॥పల్లవి॥నగుమొగముతోడి వో నరకేసరినగరూప గరుడాద్రి నరకేసరి॥చ1॥అమితదానవహరణ ఆదినరకేసరినమితబ్రహ్మాదిసుర నరకేసరికమలాగ్రవామాంక కనకనరకేసరినమోనమో పరమేశ నరకేసరి॥చ2॥రవిచంద్రశిఖనేత్ర రౌద్రనరకేసరినవనారసింహ నమో నరకేసరిభవనాశినీతీరభవ్య నరకేసరినవరసాలంకార నరకేసరి॥చ3॥శరణాగతత్రాణ సౌమ్య నరకేసరినరకమోచననామ నరకేసరిహరి నమో శ్రీవేంకటాద్రి నరకేసరినరసింహ జయ జయతు నరకేసరి రాగము: మాళవి రేకు: 0086-05 సంపుటము: 1-421 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, మాళవిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎంతవిచారించుకొన్నా నిదియే తత్వము హరివంతుకు నీకృపగలవాఁడే యెఱుఁగు హరి॥చ1॥నిన్ను నమ్మినట్టివాఁడు నిఖిలవంద్యుఁడు హరినిన్నునొల్లనట్టివాఁడు నీరసాధముఁడు హరిమున్ను దేవతలు నీకు మొక్కి బదికిరి హరివున్నతి నసురలు నిన్నొల్లక చెడిరి హరి॥చ2॥యేపున నీపేరిటివాఁడిన్నిటా ధన్యుఁడు హరినీపెరొల్లనివాఁడు నిర్భాగ్యుఁడే హరికేపుల నిన్నుఁ నుతించి గెలిచె నారదుఁడు హరిపైపై నిన్ను దిట్టి శిశుపాలుఁడు వీఁగెను హరి॥చ3॥యిట్టె నీవిచ్చినవర మెన్నఁడు జెడదు హరిగట్టిగా నీవియ్యనివి కపటములే హరిఅట్టె శ్రీవేంకటేశ నీ వంతరంగుఁడవు హరివుట్టిపడి కానకున్న వొచ్చము దేహికి హరి రాగము: రామక్రియ రేకు: 0086-04 […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎవ్వరివాఁడో యీదేహియివ్వలనవ్వల నీదేహి॥చ1॥కామించు నూరకే కలవియు లేనివియేమి గట్టుకొనె నీదేహివాములాయ నిరువదియొక వావులుయేమని తెలిసెనో యీదేహి॥చ2॥కందువ నిజములు గల్లలు నడిపీయెందుకు నెక్కెనో యీ దేహిముందర నున్నవి మొగిఁ దనపాట్లుయిందే భ్రమసీ నీదేహి॥చ3॥పంచేంద్రియముల పాలాయ జన్మముయించుక యెఱఁగఁడు యీదేహిఅంచెల శ్రీవేంకటాధీశ నీకృపవంచఁగ గెలిచెను వడి నీదేహి రాగము: దేసాక్షి రేకు: 0086-03 సంపుటము: 1-419 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇదియే మర్మము హరి యిందుఁగాని లోనుగాడుపదపడి జీవులాల బదుకరో॥చ1॥హరి గానలేరు మీరు అరసెందువెదకినాహరిదాసు లెఱుఁగుదు రడుగరోగరిమెఁ బ్రత్యక్షము గాఁడు దేవుఁ డెవ్వరికిధరఁ బ్రత్యక్షము హరిదాసుల గొలువరో॥చ2॥చేత ముట్టి గోవిందుని శిరసు వూజించలేరుచేతులార ప్రపన్నులసేవ సేయరోజాతిగాఁగ విష్ణునిప్రసాద మేడ దొరకీనిఆతల వారి బ్రసాద మడుగరో॥చ3॥అంతరంగమున నున్నాఁడందురు విష్ణుడు గానిఅంతటా నున్నారు వైష్ణువాధికులుచెంతల దదియ్యుల చేతియనుజ్ఞ వడసిసంతతం శ్రీవేంకటేశు శరణము చొరరో రాగము: సాళంగనాట రేకు: 0086-02 సంపుటము: 1-418 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥తహతహ లిన్నిటికి తానే మూలము గానసహజాన నూరకున్న సంతతము సుఖము॥చ1॥భారమైన పదివేలు పనులు గడించుకొంటేసారెసారె నలయించకపోవుతీరనియాసోదము దేహములో నించుకొంటేవూరూరఁ దిప్పితిప్పి వొరయక మానవు॥చ2॥వుండివుండి కిందుమీఁదు వుపమఁ జింతించుకొంటేవుండుఁబో మంచముకింద నొకనూయికొండంతదొరతనము కోరి మీఁద వేసుకొంటేనండనే యాబహురూప మాడకపోదు॥చ3॥మనసురానివైన మంచివి చేసుకొంటేతినఁదిన వేమైన దీపవునుతనిసి శ్రీవేంకటేశు దాసానదాసుఁడైతేయెనయుచు నేపని కెదురే లేదు రాగము: లలిత రేకు: 0086-01 సంపుటము: 1-417 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥తెలియరాదు మాయదేహమా మమ్ముపలువికారాలఁబెట్టి పనిగొన్న దేహమా॥చ1॥దినమొక్క వయసెక్కే దేహమా సారెపెనుమదము గురిసే బెండు దేహమాదినదిన రుచిగోరే దేహమా నన్నుఘనమోహపాశాలఁ గట్టెఁగదె దేహమా॥చ2॥తెలివినిద్రలుగల దేహమా నీ-పొలము పంచభూతాలపొత్తు దేహమాతిలకించి పాపపుణ్యాల దేహమాబలువుగలదాఁకా బదుకవో దేహమా॥చ3॥తీరని సంసారపు దేహమా ఇట్టెవూరట లేనిభోగాల వోదేహమాకూరిమి శ్రీవేంకటేశుఁ గొలిచితి నిఁక నాకుకారణజన్మమవై కలిగినదేహమా రాగము: భైరవి రేకు: 0085-06 సంపుటము: 1-416 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥మా కెల్ల ‘ రాజానుమతో ధర్మ’ యిది నీయీకడఁ గలుగుట కేమరుదు॥చ1॥అలగరుడగమన మహిశయనంబునుకలిసి నీయందె కలిగెనటాపొలసినపాపముఁ బుణ్యము నరులకుయెలమి గలుగుటకు నేమరుదు॥చ2॥యిదె నీడకన్ను యెండకన్ను మరికదిసి నీయందె కలిగెనటసదరపునరులకు జననమరణములుయెదురనె కలుగుట కేమరుదు॥చ3॥శ్రీకాంత ఒకదెస భూకాంత ఒకదెస కదెనకైకొని నీకిటు గలిగెనటయీకడ శ్రీవేంకటేశ యిహపరముయేకమై మా కగు టేమరుదు రాగము: లలిత రేకు: 0085-05 సంపుటము: 1-415 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥నిత్యులు ముక్తులు నిర్మలచిత్తులు నిగమాంతవిదులు వైష్ణవులుసత్యము వీరల శరణని బ్రదుకరో సాటికిఁ బెనఁగక జడులాల॥చ1॥సకలోపాయశూన్యులు సమ్యగ్జ్జ్ఞానపూర్ణులుఅకలంకులు శంఖచక్రలాంఛను లన్నిట బూజ్యులు వైష్ణవులువొకటీ గోరరు వొరుల గొలువరు వొల్లరు బ్రహ్మదిపట్టములుఅకటా వీరలసరియనఁ బాపం బారుమతంబులపూఁతకోకల॥చ2॥మంత్రాంతరసాధనాంతరంబులు మానినపుణ్యులు విరక్తులుయంత్రపుమాయలఁ బొరలుపరులకు యెంతైనా మొక్కరు వైష్ణవులుతంత్రపుకామక్రోధవిదూరులు తమనిజధర్మము వదలరుజంత్రపుసంసారులతో వీరల సరియని యెంచఁగఁ బాపమయ్య॥చ3॥తప్పరు తమపట్టినవ్రత మెప్పుడు దైవ మొక్కడేఁ గతియనుచువొప్పగుతమపాతివ్రత్యంబున నుందురు సుఖమున వైష్ణవులుకప్పిన శ్రీవేంకటపతిదాసులు కర్మవిదూరులు సాత్వికులుచెప్పకుఁడితరుల సరిగా వీరికి సేవించఁగ నే ధన్యుఁడనైతి రాగము: మాళవి రేకు: […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥వెఱ్ఱివాఁడు వెఱ్ఱిగాఁడు విష్ణుని దాస్యము లేకవిఱ్ఱవీఁగే యహంకారి వెఱ్ఱివాఁడు॥చ1॥నాలుకపై శ్రీహరినామ మిట్టే వుండఁగానుజోలితో మఱచిననీచుఁడే వెఱ్ఱివాఁడుఅలరియీజగమెల్లా హరిరూపై వుండఁగానువాలి తలపోయలేనివాఁడు వెఱ్ఱివాఁడు॥చ2॥కూరిమి బ్రహ్మాండాలు కుక్షినున్న హరికంటేకోరి వేరె కలఁడనేకుమతి వెఱ్ఱివాఁడుచేరి తనయాత్మలోన శ్రీరమణుఁడుండఁగానుదూరమై తిరుగువాఁడే దొడ్డవెఱ్ఱివాఁడు॥చ3॥సారపు శ్రీవేంకటేశు శరణాగతి వుండఁగాసారెఁ గర్మములంటెడి జడుడు వెఱ్ఱివాఁడుచేరువ నాతని ముద్ర చెల్లుబడి నుండఁగామోరతోపైవున్నవాఁడే ముందు వెఱ్ఱివాఁడు రాగము: బౌళి రేకు: 0085-03 సంపుటము: 1-413 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...