదనుకున్నాము. నలుగురం ఎప్పుడైనా, ఎక్కడైనా కలవడం కూడా అంత సాధ్యం కాదేమో అని నిరుత్సాహపడ్డాము. కాన్పూరు ఐ.ఐ.టిలో బి.టెక్ చదివిన నాలుగేళ్లూ ఎంతో ఆత్మీయంగా గడిచాయి. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఒకచోట పనిచేసే అవకాశం వస్తుందని ఎవరూ కలగనలేదు. అబ్దుల్లాది జమ్ము, సేతు మాధవన్‌ది తంజావూరు, దేశపాండేది పూనా, నాదేమో తెనాలి. నలువురం ఒకే దేశంలోని వాళ్ళమే. అయినా ఉద్యోగాల విషయంగా ఎవరు ఎక్కడుంటామో తెలియదు. అయితే, నిజం ఊహకంటే గొప్పది. […]పూర్తి వివరాలు ...

    కథలు సాహిత్యం

    రాతిలో తేమ (కథ) – శశిశ్రీ

    మా జిల్లాల్లో మునిరత్నం పేరు చెప్తే చాలు ఉలిక్కిపడి అటూ ఇటూ చూస్తారు. ముని అంటే ముని లక్షణాలు కానీ, రత్నం అంటే రత్నం గుణం కానీ లేని మనిషి. పేరు బలంతోనైనా మంచోడు అవుతాడనుకొని ఉంటారు పేరు పెట్టిన అమ్మానాన్నలు. కానీ అదేం జరగలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రాక్షసుడు అని చెప్పవచ్చు. అసలు చూడ్డానికి కూడా ఆఫ్రికా అడవి దున్నపోతులా ఉంటాడు. ఆరు అడుగుల ఎత్తు. తెల్ల ఖద్దరు డ్రస్సు. కనుబొమలు, చేతులపై సుడులు తిరిగినపూర్తి వివరాలు ...

    కథలు

    యీటి రంగే పచ్చనేమో సామీ! (కథ) – యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి

    మాయింట్లో నువాక్రాను, మోనోక్రోటోపాసు, ఎండ్రీను డబ్బాలు శానా వుండేటియ్యి. వంకాయలు, బెండకాయలూ పండిస్తా వున్యాములే. వాఁటితోపాటు జాలాట్లో నాలుగు టమాటాచెట్లు, గెనాల మింద గోగాకు, చిన్న పెడలో మిరపజెట్లు గూడా. అప్పుడు మాయింట్లో కూరలేం జేచ్చాన్యామో మల్లా జెప్పాల్నా! నూనొంకాయ, వంకాయపులుసు, బెండకాయపులుసు, వంకాయ్ తాళింపు, బెండకాయ్ తాళింపు, వంకాయ-బెండకాయ-టమాటా పుల్లగూర, టమాటాగుజ్జు, గోగాకు ఊరిమిండి, అన్నీ కలిపికొట్టి యింగో పుల్లగూరా, యిట్ట యెన్నిజేసినా నాకు మాత్రం యిష్టంగా ముద్ద దిగేదిగాదు. అన్నిట్లో వం, బెం, టం, […]పూర్తి వివరాలు ...