కడప: ఈనెల 14న కడపజిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు కడప విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెప్పారు. నగరంలోని రాష్ట్ర అతిథి గృహంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలుత తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి రైల్వేకోడూరుకు ఉదయం 10.30 గంటలకు చేరుతారన్నారు. ఓబన్నపల్లెలో ఏర్పాటు చేసిన జన్మభూమి-మావూరు, ఇతర కార్యక్రమాల్లో దాదాపు రెండున్నర గంటల పాటు చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్‌లో […]పూర్తి వివరాలు ...
Tags :కడప విమానాశ్రయం
కడప విమానాశ్రయం ఈనెల 14న ప్రారంభం కానుందని ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందిందని ఒక దినపత్రిక ఇవాళ కథనాన్ని ప్రచురించింది. నగరం నుండి విమానాశ్రయానికి దూరాన్ని సూచిస్తూ సూచికలు ఏర్పాటు చేయటం కూడా ఇందుకు నిదర్శమని ఆ పత్రిక పేర్కొంది. ఆ కథనం ప్రకారం ‘విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను చేపట్టాలని విమానాశ్రయ అధికారులను జిల్లా కలెక్టర్ సూచించినట్లు కూడా సమాచారం. జిల్లా కలెక్టరుకు ప్రభుత్వం నుంచి విమానాశ్రయం 14న ప్రారంభించనున్నట్లు మౌఖిక సమాచారం అందినట్లు తెలుస్తోంది. […]పూర్తి వివరాలు ...
కడప విమానాశ్రయం ప్రారంభం వాయిదా పడింది. వాస్తవంగా అయితే సోమవారం విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ముందుగా భావించారు. తరువాత ప్రభుత్వ పెద్దల బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్లు మీడియా హోరేత్తించింది. ముందుగా ఊహించినట్లుగానే విమానాశ్రయం ప్రారంభం మళ్ళా వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు ప్రారంభించేది గురువారం తెలిసే అవకాశం ఉంది. ఎందుకు వాయిదా పడింది అనే అంశంపై అటు ఏఏఐ అధికారులు కాని, ఇటు జిల్లా […]పూర్తి వివరాలు ...
కడప విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించి ఈనాడు దినపత్రిక ఇవాల్టి కడప టాబ్లాయిడ్లో ఒక కధనాన్ని ప్రచురించింది. ఆ కధనం ప్రకారం … జులై 2న కడప విమానాశ్రయంలో విమానాలు దిగనున్నాయి. ఢిల్లీ అధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. విమానాశ్రయ సంబంధిత ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రారంభ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఇదివరకు కూడా ఈనాడు, సాక్షి దినపత్రికలు ఇదే మాదిరి కధనాలను చాలా సార్లు ప్రచురించాయి. గత సంవత్సరం […]పూర్తి వివరాలు ...
కడప విమానాశ్రయంలో జింకల మందలు సంచరిస్తున్నాయని.. వాటిని తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కడప డీఎఫ్‌వో నాగరాజు తెలిపారు. విమానాశ్రయం వద్ద మైదానం పెద్దగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయన్నారు. కృష్ణజింకలు 10 నుంచి 15 వరకు మందలుగా వస్తాయని.. అలాంటి ఈ ప్రాంతంలో అయిదు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఇటీవల ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో కలెక్టరు సమావేశం నిర్వహించారు. జింకలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు తగిన ప్రణాళిక రూపొందించాలని తమకు ఆదేశించారన్నారు. ఆదేశం మేరకు ప్రణాళిక […]పూర్తి వివరాలు ...