సాహితి లోకంలో రారాగా సుప్రసిద్ధులైన రాచమల్లు రామచంద్రారెడ్డిగారి పరిచయభాగ్యం నాకు 1977లో ‘ఈనాడు’ పత్రికలో సబ్ఎడిటర్ ట్రెయినీగా పని చేస్తున్నప్పుడు కలిగింది. మా బ్యాచ్లో మేము పదిమంది దాకా ఉండేవాళ్ళం. వార్తల్ని ఇంగ్లీషు నుండి తెలుగులోకి ఎలా అనువదించాలో ఆర్నెల్ల పాటు మాకు శిక్షణ ఇచ్చారు. అనువాదం ఎంత సంక్లిష్టమైనదో అప్పుడే నేను తెలుసుకున్నాను. రా.రా.మాకు శిక్షణ గురువు. తాను సంపాదకీయాలు రాస్తూనే వార్తల్ని ఎలా అనువదించాలో మాకు నేర్పించారు. ఆయన నిండైన విగ్రహం నాకింకా బాగా […]పూర్తి వివరాలు ...
అన్నమయ్య సంకీర్తనలలో పెద్దముడియం నృసింహుడు రాగము: సాళంగనాట రేకు: 0324-1 సంపుటము: 11-139 ॥పల్లవి॥ జయమాయ నీకు నాపె సరసములూ నయగారి ముడుయము నారసింహా ॥చ1॥మోము చూచి నీతోడ ముచ్చట లాడ వలసి కోమలి నీ తొడమీఁదఁ గూచున్నది ఆముకొని అట్టె మాట లాడ వయ్య ఆపెతోడ నామాట విని యిట్టె నారసింహా ॥చ2॥మన్నన నీ యలుకల మంకు దెలవ వలసి చన్ను లురమునఁ బెట్టి సత మైనది చెన్నుఁడ వాపె చనవు చెల్లించ వయ్య యిట్టె […]పూర్తి వివరాలు ...
1968-69 సంవత్సరాల్లో కడప నుంచి -కేవలం ఏడాదిన్నరకాలం మాత్రమే – వెలువడిన సాహిత్య పత్రిక ‘సంవేదన’. ఈ పత్రికను ‘యుగసాహితి’ నిర్వహించింది. యుగసాహితిలో రా.రా.తోపాటుగా గజ్జెల మల్లారెడ్డి, వైసీవీ రెడ్డి, ఆర్వియార్, సొదుం జయరాం, నల్లపాటి రామప్ప నాయుడు, టి.సాంబశివారెడ్డి, చెన్నారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి, ఐ.సుబ్బారెడ్డి, చవ్వా చంద్రశేఖర రెడ్డి, వి. రామకృష్ణ తదితరులు చురుకయిన పాత్ర పోషించారు. వీళ్లలో ఒకరిద్దరు తప్ప తక్కినవారందరి రచనలూ ‘సంవేదన’లో కనిపిస్తాయి. అయితే, ‘సంవేదన’ పత్రికకు దిక్సూచిగా నిలబడింది మాత్రం […]పూర్తి వివరాలు ...
1968-69 సంవత్సరాల్లో కడప నుంచి -కేవలం ఏడాదిన్నరకాలం మాత్రమే – వెలువడిన సాహిత్య పత్రిక ‘సంవేదన’. ఈ పత్రికను ‘యుగసాహితి’ నిర్వహించింది. యుగసాహితిలో రా.రా.తోపాటుగా గజ్జెల మల్లారెడ్డి, వైసీవీ రెడ్డి, ఆర్వియార్, సొదుం జయరాం, నల్లపాటి రామప్ప నాయుడు, టి.సాంబశివారెడ్డి, చెన్నారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి, ఐ.సుబ్బారెడ్డి, చవ్వా చంద్రశేఖర రెడ్డి, వి. రామకృష్ణ తదితరులు చురుకయిన పాత్ర పోషించారు. వీళ్లలో ఒకరిద్దరు తప్ప తక్కినవారందరి రచనలూ ‘సంవేదన’లో కనిపిస్తాయి. అయితే, ‘సంవేదన’ పత్రికకు దిక్సూచిగా నిలబడింది మాత్రం […]పూర్తి వివరాలు ...
కన్నె సోయగమునకు మురిసిన కడపరాయడు (గడపరాయ )చెలువతో చెలిమి చేసి శృంగారము చేసినాడు. నాయికా నాయకుల సరసములు ప్రొద్దుపోవు వరకు సాగినవి.పూర్తి వివరాలు ...
‘ఇ’తో మొదలయ్యే కడప సామెతలు … ‘ఇ ‘ అనే అక్షరంతో తెలుగు సామెతలు. కడప జిల్లాతో పాటుగా రాయలసీమ నాలుగు జిల్లాలలో వాడుకలో ఉన్న/ఉండిన సామెతలు. ఇంటి ఎద్దుకు బాడుగ ఇంటికన్న గుడి పదిలం ఇంటికో కడిదిని గుంటగ్గుక్కనీల్ దాగినట్టు ఇంతే సంగతులు చిత్తచ్చవలయును ఇచిత్రానికి ఇద్దురు పుడితే ఈడ్చలేక ఇద్దరు సచ్చిరంట ఇచిత్రానికి ఈర్లు బెడితే ఇంటాదికి యారగబెట్నంట ఇచ్చేటోడు ఉంటే సెచ్చోటోడు లేసొచ్చినంట ఇచ్చేవోన్ని సూసి చ్చేవోడుకూడా లేసొచ్చ ఇట్లిట్లే రమ్మంటే ఇల్లంతా […]పూర్తి వివరాలు ...
ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినపుడు మేమిద్దరం చెరో ధృవం వైపు విసరేయబడతాము ఆమె మొహం నాకేదో నిషిద్ధ వర్ణ చిత్రంలా గోచరిస్తుంది చేయి చాచితే అందే ఆమె దూరం మనస్సులో యోజనాలై విస్తరించుకొంటుంది ఉల్లిపొరై మామధ్య లేచిన భేదభావానికి నా అహం ఉక్కుపూత పూసేందుకు నడుం బిగిస్తుంది మౌనంగా మామధ్య చెలియలికట్టలా పడుకొని వున్న పాపకు ఇటువైపు నా గుండె కల్లోల సాగరమై ఎగిసి పడుతుంటుంది నా మనస్సు విరిగిన అభిప్రాయ శకలాల్ని కూర్చుకొంటూ […]పూర్తి వివరాలు ...
ఇప్పటికి శివతాండవం పదిసార్లైనా ప్రింటు అయివుంటుంది. కానీ నేను ఆర్ధికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం. ఈ ప్రాంతాల్లోనే గడ్డకు వచ్చి ఒక పేరు, ప్రతిష్ట సంపాదించుకోవలంటే చాలా కష్టం. సాహిత్యకంగా నా జీవితంలో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసివచ్చింది. ఒకసారి గుంటూరికి సాహిత్య మిత్రులు కొందరు నన్నాహ్వానించినారు. నాకు శరీర ఆరోగ్యము కూడా సరిగాలేదు అప్పుడు. ప్రయాణినికి కావలసిన జాగ్రత్తలన్నీ వారే చూచుకున్నారు. రామాయణం పైన నా […]పూర్తి వివరాలు ...
పుస్తకం : సంవేదన , సంపాదకత్వం: రాచమల్లు రామచంద్రారెడ్డి , ప్రచురణ : యుగసాహితి, అక్టోబర్1968లో ప్రచురితం.పూర్తి వివరాలు ...