తిరుపతి : నాలుగు జిల్లాలకు చెందిన రిటైర్డు ఉద్యోగులు, ఇంజనీర్లు, విద్యార్థి నాయకులు, మేధావుల సమక్షంలో రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ ఆవిర్భవించింది. రాయలసీమ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో గురువారం రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా బెరైడ్డి మాట్లాడుతూ ఎక్కడి నుంచో వచ్చిన తెల్లదొరసాని నలుగురు […]పూర్తి వివరాలు ...
“కాటమరాయుడా..కదిరి నరసిం హుడా” అంటూ పవన్ కల్యాణ్ “అత్తారింటికి దారేదీ” అనే చిత్రం కోసం పాడిన పాట రాయలసీమలో జనులు పాడుకునే ఒక ప్రసిద్ధ జానపదగీతం. కదిరి తాలూకా ఒకప్పుడు కడప జిల్లాలో భాగంగా ఉండేది. అందువల్ల కడప జిల్లా జానపదులకు కూడా ఈ గీతం బాగా పరిచయమే! శ్రీ మహావిష్ణువు దశావతారాలను ఈ గీతం వివరిస్తుంది. ఈ గీతాన్ని చక్క భజన కళాకారులూ ఇతర జానపద కళాకారులూ వివిధ పద్దతుల్లో పాడుకొంటూ ఉంటారు.. 1940 లో […]పూర్తి వివరాలు ...
విభజన జరిగితే ప్రత్యేక రాయలసీమ ప్రకటించాల్సిందే తెలంగాణలో కలిపేందుకు కర్నూలు జిల్లా ఎవరి అబ్బ సొత్తు అని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన కల్లూరులోని స్వగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు జిల్లాను తెలంగాణలో కలిపేందుకు డీల్లీ కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసిందన్నారు. ఇలాంటి కోతి చేష్టలు ఇప్పటికైనా మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలు బట్టలు విప్పి […]పూర్తి వివరాలు ...
నికర జలాలతో స్వాతంత్య్రం అనంతరం ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదు రెండు దశాబ్ధాలుగా గడిచినా పూర్తి కాని మిగులు జలాల ప్రాజెక్టులు పోతిరెడ్డి పాడును వ్యతిరేఖించిన కోస్తా, తెలంగాణ నాయకులు కోస్తాంధ్రకు పోలవరాన్ని ప్రకటించిన కేంద్రం మనకేమిచ్చింది? తెలంగాణ వారిలాగా మనం కూడా ఓ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం మంచిది ఆరు శతాబ్దాల చరిత్రలో అతి విషమఘట్టంలో వున్న రాయలసీమ వాసులకు ఇప్పుడు రాష్ట్రవిభజన మరింత ప్రమాదకరంగా మారిందని, రాష్ట్రం వీడిపోతే జలయుద్ధాలు తప్పవని రిటైర్డ్ చీఫ్ […]పూర్తి వివరాలు ...
నెహ్రూ వారసులు మొదలెట్టిన ఆట చివరి అంకానికి చేరింది. రాష్ట్ర విభజన రెండుముక్కలాటే అని కాంగ్రెస్ అధినేత్రి ఏకపక్షంగా తేల్చేశారు. ఆ మధ్య ఒక వ్యాసంలో సీనియర్ పాత్రికేయులు ఎం.జె. అక్బర్ చెప్పినట్లు దేశం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నపుడు, ప్రభుత్వం విఫలమైనపుడు వాటి తాలూకు ప్రతిస్పందనలు, ఆందోళనలు జనబాహుళ్యం పైన ప్రభావం చూపుతున్నదని తెలిసిన మరుక్షణం, అదీ ఎన్నికలకు సిద్దమవుతున్న సందర్భంలో వాటిని పక్కదారి పట్టించడానికి మూలన పడిన నిర్ణయాలను, బిల్లులను ఏకబిగిన బయటకు తీసి విన్యాసం […]పూర్తి వివరాలు ...
ఎట్టకేలకు తెలంగాణ గొడవకు తెరదించే పనికి కాంగ్రెస్ పూనుకుంది. ఇది ఆ ప్రాంత ప్రజా పోరాట ఫలం. వారికి ధన్యవాదాలు! కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్న సీమకు కృష్ణా నికరజలాల కేటాయింపు హామీ ఏమైంది? ఈ సందర్భంలో విడిపోయే రాష్ట్రంలో సీమ వాసులు కలిసుంటే మిగిలేది మట్టే. రాయలసీమ అస్తిత్వం కొనసాగాలన్న ఇక్కడ సాగు, తాగు నీరు కావాలన్న ప్రత్యేక రాయలసీమే శరణ్యం. దీనికోసం పాలకులు, ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించాల్సిన తరుణమిది. రాయలసీమ ఎలా వంచనకు గురైంది […]పూర్తి వివరాలు ...
నిన్ననే రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. నిన్న రాత్రి పొద్దు పోయే వరకు పాత్రికేయ మిత్రులు ఎన్నికల ఫలితాలను సేకరించి పార్టీల వారి మద్దతుదారులను లెక్కించే పనిలో ఉండగా, సంపాదకులు, బ్యూరో చీఫ్ లు క్షేత్ర స్థాయి నుండి అందిన సమాచారాన్ని క్రోడీకరించి జిల్లా స్థాయి లేదా రాష్ట్ర స్థాయి బ్యానర్ కథనాన్ని తయారు చేశారు. ఇవాళ ఉదయం ఆయా పత్రికలలో వెలువడిన కథనాలు చెప్పింది ఒక్కటే .. ‘వైకాపా హవా తగ్గిందీ’ అని. నేరుగా […]పూర్తి వివరాలు ...
ఆగస్టు ఒకటో తేదీ నుంచి రాజీవ్‌గాంధి వైద్య విద్య, విజ్ఞాన సంస్థ అనుబంధ వైద్య కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభిస్తామని సంచాలకుడు డాక్టర్ సిద్ధప్ప గౌరవ్ ప్రకటించారు. కౌన్సిలింగ్ ద్వారా కడప రిమ్స్ లో సీటును పొందిన విద్యార్థులు ఈ నెల 31 లోగా కళాశాలలో చేరవలసి ఉంది. తొలిరోజు పది మంది ప్రవేశాలు పొందగా.. శుక్రవారం ఈ సంఖ్య పెరిగింది. వెయ్యి మొదలు కొని పదిహేను వందల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థినీ […]పూర్తి వివరాలు ...
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కడప రెవెన్యూ డివిజన్‌కు చెందిన 17 మండలాల్లో 217 పంచాయతీ సర్పంచ్‌లకు, 1648 వార్డులకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. చక్రాయపేట మండలం […]పూర్తి వివరాలు ...