కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన బాబురావు నాయుడు బదిలీపై వెళుతున్న కలెక్టర్ సత్యనారాయణ నుంచి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా 50వ కలెక్టరుగా శుక్రవారం సాయంత్రం 4.35 నిమిషాలకు కలెక్టరేట్లోని ఛాంబరులో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. బాబురావు నాయుడు 2006 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇక్కడ పనిచేసిన సత్యనారాయణ ఆం.ప్ర స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ గా […]పూర్తి వివరాలు ...
కడపలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు విదేశాంగ మరియు తపాల శాఖల మధ్య అవగాహనా ఒప్పందం జిల్లా వాసులకు తిరుపతి పోయే బాధ తప్పనుంది కడప: ఏప్రిల్ మూడవ తేదీ నుండి కడప జిల్లా వాసులకు స్థానికంగా పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక మీదట నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో (హెడ్ పోస్టాఫీసు) పాస్‌పోర్ట్ సేవలు అందిస్తారు. దీంతో జిల్లా వాసులు పాస్‌పోర్ట్ కోసం తిరుపతి లేదా హైదరాబాదు పోవాల్సిన బాధ తప్పుతుంది. ఏప్రిల్ 3 […]పూర్తి వివరాలు ...
2004 లో అనుకుంటాను. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత.. గాంధీ భవన్లోనో, మరెక్కడో, వైఎస్సార్ చేసిన సుదీర్ఘ పాదయాత్రకు సంబంధించిన ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వైఎస్సార్ వెళ్లారు. వందలాది ఫోటోలను అమర్చారు. అన్నింటిని శ్రద్ధగా చూస్తున్నారు ఆయన. అనేక ఫోటోలలో తన వెంట ఉన్న ఒక సామాన్య వ్యక్తి పై ఆయన దృష్టి పడింది. అతడు తనతో పాటు చాలా ఫోటోలలో ఉన్నాడు. కొన్ని ఫోటోలలో తన […]పూర్తి వివరాలు ...
నిన్నమొన్నటిదాకా కడప జిల్లా మొత్తానికి ప్రసిద్ధిచెందిన దేవాలయం అంటే ‘దేవుని కడప’ ఒక్కటే గుర్తొచ్చేది. ఇప్పుడు స్వదేశ్ దర్శన్ కింద జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు కేంద్రాల్లో దేవుని కడప ప్రస్తావనే లేదు. ఆ నాలుగు కేంద్రాలు: ఒంటిమిట్ట కోదండరామాలయం, పుష్పగిరి చెన్నకేశవాలయం, అమీన్ పీర్ దర్గా, గండికోటలోని మసీదు. ఒంటిమిట్టను ఎలాగూ తితిదే వాళ్ళు నూరుకోట్లతో అభివృద్ధి చేస్తున్నారు కదా? అది చాలదన్నట్లు మరీ కక్కుర్తిగా చిన్నాచితకా దేవస్థానాలకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న రెండుకోట్లకు కూడా […]పూర్తి వివరాలు ...
ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వినియోగంలో సమస్యలు రాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లులో కృష్ణానది నీటి యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసిన విషయం విదితమే. కృష్ణానది నీటిపై ఆధారపడిన ఒక ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం, అదే సందర్భంలో కృష్ణా నది నీటిపై ఆధారపడిన రెండు ప్రాంతాలకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. రెండు ప్రాంతాలకు అంటే రాయలసీమ, దక్షిణ […]పూర్తి వివరాలు ...
రెండో దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటన అనే భావనను మార్చేశారు. అంతకు ముందు పల్లెబాట, నగరబాట, రైతు చైతన్యయాత్ర, పొలం బడి, రైతు సదస్సులు వంటివి నిర్వహించారు. రెండోసారి పదవిని చేపట్టిన తరు వాత ప్రజలతో ముఖాముఖీ సమావేశమై ప్రభుత్వ పథకాల గురించీ, అవి ప్రజలకు చేరుతున్న తీరు గురించీ, వాటితో చేకూరిన లబ్ధిని గురించీ, మంచిచెడుల గురించీ మాట్లాడాలని అనుకున్నారు. అలాగే భూపంపిణీ, ఇళ్లు, ఇళ్ల స్థలాల […]పూర్తి వివరాలు ...
యోగి వేమన విశ్వవిద్యాలయం ఘనత కడప: పరీక్షలు జరిగిన 24 గంటల్లోపే పీజీ ప్రవేశ పరీక్ష (పీజీసెట్ 2016) ఫలితాలను ప్రకటించి యోగి వేమన విశ్వవిద్యాలయ రికార్డు సృష్టించింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ ఈ ఫలితాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా పీజీసెట్ కన్వీనర్ ఆచార్య రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 1, 2 తేదీల్లో జరిగిన వైవీయూ సెట్‌కు 2,602 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 2,356 మంది అర్హత […]పూర్తి వివరాలు ...
చంద్రబాబుకు కోపం వచ్చింది. పట్టిసీమ నుంచి నీళ్లిస్తామని చెబితే వినకుండా సిద్ధేశ్వరం అలుగు కట్టుకుంటామని వెళతారా? అని పోలీసులను ఉసిగొలిపాడు. వాళ్లకు చేతనైనదంతా వాళ్లు చేశారు. మీ పట్టిసీమ మాకెందుకు? సిద్ధేశ్వరం కట్టుకుంటే చాలని అనడమే శాంతిభద్రతల సమస్య అయింది. ముందు రోజే హౌస్ అరెస్టులు చేశారు. నాయకుల కోసం ఆరా తీసి ఆందోళన పెట్టారు. సిద్ధేశ్వరం దారులన్నీ జనమయం అవుతాయని అటకాయించారు. ఇటు నందికొట్కూరు నుంచి, అటు వెలుగోడు నుంచి చెక్‌పోస్టులు తెరుచుకున్నాయి. అసలు దారులు, […]పూర్తి వివరాలు ...
నాగభూషణరెడ్డి స్వస్థలం ప్రొద్దుటూరు కడప: ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి బి.నాగభూషణ రెడ్డి(B.N.రెడ్డి) నైజీరియా దేశంలో భారత హైకమిషనర్‌గా నియమితులయ్యారు. నాగభూషణరెడ్డి స్వస్థలం కడప జిల్లా, ప్రొద్దుటూరు. తండ్రి పేరు డాక్టర్ బి. రామసుబ్బారెడ్డి. నాగభూషణ్ 1993 బ్యాచ్ కు చెందినా ఐఎఫ్ఎస్ అధికారి. ప్రస్తుతం నాగభూషణ రెడ్డి జెనీవాలోని “పర్మినెంట్ మిషన్ ఆఫ్ ఇండియా”లో డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా పని చేస్తున్నారు. త్వరలోనే నాగభూషణరెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. నైజీరియా హైకమిషనర్‌గా నియమితులైన నాగభూషణరెడ్డి గారికి కడప […]పూర్తి వివరాలు ...