రాయలసీమలో 1993-94 నుంచి 2004-05 మధ్య కాలంలో మూడు ప్రాంతాలను పోల్చి చూసినట్లయితే జీవనప్రమాణాలు బాగా దిగజారాయని,నిరాదరణకు గురయిన ప్రాంతం తెలంగాణా కాదనీ రాయలసీమేనని శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర అభివృద్ధి పై దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి అవలంభించిన దృక్ఫధాన్నే శ్రీ కృష్ణ కమిటీ కూడా ప్రతిబింబించడం గమనార్హం! గ్రామీణ ప్రాంతాల్లో ఆ దశాబ్దకాలంలో ఆదాయంలో మార్పులను గమనించినట్లయితే తెలంగాణలో సంపన్న వర్గాల్లోనే ఆదాయ వృద్ధి కనిపించింది.పూర్తి వివరాలు ...
సంపాదకుడు
Thursday, May 19, 2011
రాయలసీమ ఉద్యమనేత, సీనియర్ పాత్రికేయుడు మాసీమ రాజగోపాల్ రెడ్డి గురువారం (19-05-2011) తెల్లవారుఝామున కడపలోని తమ స్వగృహంలో కన్ను మూశారు. రాయలసీమ జనబాహుల్యంలో “మాసీమ” గా ప్రసిద్ధుడైన రాజగోపాల్ రెడ్డి వయస్సు 80 సంవత్సరాలు. వెనుకబడిన రాయల సీమ అభివృద్ధి పట్ల, ఈ ప్రాంత ప్రజ సమస్యల పట్ల ఎనలేని శ్రద్ధతో పోరు సాగించిన ఈ ధీరోదాత్తుని మరణం రాయల సీమ ప్రజానీకానికి పిడుగు పాటు లాంటిదే! ..పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, May 19, 2011
కడప : సీనియర్ పాత్రికేయుడు, రాయలసీమ ఉద్యమనేత మాసీమ రాజ్‌గోపాల్‌రెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు.ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ‘మాసీమ’ పత్రికను స్థాపించి సీమ గళాన్ని వినిపించడంలో రాజగోపాల్ తనదైన పాత్రను పోషించారు. ఆ తరువాతి కాలంలో ‘మాసీమ’ అనేది ఆయన పేరులో భాగమయ్యింది. రాయలసీమ వెనుకబాటుతనం పైనా, ఇక్కడి సాగునీటి అవసరాలపైనా జరిగిన ఉద్యమాలలో రాజగోపాల్ చురుకైన పాత్ర పోషించారు. ఆయన కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, May 19, 2011
కడప : రిమ్స్ వైద్య కళాశాలలో ట్యూటర్స్, జూనియర్ రెసిడెంట్ డాక్టర్లగా కాంట్రాక్టు పద్దతిన పనిచేసేందుకు ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ (ఉదయం 10.30 గంటలకు) జరిగే వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావాలని కళాశాల ఇన్చార్జి డెరైక్టర్ డాక్టర్ ఓబులేశు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతలు: ట్యూటర్స్‌కు ఎంబీబీఎస్ డిగ్రీ, ఎంఎస్సీ మెడికల్ ఫిజియాలజీ, ఫెథాలజీ, మైక్రో బయాలజీపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, May 18, 2011
రాయచోటి : రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కూడా తాజాగా అధికారులను హెచ్చరించిన వారి జాబితాలో చేరారు. ‘రాయచోటి పట్టణం గుండా వెళుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులను వెంటనే మొదలుపెట్టి పూర్తిచేయాలి..లేకుంటే జూన్ 6వ తేదీన జాతీయ రహదారిపై ప్రజలతో కలసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా’నని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మున్సిపల్ కమిషనర్‌తో పాటు అధికారులను హెచ్చరించారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాజీ కౌన్సిలర్లు, పుర ప్రముఖులతో కలసి మున్సిపల్ అధికారులతో […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, May 18, 2011
పులివెందుల ఉప ఎన్నికలలో పరాజయం పాలైన వివేకానందరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవికి రాజనామా చేసిన అనంతరం తనకు పదవి ముఖ్యంకాదని, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాతనే పదవి చేపడతానని, తన సేవలు అవసరం అనుకుంటే ప్రజలు గెలుపించుకుంటారని వివేకా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అన్న అడుగుజాడల్లో నడుస్తానని, ఆయన ఆశయసాధనకు కట్టుబడి ఉంటానని, నియోజకవర్గంలో అర్ధంతరంగా నిలిచిన అభివృద్ధి పనులను భుజాలపై వేసుకుని వైఎస్ కలల సాకారం […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, May 18, 2011
నీళ్లు రాలేదు, రాజధాని తరలిపోయింది రాయలసీమ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ పేరుతో జనవరి 27, 1934న జస్టిస్ పార్టీ ప్రముఖులు సీహెచ్ నరసింహారెడ్డి, కె.సుబ్రహ్మణ్యం వంటి వారు ‘రాయలసీమ మహాసభ’ ఏర్పాటు చేశారు. ఆ సంవత్సరం జనవరి 28న ఈ సంఘం ప్రథమ సమావేశం మద్రాసులో జరిగింది. కడప జిల్లా నాయకుడు నెమిలి పట్టాభిరామారావు అధ్యక్షత వహించారు. వ్యాస రచయిత ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేకాంధ్ర, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, May 17, 2011
ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం 1885 లో కడప జిల్లాలోని ‘సురభి’ గ్రామంలో కీచకవధ నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థా పకుడు వనారస గోవిందరావు. వనారస సోదరులు వనారస గోవిందరావు మరియు వనారస చిన్నరామయ్య కలిసి కడప జిల్లా చక్రాయపేట మండలములోని సురభిరెడ్డివారిపల్లెలో శ్రీ శారదా వినోదిని నాటక సభను ప్రారం భించారు. సురభిలో ప్రారంభమైన ఈ నాటక సభ కాలక్రమేణా సురభి నాటక సంఘంగా ప్రసిద్ధి చెందినది. రంగస్థలముపై స్ర్తీ పాత్రలను […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Saturday, May 14, 2011
కడప : జిల్లాలోని పలు మండలాల్లో ఈనెల 16 నుంచి ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త మార్కారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.శిబిరాలకు వివిధ ఆసుపత్రులకు చెందిన ప్రత్యేక వైద్యులు హాజరై చికిత్సలు చేస్తారన్నారు.పూర్తి వివరాలు ...