తెలుగు భాషా,సంస్కృతుల పరిరక్షణ ఉద్యమంలో భాగంగా అంతర్జాతీయ తల్లిభాషా దినోత్సవాన్ని పురష్కరించుకుని కాలేజీ పిల్లోల్లకు జిల్లాస్థాయి కథ, కవితల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలుగు సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు , రచయిత తవ్వా ఓబుల్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపినారు. మైదుకూరులోని జిల్లా పరిషత్ హైస్కూలులో ఫిబ్రవరి 18 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఈ పోటీలు జరుగుతాయని ఇంటర్, డిగ్రీ, విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. కథలను పల్లెటూర్ల నేపధ్యంగా రైతులు, […]పూర్తి వివరాలు ...
తన సంకీర్తనా మాధుర్యంతో అలమేలుమంగ పతిని కీర్తించి తరించిన పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. కడప జిల్లాకు చెందిన ఈ వాగ్గేయకారుడు పాలకొండల ప్రకృతి సోయగాల నడుమ నెలవై, భక్తుల కొంగు బంగారమై భాసిల్లుతున్న వేయి నూతుల కోన (వెయ్యినూతుల కోన) నృసింహున్ని చూడరమ్మని ఇలా కీర్తిస్తున్నాడు.. ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ వేడుకఁ బరుషలెల్ల వీధినుండరమ్మా. ||పల్లవి|| అల్లదివో వోగునూతులౌభళేశు పెద్దకోన వెల్లిపాల నీటి జాలు వెడలే సోన చల్లనిమాఁ కులనీడ సంగడిమేడలవాడ […]పూర్తి వివరాలు ...
‘ఆ’తో మొదలయ్యే కడప సామెతలు … ‘ఆ’ అనే అక్షరంతో తెలుగు సామెతలు. కడప జిల్లాతో పాటుగా రాయలసీమ నాలుగు జిల్లాలలో వాడుకలో ఉన్న/ఉండిన సామెతలు. ‘ఆ’ అంటే ఆరునెల్లు ఆ ఊరుకు ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరుకు ఆ ఊరూ అంతే దూరం ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు ఆకు ముళ్ళు మీద బడినా, ముళ్ళు ఆకు మీద పడినా బొక్క ఆకుకే ఆకార పుష్టి, నైవేద్య నష్టి ఆగం అడివప్పా అంటే మడిగ […]పూర్తి వివరాలు ...
‘అ‘తో మొదలయ్యే కడప జిల్లా సామెతలు అందరూ బాపనోల్లే, గంప కింద కోడి ఏమైనట్లు? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నీ ఉన్నెమ్మ అణిగిమణిగి ఉంటే ఏమీ లేనమ్మ ఎగిసెగిసి పడిందంట అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలీనమ్మ ఏకాదశి నాడు చచ్చిందంట అడక్కుండా అమ్మయినా పెట్టదు అడివి పంది సేను మేసి పొతే, ఊరపంది సెవులు కోసినట్టు అడివి సెట్టుకు యానాదోడు పెట్టిందే పేరు అడుక్కునే వాడిని బుడుక్కునేవాడు అడిగినట్లు అడ్డబొట్టోడు, […]పూర్తి వివరాలు ...
వేమన శతకం ఈ-పుస్తకం రెడ్డి సేవా సమితి కడప మరియు వందేమాతరం ఫౌండేషన్,హైదరాబాద్ ల ప్రచురణ. జూన్ 2011లో ప్రచురితం. పద్యాల సేకరణ : కట్టా నరసింహులు, సంపాదకత్వం: ఆచార్య జి.శివారెడ్డిపూర్తి వివరాలు ...
సారస్వత వివేచన ఈ-పుస్తకం రారాగా చిరపరిచితులైన రాచమల్లు రామచంద్రారెడ్డి గారి వ్యాసాల సంపుటి ‘సారస్వత వివేచన’. 1976 జులైలో ప్రచురితం. ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ. ఇందులో రారా గారు రాసిన 17 వ్యాసాలున్నాయి.పూర్తి వివరాలు ...
సావిత్రమ్మ కొడుకూ, కూతురూ- ఇద్దరికీ ఒకే రోజు ముహూర్తాలు నిర్ణయించి ఘనంగా పెండ్లి జరిపించింది. ఆ పెండ్లి గురించి చుట్టుపక్కల నాలుగు గ్రామాల వాళ్లూ ఘనంగా చెప్పుకున్నారు. ఇంతవరకూ ఆవైపు అంత గొప్పగా పెండ్లి జరిపినవారే లేరని కీర్తించారు. ‘ఆహా…దేశం కాని దేశానికి పోయి, సిగ్గూ శరమూ లేకుండా అయి పుట్టినోడి కిందల్లా కొంగు పరిచి సంపాయిచ్చి, తగుదునమ్మా అంటూ ముదరపెట్టి ముదరపెట్టి ముసిలోళ్లను చేసినాక బిడ్డలకు పెండ్లి చేసింది. అదీ గొప్పేనా,’ అని పెదవి విరచి […]పూర్తి వివరాలు ...
గండికోట కావ్యం సమీక్ష తెలుగులో ఆధునిక క్షేత్రప్రశస్తి కావ్యాలు స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ, ఆ తర్వాత చాలా వచ్చాయి. వీటిని చారిత్రక స్థలకావ్యాలని కూడా పిలువవచ్చు. ప్రాచీన తెలుగు సాహిత్యంలో కాశీఖండం, భీమఖండం వంటి క్షేత్రప్రశస్తి కావ్యాలు ఉన్నప్పటికీ అవి కేవలం ఆధ్యాత్మిక దృష్టితో భక్తి ప్రధానంగా రచింపబడ్డాయి. కానీ ఆధునిక కాలంలో వచ్చిన క్షేత్రప్రశస్తి కావ్యాల లక్ష్యం వేరు. స్వాతంత్య్రోద్యమ కాలం కావడం వల్ల ప్రజలను చైతన్యవంతులను చేయడం ఆధునిక కవుల లక్ష్యం. అందువల్లనే ‘ఓ ఆంధ్రుడా! […]పూర్తి వివరాలు ...
అలసిన గుండెలు ఈ-పుస్తకం రారాగా చిరపరిచితులైన రాచమల్లు రామచంద్రారెడ్డి గారి కథల సంపుటి ‘అలసిన గుండెలు’. 1960 ఆగస్టులో ప్రచురితం. ప్రచురణ: విద్యోదయ పబ్లికేషన్స్, కడప జిల్లా. ఇందులో రారా గారి 12 కథలున్నాయి.పూర్తి వివరాలు ...