రాయలసీమ బతుకు చిత్రాన్ని ఆరవోసిన ‘పెన్నేటి పాట’ సృష్టికర్త కీ.శే.విద్వాన్ విశ్వం గారు. ఇది వారి శతజయంతి సంవత్సరం. 1956లో విశ్వం గారు కావ్యస్తం చేసిన సీమ రంగని స్థితికీ, ఇప్పటి రంగని దుస్థితికీ మధ్య వ్యత్యాసం ఏమీ లేదు. కాలం మారింది… సాంకేతికత పరుగులు పెట్టింది…పాలకుల బడాయి ఎల్లలు దాటింది…. దగాల మాటున, అమాయకత్వం చాటున సీమ బతుకు చిత్రం చిధ్రం అవుతూనే ఉంది! సాహితీ విరూపాక్షుడి ‘పెన్నేటి పాట’కు రాళ్ళపల్లి వారు పీఠిక కట్టినారు. […]పూర్తి వివరాలు ...
కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు పొందిన సందర్భంగా.. ప్రముఖ కథా రచయిత ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి తో కె.ఎస్.రమణ ప్రత్యేకంగా సంభాషించారు. ఆ సంభాషణ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో డిసెంబర్ 23 ,1996న ప్రచురితమైంది. ఆ సంభాషణ కడప.ఇన్ఫో వీక్షకుల కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాం… నిన్న కా.రా. మాష్టారు, నేడు మీరు కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు పొందటం ఆధునిక తెలుగు సాహిత్యానికి అనువైన వాతావరణం ఏర్పడుతోంది అనటానికి సూచనగా వుందని భావిస్తున్నారు. మీరేమంటారు? “మీరన్నది అక్షరాల నిజం. ఆధునిక […]పూర్తి వివరాలు ...
వర్గం: యాలపాట పాడటానికి అనువైన రాగం: మాయా మాళవ గౌళ (త్రిశ్ర ఏకతాళం) కదిరి చిన్నదానా కదిరేకు నడుముదానా నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| నీ సిల్కు సీరెకు రేణిగుంట్ల రేయికాకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| నీ సైజు చేతులకు సైదాపురం గాజులకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| పులివెందుల పూలాకు నీ వాలు జడలాకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| ముద్దనూరి ముద్దులకు నీ సన్న పెదవులకు ముద్దెట్ల […]పూర్తి వివరాలు ...
వర్గం: చెక్కభజన పాట పాడటానికి అనువైన రాగం: సావేరి స్వరాలు (ఏక తాళం) ఈ పొద్దు వానొచ్చె మలిపొద్దు సినుకోచ్చె కొండంత మబ్బొచ్చె కోరినా వానల్లు కురిపిచ్చి పోతావని ఆశలే సూపిచ్చివా – వరుణా అన్యాలమే సేచ్చివా ఏరులెండి పాయ సెరువులెండి పాయ దొరువులెండి పాయ సేల్లు బీల్లయిపాయ నీకు సేసిన పూజలన్ని భంగములాయ ఆశసంపి పొతివా – వరుణా అన్యాలమే సేచ్చివా గడ్డిపాసలు ల్యాక పసువులెండి పాయ తిననీకి తిండిల్యాక కండల్కరిగి పాయ గింజ గింటలు […]పూర్తి వివరాలు ...
వర్గం: ఇసుర్రాయి పాట పచ్చొడ్లు నే దంచి పాలెసరు బెట్టీ పాలేటి గడ్డనా మూడు నిమ్మల్లూ మూగ్గూ నిమ్మల కింద ముగ్గురన్నల్లూ ముగ్గూరన్నల కొగడు ముద్దు తమ్మూడు పెద్దవన్న నీ పేరు పెన్నోబలేసూ నడిపెన్న నీ పేరు నందగిరిస్వామీ సిన్నన్న నీ పేరు సిరివెంకటేసూ కడగొట్టు తమ్మూడ కదిరి నరసింహా ముగ్గురన్నలతోడ నాకి సరిబాలు సరిబాలు గాదమ్మ వొడిబాలు నీకు రత్నాలు ముత్యాలు చాటాకు బోసి వొడి నించ వచ్చెనే తల్లి బూదేవి రత్నాలు నాకొల్ల ముత్యాలు […]పూర్తి వివరాలు ...
వర్గం: కోలాటం పాట పాడటానికి అనువైన రాగం: హనుమత్తోడి స్వరాలు (తిశ్రం) బండీరా..పొగబండీరా దొరలేక్కే రైలూబండీరా దొరసానులెక్కే బండీరా అది జాతోడెక్కే బండీరా ||బండీరా|| బండీ సూస్తే ఇనుమూరా దాని కూతెంతో నయమూరా రాణీ లెక్కేది బండీరా రాజూ లెక్కేది బండీరా ||బండీరా|| పయనమంటె రైలుబండీ బయలుదేరుతాదన్నా బుగ బుగ సేలల్లో బుగ్గటించెను రైలు బండీ ||బండీరా|| యీడా కూతా లేసేనురా ఆడా కూతా లేసేనురా నీలాగిరి సెరువుకాడా నిలిసీ కూతా వేసేనూరా ||బండీరా|| ముందూ పెట్టెకు […]పూర్తి వివరాలు ...
వర్గం: కలుపు పాట పాడటానికి అనువైన రాగం: సావేరి స్వరాలు (ఏకతాళం) దాయాదుల కారణంగా కొడుకు వ్యసనాలు మరిగి చివరకు జైలు పాలయినాడు. సర్కారోల్లు ఇంటికొచ్చి కొడుకుకు బేడీలు వేసి తీసుకుపోవటంతో అవమానపడిన ఆ తల్లి బాధతో రగిలిపోయింది. ఆ తల్లి బాధను జానపదులు ఇలా పాటగా పాడినారు.. నగుమాసం నినుమోసి నినుకంటిరో నా కొడకో నాకగుమానం సేస్తివిరో నా బాలనాగయో దాయాదుల దోవలోన పోవద్దంటే ఇనకపోతివిరో ఆరి కూతలు ఇని సెడితివి నా బాలనాగయో సారాయి […]పూర్తి వివరాలు ...
ఇందరికి నభయంబు లిచ్చుచేయి కందువగు మంచి బంగారు చేయి॥ వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి చిలుకు గుబ్బలికింద చేర్చు చేయి కలికి యగు భూకాంత కౌగిలించినచేయి వలనైన కొనగోళ్ళ వాడిచేయి॥ తనివోక బలిచేత దానమడిగిన చేయి ఒనరంగ భూదానమొసగు చేయి మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చినచేయి ఎనయ నాగేలు ధరియించు చేయి॥ పురసతుల మానములు పొల్లసేసినచేయి తురగంబుబరపెడి దొడ్డచేయి తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి॥పూర్తి వివరాలు ...
వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: హిందుస్తాని తోడి రాగస్వరాలు (ఆదితాళం) అందమైన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పడుచు. అందుకే బావ చీరెలూ, సొమ్ములూ తెచ్చిస్తానని సెప్పినా వద్దంటుంది ఆ మరదలు పిల్ల. ఆ మరదలు పిల్ల మనసులోని మాటను జానపదులు ఇలా పాటలా పాడుకుంటారు… సీరెల్ కావలెనా – రయికల్ కావలెనా నీకేం కావాలనే మైదుకూరు సంతలోనా సీరల్ నా కొద్దురో – రయికల్ నా కొద్దురో […]పూర్తి వివరాలు ...