బౌద్ధ ప్రదీప కడప కడప జిల్లాలో నందలూరు, పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నాగనాదేశ్వరుని కొండ నేలమాళిగలోని బౌద్ధ స్థూపాలు– బుద్ధుడి మధుర జ్ఞాపకాలు, భావితరాలకు నిత్య స్ఫూర్తి దీపికలు. కడప జిల్లాను కూడా బౌద్ధ పర్యాటకం లో భాగం చేసి, ఇక్కడి బౌద్ధ ప్రదేశాలను అభివృద్ధి చేయవలసిందిగా జిల్లా ప్రజలు, పర్యాటక ప్రియులు, బౌద్ధ విశ్వాసులు కోరుతున్నారు. కడప జిల్లాలో వేల సంవత్సరాల పాటు బౌద్ధం వైభవంగా విరాజిల్లింది. అనంతపురం జిల్లాలోని ఎర్రగుడిలోనూ, కర్నూలు జిల్లా పత్తికొండ […]పూర్తి వివరాలు ...
కడపవెబ్సిరీస్ ‘ఫ్యాక్షనమ్మ రాయలసీమ అయితే ఆ అమ్మ గర్భగుడి కడప’ – వెబ్ సిరీస్ టీజర్లో వోడ్కా మరియు తొడల వర్మగా ఖ్యాతి గడించిన వీర ఫ్లాపు సినిమాల దర్శకుడి వ్యాఖ్యానం. ఇలాంటి విపరీత వ్యాఖ్యానాలకు తెగబడిన రామూది కోస్తా ప్రాంతం కావడం కాకతాళీయం కాదు. వివాదాల్లో చిల్లర వెదుక్కునే రామూ అలియాస్ రాంగోపాల్ వర్మ అనబడే ఫ్లాపు చిత్రాల దర్శకుడూ, సోషల్ మీడియా మేధావి గారూ తన కంపెనీ పేరుతో ఒకానొక పనికిమాలిన వెబ్ సిరీస్‌తో […]పూర్తి వివరాలు ...
వివిధ సందర్భాలలో కడప జిల్లా ప్రజలకు (జగన్ హామీలు) వైకాపా అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు: తేదీ: 7 నవంబర్ 2017, సందర్భం: విపక్షనేత హోదాలో పాదయాత్ర ప్రదేశం: వేంపల్లి, కడప జిల్లా [divider style=”normal” top=”10″ bottom=”10″] ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోగా కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన మూడేళ్లలో కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసి 10వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాంపూర్తి వివరాలు ...
రోజువారీ సర్వీసు నడపనున్న ట్రూజెట్ టికెట్ ధర రూ.1605 కడప: కడప – చెన్నై (మద్రాసు) నగరాల నడుమ ప్రతిరోజూ విమాన సర్వీసు నడిపేందుకు ట్రూజెట్ విమానయాన సంస్థ సిద్ధమైంది. మొదటి విమానం నవంబర్ 16వ తేదీ ఉదయం 9 గంటల 50 నిముషాలకు చెన్నై నుండి బయలుదేరి 10 గంటల 45 నిముషాలకు కడప చేరుతుంది. అదే విమానం మధ్యాహ్నం 2 గంటల 10 నిముషాలకు కడప నుండి బయలుదేరి 03 గంటల 5 నిముషాలకు […]పూర్తి వివరాలు ...
కడప : జీర్ణాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగికి అరుదైన శస్త్రచికిత్సను (ఆపరేషను) రిమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ అరుదైన శస్త్రచికిత్స వివరాలను రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిధర్ శుక్రవారం మీడియాకు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడప నగరానికి చెందిన బాబు అనే వ్యక్తి సంవత్సరం నుంచి కడుపులో గడ్డతో బాధపడుతూ పది రోజుల క్రితం రిమ్స్ జనరల్ మెడిసిన్ వార్డులో చేరినాడన్నారు. రోగిని పరిశీలించిన మొదటి యూనిట్ వైద్యులు రోగి కడుపులో పెద్ద పేగు […]పూర్తి వివరాలు ...
డాక్టర్ వైఎస్సార్ (వైఎస్ రాజశేఖరరెడ్డి) ను నేను చూసింది కేవలం నాలుగు సార్లు. ఒంగోలుకు ఇందిరా గాంధీ వచ్చినపుడు ఆ సభలో తొలిసారి చూసాను. ఆ తరువాత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి మనుమరాలు వివాహ వేడుకలో చూసాను. మరో రెండు సందర్భాల్లో రెండు సార్లు. ప్రత్యక్షంగా మాట్లాడలేదు . దురదృష్టం ఏమిటంటే 2004 వరకు ఆయన పట్ల నాకు అసలు సదభిప్రాయమే లేదు. చంద్రబాబు గొప్ప సంస్కరణవాది అని, ఆయన చాలా మంచి పాలనాదక్షుడు అని […]పూర్తి వివరాలు ...
మురళి వూదే పాపడు కథల సంపుటి ఆవిష్కరణ సామాజిక మార్పును ప్రతిబింబించే దాదా హయాత్ కథలు : సింగమనేని ప్రొద్దుటూరు : సమాజంలో జరుగుతున్న మార్పుకు ప్రతిబింబంగా దాదాహయాత్ కథలు నిలుస్తాయని, గత సమాజపు పరిస్థితులు , నేటి సమాజపు పరిస్థితులను పోల్చి చేసుకునేందుకు ఒక కొలమానంగా నిలుస్తాయన్నారు ప్రముఖ కథా రచయిత, విమర్శకులు సింగమనేని నారాయణ. ఆదివారం ప్రొద్దుటూరు పట్టణంలోని తల్లంసాయి రెసిడెన్సీలో ‘మురళి వూదే పాపడు’ కథల సంపుటిని (దాదా హయాత్ రాసిన కథలు) […]పూర్తి వివరాలు ...
పోతిరెడ్డిపాడు వివాదం – రాయలసీమకు నికరజలాలు రాయలసీమ గుండెచప్పుడు మిత్తకంధాల( పోతిరెడ్డిపాడు) నేడు రెండు తెలుగు రాష్ట్రాల మద్య వివాదంగా మారి అంతే త్వరగా పరిష్కారం అయింది. రెండు తెలుగు రాష్ట్రాల మద్య నీటి పంపకాలలో వివాదం వచ్చినపుడల్లా పోతిరెడ్డిపాడును వాడుకుని చివరకు తమ అసలు కోరిక తీరిన వెంటనే అందరూ సర్దుకుంటారు. నిజానికి చుక్క నీరుకూడా వాడుకోని రాయలసీమ వాసుల మీద పుష్కలంగా నీరు వాడుకుంటున్న వారు కూడా విమర్శలు చేయడం సీమ ప్రజల దుస్దితి. […]పూర్తి వివరాలు ...
కడప : ఇన్నాళ్ళూ పట్టిసీమ రాయలసీమ కోసమేనని దబాయిస్తూ అబద్దాలాడుతూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టకేలకు నిజం చెప్పారు. పట్టిసీమ కృష్ణా డెల్టా కోసమే తీసుకొచ్చామని, తద్వారా ఎగువన కురిసే వర్షాలు, నీటి లభ్యతతో సంబంధం లేకుండా డెల్టాకు ముందుగానే నీరివ్వగలుగుతున్నామని స్పష్టం చేశారు. పట్టిసీమ ద్వారా వచ్చి చేరిన నీటితో ప్రకాశం బ్యారేజిలో నీటి మట్టం 11.2 అడుగులకు చేరింది. దీంతో జూన్ 22న కృష్ణా డెల్టా తూర్పు కాలువకు ఆయన నీటిని విడుదల చేశారు. […]పూర్తి వివరాలు ...