ఊరి పిల్లోడు పెన్నేటి కతలు ఆ పిల్లోని అస్సలు పేరు వాళ్లమ్మా, నాయినకూ తప్ప మల్లెవరికీ తెల్దు గానీ ఊళ్లో అందరికీ టంగుటూరోళ్ల పిల్లోడంటే తెల్సు. ఏడుస్తా వుండేవాళ్లకైనా ఆ పిల్లోని పడవ* సెప్తే, ఏడుపు ఇచ్చిపోయి మొకాన నగుపొద్దు పొడవాల్సిందే. అట్టాటోడు ఆ పిల్లోడు! పిల్లోడంటే పిల్లోడే. పదీ పదకొండేండ్లుంటాయేమో, బక్కగా నల్లగా వుండి మినమిన మెర్సే సూపుల్తో దేనిమీదా సిటికేసినంత సేపు సూపు నిలపకుండా బూలోకమంతా ఒక్కసారే సూస్తా వున్నెట్టు వుంటాడు. ఇంట్లో యెప్పుడుంటాడో […]పూర్తి వివరాలు ...
అలసిన గుండెలు ఆరో కాన్పుకు అమ్మగారింటికి పోవడానికి సిగ్గయింది శేషమ్మకు. పోయిన సారి పుట్టింటికి పోయినప్పుడు తమ్ముని భార్య ములికివంటి మాట అన్నది: “కనడానికేం – నేనూ కంటాను. సంవత్సరానికి ఒక పిల్లను. చాకిరీ చేసేవాళ్లు ఉండొద్దూ.” ఆ మాట విన్నప్పుడు ముసలి తల్లిని పట్టుకొని మూడు రోజులు ఏడ్చింది శేషమ్మ. “గొడ్డుమోతుది దాని మాటలకేం లేమ్మా” అని తల్లి ఎంత ఓదార్చినా, ఆనాడే తీర్మానం చేసుకున్నది — ఇక పుట్టింటికి పోకూడదని. ఇప్పుడు మళ్లీ అమ్మగారింటికి […]పూర్తి వివరాలు ...
ఊరూ వాడా సొదుం జయరాం కథ మా ఆవిడకు బ్రెయిన్ వాష్ చెయ్యడమన్నది నా వల్ల అయ్యే పనికాదు. ఆవిడ ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చిందంటే దాన్నుంచి ఒక్క ఇంచ్ కదలించడం కూడా కష్టమే. కానీ ఓటమిని అంగీకరించడం నాకూ ఇష్టంలేదు. మా అమ్మాయి పెళ్లి విషయంలో మా ఇద్దరి మధ్యా పేచీ ప్రారంభమైంది. “మీరు నూరు చెప్పండి, పల్లెటూరికి అమ్మాయిని ఇవ్వడానికి ససేమిరా నేనొప్పుకోను” అంది ఖచ్చితంగా అరుణ. “పల్లెలంటే పూర్వంలాగానే వున్నాయనుకుంటున్నావేమో. అదేం కాదు. పల్లెలు […]పూర్తి వివరాలు ...
సొదుం జయరాం కథ పాడె చిన్నపురెడ్డి కాలమైపోయాడు. పుట్టినవాళ్లు గిట్టక తప్పదు కదా? మంచానా కుంచానాపడి, తాను ఇబ్బందిపడీ, ఇతర్లను ఇబ్బంది పెట్టకుండా చాలా సుఖమైన చావు చచ్చాడు. చావడమైతే సుఖంగానే చచ్చాడు కానీ, చచ్చిన తర్వాత ఆయన శవానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన్ని కడసారిగా చూడవచ్చిన వాళ్లూ ఇబ్బంది పడిపోతున్నారు. చిన్నపురెడ్డి బ్రతికి వుండగా, ఆయన మూలంగా ఏ ప్రాణీ ఇబ్బంది పడలేదు. గ్రామంలో అందరికి తలలోని నాలుకలాగా మసలుకున్నాడు. చదువుకున్నది వీధిబళ్లోనే అయినా, ప్రబంధాలూ, […]పూర్తి వివరాలు ...
తాకట్టు అరుణకు పుట్టింటి దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం చించి చదవగానే ఆమె ఆనందానికి అవధుల్లేకపోయాయి. ఒకసారి కాదు, రెండుసార్లు చదివింది. కరుణకు పెళ్లి ఖాయమైంది. అదీ ఆ ఉత్తరంలోని వార్త. రెండు మూడు రోజుల్లో పెళ్లికి పిలవడానికని అన్నగారొస్తున్నారు. అరుణ ఆనందంతో పరవశించిపోయింది. చెల్లెలి పెళ్లి అనగానే సంతోషమే కాదు, ఒక సమస్య కళ్లముందు నిలిచింది. దాంతో చప్పున గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయింది. ఆ సమస్యకు తక్షణం ఏదో పరిష్కారం కనుగొనాలి. ఆమె […]పూర్తి వివరాలు ...
రెక్కమాను కథ ఏ కాలంలో పుట్టిందో ఏమో, చేపా చేపా ఎందుకు ఎండలేదనే కథకు ఈనాటి పరిపాలనతో ఎంతో చక్కటి సారూప్యత వుందో మూర్తికి ఆశ్చర్యం కలిగించింది. సింపుల్గా ఎండుతుందనుకునే చేప, ఎన్ని అవరోధాలు ఎదురై చివరకు ఎండకుండా ఆగిపోతుందో మన ప్రభుత్వయంత్రాంగంలో ప్రతి చిన్న పని అలాగే ఆగిపోతుంది. పని తెగకుండా ఫైలు నడపడం పరిపాలనలో ప్రత్యేక నైపుణ్యం. అనాదిలో ఎవడో పనికిమాలిన రాజును దెప్పి పొడుస్తూ రాసిన కథ ఇప్పటి ప్రజాస్వామ్యానికి అతకడం మూర్తివంటి […]పూర్తి వివరాలు ...
నూకా రాంప్రసాద్ కథ ‘కరువు’ ఆ మేఘానికి మేమంటే ఎందుకంత చిన్నచూపో? నీళ్లో రామచంద్రా అని మేమల్లాడుతుంటే ఒక పక్క ఉధృతంగా వానలు కురిసి వరదలొస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే మేఘం గిరిగీసుకుని వర్షిస్తోందని పెద్ద అనుమానం. ఈ సంవత్సరం కూడా నైరుతీ బుతుపవనాలు మోసం చేశాయి. అదనుకు పదును పడే సూచనలు కన్పించడం లేదు. రైతుల బతుకుల్లో ప్రతికూల పవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశకు విస్తరించే తుఫాన్లుగా మారాయి. “ఏందిరా సంటోడా, ఆలోశ్యన్లో పడ్న్యావ్ […]పూర్తి వివరాలు ...
సొదుం జయరాం కథ ‘శని’ “ఏం చేస్తున్నావురా,కేశవా? ” అంటూ ఆదిరెడ్డి యింట్లోకి వచ్చాడు. కేశవ భోంచేసి, కునుకు తీసే ప్రయత్నంలో వున్నాడు. అదిరెడ్డిని చూడగానే మంచం మాద నుంచి చివుక్కున లేచి నిలబడి : “కూర్చో పెదనాన్నా” అన్నాడు. ఆదిరెడ్డి ఉసూరుమంటూ మంచం మాద కూలబడి, “ఎండలు దంచేస్తున్నాయిరా కేశవా” అన్నాడు. “మార్చిగదా, యిప్పుడే ఎండలు మొదలయ్యాయి”. “అది సరే సావిత్రి కనిపించదేం?” అన్నాడు ఆదిరెడ్డి. “ఇంట్లో భోంచేస్తోంది” కేశవ అన్నాడు. ఇంట్లో భోంచేస్తున్న సావిత్రి […]పూర్తి వివరాలు ...
దేవిరెడ్డి వెంకటరెడ్డి రాసిన ‘సీమ బొగ్గులు’ కథ రోడ్డు మొగదాలున్న చేన్లోకి దిగీ దిగకముందే అశోకుడి పయి జలదరించింది. తిన్నగ అడుగులేస్తూ ఎప్పటిలాగా వేరుసెనగ పైరు వైపు తేరిపార చూశాడు. పచ్చదనం పావలాభాగం లేదు. ఎండకు మాడిన ఆకులు. అక్కడక్కడ అవి రాలిపోగా మిగిలిన ఒట్టి పుల్లలు. మూడో చోట మరోచెట్టు పెరికి మట్టి విదల్చాక కళ్ళు చెమ్మగిల్లాయి. చెట్టుకు రెండు తప్పితే మూడుకాయలు. అందులో ఒకటీ అరా లొట్టలు. ఐదెక రాల ఖర్చూ, గుత్తా వెరసి […]పూర్తి వివరాలు ...