॥పల్లవి॥చెప్పినంతపని నేఁ జేయఁగలవాఁడ నింతేఅప్పటి నపరాధమా ఆదరించవలదా॥చ1॥నియ్యాజ్ఞ దేహము నే మోఁచితి నింతేయియ్యెడ విజ్ఞానమేల యియ్యవయ్యావెయ్యవేలై వేగుదాఁక వెట్టిసేసి యలసితివొయయ్య కొంతైనా వూరడించవలదా॥చ2॥నీవు సేసే కర్మము నేఁ జేయువాఁడ నింతేయీవల నానందసుఖ మియ్యవయ్యాకోవరమై వెంటవెంటఁ గొలిచినబంట్లకుతావులఁ గొంతవడైనా దప్పిదీర్చవలదా॥చ3॥మతిలో శ్రీవేంకటేశ మనికైనవాఁడ నింతేతతి నాపాటుకు దయదలఁచవయ్యాయితవై పనిసేసేటి యింటపసురమునకువెతదీరఁ బాలార్చి వెడ్డువెట్టఁదగదా రాగము: ముఖారి రేకు: 0085-02 సంపుటము: 1-412 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥మిక్కిలిపుణ్యులు హరి మీదాసులే హరితక్కినవారు మీకృప దప్పినవారు హరి॥చ1॥వున్నతపు సంపదల నోలలాడేయట్టివాఁడుమున్నిటిజన్మాన నీకు మొక్కినవాఁడు హరిపన్ని పడనిపాట్లఁ బరులఁ గొలిచేవాఁడువున్నతి మిము సేవించనొల్లనివాఁడు హరి॥చ2॥పూని దేవేంద్రాదులై పొడవుకెక్కినవారుశ్రీనాథ మిమ్మునే పూజించినవారు హరినానానరకముల నలఁగుచుండేవారునానాఁడే నీమహిమ నమ్మనివారు హరి॥చ3॥పావనులై నిజభక్తిఁ బ్రపన్నులయ్యినవారుశ్రీవేంకటేశ మిమ్ముఁ జేరినవారె హరివేవేలు దేవతలవెంట దగిలేటివాఁడుకావించి మిమ్మెఱఁగనికర్మి యాతఁడే హరి రాగము: దేవగాంధారి రేకు: 0085-01 సంపుటము: 1-411 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥భక్తి కొలఁది వాఁడే పరమాత్ముఁడుభుక్తి ముక్తిఁ దానే యిచ్చు భువిఁ బరమాత్ముఁడు॥చ1॥పట్టినవారిచే బిడ్డ పరమాత్ముఁడుబట్టబయటి ధనము పరమాత్ముఁడుపట్టుపగటి వెలుఁగు పరమాత్ముఁడుయెట్టనెదుటనే వున్నాఁడిదె పరమాత్ముఁడు॥చ2॥పచ్చిపాలలోని వెన్న పరమాత్ముఁడుబచ్చిన వాసిన రూపు పరమాత్ముఁడుబచ్చు చేతి వొరగల్లు పరమాత్ముఁడుయిచ్చకొలఁది వాడువో యీ పరమాత్ముఁడు॥చ3॥పలుకుల లోని తేట పరమాత్ముఁడుఫలియించు నిందరికిఁ బరమాత్ముఁడుబలిమి శ్రీవేంకటాద్రి పరమాత్ముఁడుయెలమి జీవుల ప్రాణ మీ పరమాత్ముఁడు రాగము: రామక్రియ రేకు: 0084-06 సంపుటము: 1-410 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥సర్మాంతరాత్ముడవు శరణాగతుడ నేనుసర్వాపరాధినైతి చాలుఁజాలునయ్యా॥చ1॥వూరకున్న జీవునికి వొక్కొక్క స్వతంత్ర మిచ్చికోరేటి యపరాధాలు కొన్ని వేసినేరకుంటే నరకము నేరిచితే సర్గమంటాదూరవేసే వింతేకాక దోష మెవ్వరిదయ్యా॥చ2॥మనసు చూడవలసి మాయలు నీవే కప్పిజనులకు విషయాలు చవులు చూపికనుఁగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చిఘనము సేసే విందు గర్త లెవ్వరయ్యా॥చ3॥వున్నారు ప్రాణులెల్లా నొక్కనీ గర్భములోనేకన్న కన్న భ్రమతలే కల్పించియిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టెనిన్ను నన్ను నెంచుకొంటే నీకే తెలుసునయ్యా రాగము: లలిత రేకు: 0084-05 సంపుటము: 1-409 Tags: Annamacharya Keerthanalu, Telugu […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎక్కడిపాపము లెక్కడిపుణ్యములొక్కట గెలిచితి మోహో నేము॥చ1॥ప్రపన్నులెదుటను బడినయాతుమకుచపలత మరి నాశము లేదుఉపమల గురుకృప నొనరిన మనసుకురపముల మఱి నేరములే లేవు॥చ2॥ఘనతర ద్వయాధికారగు దేహికిమినుకుల భవభయమే లేదుచనవుల హరిలాంఛన కాయమునకువెనుకొను కర్మపువెట్టియు లేదు॥చ3॥శ్రీవేంకటేశ్వరుఁ జేరినధర్మికిఆవల మఱి మాయలు లేవుకైవశమాయను కైవల్యపదమునుఁజావుముదిమితో సడ్డే లేదు రాగము: గుజ్జరి రేకు: 0084-04 సంపుటము: 1-408 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుజ్జరిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥దైవమా నీకు వెలితా తలఁపువెలితేకాకవేవేలుకర్మాల వేసారఁగ వలసె॥చ1॥హరి యంటే బాపేటి అన్ని పాపాలు సేసినపొరి నందుపై నమ్మిక పుట్టదుగాకనరసింహ యంటే వచ్చే నానాపుణ్యాలకుతిరముగా ఋణములు దీర్చుకొనఁగలవా॥చ2॥దేవ జగన్నాథ యంటే తెగనిజన్మము లేవికైవశము నామనసు గాదుగాకగోవింద యనియంటేఁ గూడని పదవు లేవికావిరిఁ గాల మూరకె గడుపేము నేము॥చ3॥వేదనారాయణమంటే వీడేటిబంధములుఆదిగా మూఁడులోకాలనైనా నున్నదాశ్రీదేవిపతి యైన శ్రీవేంకటేశ్వరుఁడాయేదెసా నీవే నన్ను యీడేర్తువుగాక రాగము: సాళంగనాట రేకు: 0084-03 సంపుటము: 1-407 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥శ్రీహరి సేసిన చిహ్నలివి యీమోహము విడుచుట మోక్షమది॥చ1॥మలినంబేది మణుఁగననేదికలుషపుమలముల కాయమిదికలిగిన దేది కడు లేందేదిచలనపు మాయల జన్మ మిది॥చ2॥తనిసిన దేది తనియనిదేదిదినదిన మాఁకలి దీరదిదికొన యిందేది గుఱి మొదలేదిపనిగొను కర్మపు బంధ మది॥చ3॥నిండినదేది నిండనిదేదికొండల పొడవుల కోరికదిఅండనె శ్రీవేంకటాధిపు శరణనివుండుటె యిహపరయోగ మది రాగము: పాడి రేకు: 0084-02 సంపుటము: 1-406 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥వలెనను వారిదె వైష్ణవము యిదివలపుఁ దేనెవో వైష్ణవము॥చ1॥కోరిక లుడుగుచు గుఱి నిన్నిటిపైవైరాగ్యమెపో వైష్ణవముసారెకుఁ గోపముఁ జలమునుఁ దనలోవారించుటవో వైష్ణవము॥చ2॥నుడిగొను దేహపు సుఖదుఃఖములోవడిఁ జొరనిదెపో వైష్ణవముముడివడి యింద్రియముల కింకరుఁడైవడఁబడనిదెపో వైష్ణవము॥చ3॥వుదుటునఁ దన సకలొపాయంబులువదలుటపో నిజవైష్ణవముయెదుటను శ్రీవేంకటేశ్వరు నామమువదనము చేర్చుట వైష్ణవము రాగము: మలహరి రేకు: 0084-01 సంపుటము: 1-405 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, మలహరిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥కనియు గానని మనసు కడమగాకయెనలేని హరిమహిమ కిది గుఱుతుగాదా॥చ1॥కనుకలిగి హరిగొలిచి ఘనులైరిగాక మునుమునుజులే కారా మహరుషులునుమనసులో నిపుడైన మరిగి కొలిచినవారుఘనులౌట కిదియ నిక్కపు గుఱుతుగాదా॥చ2॥భావించి హరిఁగొలిచి పదవులందిరిగాకజీవులే కారా దేవతలునుకావించి కొలిచినను ఘనపదవు లేమరుదుయేవలన నిందిరికి నిది గుఱుతుగాదా॥చ3॥పన్ని హరిఁగొలిచి నేర్పరులైరి గాక ధర-నున్నవారే కారా యోగివరులుయెన్నికల శ్రీవేంకటేశు నమ్మినవారలిన్నియునుఁ జేకొనుట కిది గుఱుతుగాదా రాగము: భూపాళం రేకు: 0083-06 సంపుటము: 1-404 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...