ఎర్రగుడిపాడు కమలాపురం తాలూకాలోని ఒక గ్రామము. ఈ శాసనం క్రీ.శ. 575 నాటికి చెందినది కావచ్చు. మొదటివైపు 1. స్వస్తిశ్రీ ఎరిక 2. ల్ముత్తురాజుల్ల 3. కుణ్డికాళ్లు నివబుకా 4. ను ఇచ్చిన పన్నన 5. దుజయ రాజుల 6. ముత్తురాజులు నవ 7. ప్రియ ముత్తురాజులు 8. వల్లవ దుకరజులు ళక్షి 9. కాను ఇచ్చి పన్నస్స రెండవైపు 10. కొట్టంబున పా 11. పాఱకు కుణ్డికాళ్లు 12. ళా ఇచ్చిన పన్నస 13. ఇరవది […]పూర్తి వివరాలు ...
Tags :కడప శాసనాలు
తిప్పలూరు శాసనము ఇదియు కమలాపురం తాలూకాలోనిదే. దీని లిపి సొగసైన పల్లవ-గ్రంథాక్షరములను పోలి యుండును. ణకారము కళింగరాజుల శాసనములందువలె నుండును. ఎరికల్ ముతురాజు పుణ్యకుమారుడు చివన్‌లి పట్టుగాను రేనాణ్డేలుచుండగా చామణకాలు అను ఉద్యోగిక ఱెవురు(నివాసియగు) తక్కన్ ప్రోలు పారదాయ (భారద్వాజః)కత్తిశర్మకు తిప೯ లూరను ఏబది (మతరుల) పన్నస కాత్తి೯క మాసము బహుళపక్షము ద్వతీయ,పుణరు పుష్యమి (పునర్వసు) నక్షత్రము సోమవారము బృహస్పతిహోర అగు సమయమున ధర్మము చేసెను. పుణ్యకుమారునికి మరున్థ(ఇక్కడ థవత్తును θగా చదవాలి) పిడుగు; మదుముదితున్ఠు (ఇక్కడ […]పూర్తి వివరాలు ...
భారతదేశంలోనే ఏకైక శాసనం… నీటి పారుదల సౌకర్యాలను గురించి తెలుపుతున్న శాసనాల్లో కూడా కడప జిల్లాకు ప్రత్యేక స్థానముంది. బుక్కరాయల కుమారుడు, ఉదయగిరి రాజ్యపాలకుడు భవదూరమహీపతి (భాస్కరరాయలు) క్రీ.శ. 1369లో పోరుమామిళ్లలో అనంతరాజసాగరమనే తటాకాన్ని నిర్మించి ఆ సందర్భంలో ఒక శాసనాన్ని వేయించాడు. చెరువుకట్ట మీద రెండు బండలపై చెక్కబడి ఉన్న ఈ శాసనం మధ్యయుగాల్లోని తటాక నిర్మాణ కౌశలానికి ప్రబల సాక్ష్యంగా దర్శనమిస్తుంది. తటాక నిర్మాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ శాసనంలో ప్రస్తావించబడ్డాయి. […]పూర్తి వివరాలు ...
స్మారక శిలలు, వీరగల్లులు … శాసన భేదాల్లో స్మారక శిలలు, వీరగల్లులను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం ఉంది. యుద్ధంలో మరణించిన వీరులకు, దైవానుగ్రహం కోసం ఆత్మబలి చేసుకున్న భక్తులకు స్మారక శిలలను ప్రతిష్ఠించే ఆచారం ఉండేది. బృహచ్ఛిలాయుగం నాటి సమాధులు, చారిత్రక యుగం నాటి ఛాయాస్తంభాలు, బౌద్ధస్తూపాలు కూడా స్మారక చిహ్నాలేనని చరిత్రకారుల అభిప్రాయం. రాజులు, రాణులు, మత గురువులు మరణించినప్పుడు వారి స్మృత్యర్థం ఛాయాస్తంభాలను నిలిపేవాళ్లు మరణించినవారి ఛాయ ఈ స్తంభంలో ఉంటుందని ఆనాటి […]పూర్తి వివరాలు ...
తెలుగు శాసనాలను గురించి మాట్లాడేటప్పుడు తెలుగు భాషకు తొలి అక్షరార్చన కడప జిల్లాలో జరిగిందనే విషయాన్ని తప్పనిసరిగా స్మరించుకోవలసి ఉంటుంది. ఇప్పటివరకు లభించిన తెలుగు శాసనాల్లో రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన కలమళ్ళ శాసనం మొట్టమొదటిది. ఈ రాజుదే ఇంకొక శాసనం ఎర్రగుడిపాడులో కూడా లభించింది. శాస్త్రాన్ని బట్టి ఈ శాసనాలు క్రీ.శ.575 ప్రాంతానికి చెందినవిగా నిర్ణయించబడ్డాయి. ప్రాచీన తెలుగు శాసనాల్లో ఎక్కువభాగం రేనాటి చోళులవే కావడం వల్ల ప్రాచీనాంధ్ర భాషా స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ శాసనాలే […]పూర్తి వివరాలు ...
విజయనగర చరిత్రలో కడప ప్రాంతానికి కూడా విశిష్టమైన స్థానం ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వివిధ చోట్ల లభించిన శాసనాల వల్ల అవగతం అవుతోంది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన గండికోట సీమ, సిద్దవటం సీమ, ములికినాటి సీమ, సకిలిసీమ ప్రాంతాలలోని దేవాలయాలూ, బురుజులూ, శాసనాలూ, కైఫీయతుల ద్వారా కడప జిల్లా చారిత్రక విశేషాలు వెలుగుచూస్తున్నాయి. సాహితీ సమరాంగణ చక్రవర్తిగా చరిత్రకెక్కిన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ప్రస్తుత కడప ప్రాంతం రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రధాన భూమికను పోషించింది. కడప ప్రాంతంలో లభించిన […]పూర్తి వివరాలు ...