ఆం.ప్ర రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు తలమానికం మంగంపేట (ఓబులవారిపల్లి మండలం, కడప జిల్లా) ముగ్గురాళ్ళ గనులు – ఇవి ప్రపంచంలోనే ప్రసిద్దిగాంచిన ముగ్గురాళ్ళ గనులు. 1980కి ముందు రాష్ట్ర ప్రభుత్వం మంగంపేటలో సర్వే చేసినప్పుడు 72 మిలియన్ టన్నుల ముగ్గురాయి నిక్షేపాలు ఇక్కడ ఉన్నట్లు వెల్లడయ్యింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కేవలం పది మిలియన్ల పైచిలుకు టన్నుల ముగ్గురాళ్ళను మాత్రమే ఇక్కడ వెలికి తీశారు. ఇంకా సుమారు 60 మిలియన్ టన్నుల ముగ్గురాయి నిక్షేపాలు మంగంపేటలో […]పూర్తి వివరాలు ...
“అధికారం లేదా పదవి అనేది మత్తు మందులా పని చేస్తుంది. ఆ మత్తులో జోగే వాడు దాని నుంచి బయటకు రావటానికి సుతరామూ ఇష్టపడడు. అంతేకాదు ఆ మత్తు కోసం దేన్నైనా పణంగా పెడతారు వాళ్ళు. ఈ మాటలు రాయలసీమ నాయకులకు అచ్చంగా సరిపోతాయి. ఎందుకంటే వారికి అధికారం కావాలి కానీ అక్కడి ప్రజల బతుకు వెతలు పట్టవు. సీమ నాయకులలో 70 శాతం మందికి అక్కడి సాగు, తాగు నీటి సమస్యలపైన అవగాహన లేదు. ఒకవేళ […]పూర్తి వివరాలు ...
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఉపాధి కల్పన మిషన్ ఆధ్వర్యంలో గ్రామీణ యువతీ యువకులకు Spoken English, Writing, Computer Operating అంశాల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ఔత్సాహిక యువత ముందుకు రావాలని సంస్థ పథక సంచాలకుడు వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. జనవరి 18 నుంచి 20వ తేదీ వరకూ నగరశివారు టీటీడీసీలో ముఖాముఖికి హాజరు కావాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు అక్కడే శిక్షణ తరగతులు ప్రారంభిస్తామని వివరించారు. వసతి, భోజన […]పూర్తి వివరాలు ...
‘సీతాదేవి ఎలా వుంటుంది?.. ‘లవకుశ’ సినిమాలో అంజలీదేవిలా వుంటుందా…!’ ‘ ఏమో..! అలాగే వుంటుందేమో…!’ 1963 నాటి ‘లవకుశ’ సినిమాను చూసిన వారెవరైనా పై ప్రశ్నకు సమాధానం ఇలాగే చెబుతారు. ఎందుకంటే అందులో అంజలీదేవి ధరించిన సీత పాత్ర ఆమెకు అంత పేరును తెచ్చి పెట్టింది. పెద్దాపురంకు చెందిన అంజనీ కుమారి నటన, నృత్యం వంటి పలు అంశాలలో తనదైన ముద్రను వేసుకున్నారు. చిన్నప్పటి నుండి నాటకాలతో సహజీవనం సాగించిన అంజనీకుమారి అనుకోకుండా సినీ రంగంలోకి ప్రవేశించారు. […]పూర్తి వివరాలు ...
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బన్వర్‌లాల్ ఈ రోజు (ఆదివారం) కడప జిల్లాలోని వీర బ్రహ్మేంద్రస్వామి సమాధిని దర్శించుకొని, మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు విప్రో, సంతూర్ సౌజన్యంతో వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేకానంద 150 జయంతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గులపోటీ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతీ యువకులకు ఓటు విలువ, ఓటు హక్కు వినియోగం గురించి వివరించారు. ఇప్పుడు ఓటు వేయలేకపోతే 5 సంవత్సరాలపాటు ఓటుకు దూరం […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరులో అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నంద్యాల వరదరాజులురెడ్డి టీడీపీ పార్టీలో చేరుతున్నారన్న ఊహాగానాలు భారీగా ఊపందుకున్నాయి. ఇప్పటికే ఒకసారి కాంగ్రెస్ నుండి వైకాపా లోకి వెళ్ళిన వరద అక్కడ ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపధ్యం కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్తితి కనిపిస్తుండడంతో వరద తెదేపా వైపు చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఆయన వీటిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన వరద చేయలేదు. 2009లో వరదరాజులురెడ్డి కాంగ్రెస్ టిక్కెట్‌పై […]పూర్తి వివరాలు ...
కడప: ఈ సంవత్సరం ఫిబ్రవరి – మార్చి నెలల్లో నిర్వహించే ప్రతిష్టాత్మకమైన జాతీయస్థాయి గేట్-2014కు కడప జిల్లాకు పరీక్షా కేంద్రం మంజూరైంది. ఆన్ లైన్ పద్ధతిలో నిర్వహించనున్న గేట్-2014 పరీక్షా కేంద్రం జిల్లాకు మంజూరు కావడంతో ఇక్కడి విద్యార్థులు తిరుపతి లేదా ఇతర నగరాలకు వెళ్ళవలసిన బాధ తప్పింది.దీనికి సంబంధించి ఇటీవల టిసిఎస్ సంస్థ ప్రతినిధులు ఐఐటి మద్రాసు తరపున ఆన్ లైన్ పరీక్ష కేంద్రం ఎంపిక కోసం మూడు నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలను పరిశీలించి వెళ్లారు. పరీక్షా […]పూర్తి వివరాలు ...
టోర్నీకి వివిధ రాష్ట్రాల నుండి 500 మంది కడప: నగరంలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 4 నుంచి 10 వరకూ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఏపీ బ్యాడ్మింటన్ రాష్ట్ర కార్యదర్శి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి(ఈవెంట్) పున్నయ్య చౌదరి ప్రకటించారు. ఆల్ ఇండియా సబ్‌జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహణ విషయమై ఏజేసీ సుదర్శన్‌రెడ్డిని బ్యాడ్మింటన్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పున్నయ్య చౌదరి, వైస్సార్ క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి రామచంద్రారెడ్డి, జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, […]పూర్తి వివరాలు ...
కడప: పెద్దదర్గాలో శుక్రవారం హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా మహమ్మద్ మహమ్మదుల్ అమీన్‌పీర్ సాహెబ్ చిష్ఠివుల్ ఖాద్రీ ఉరుసు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. పెద్ద ఉరుసు ఉత్సవాన్ని తలపిస్తూ భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. ఇందులో భాగంగా దర్గాలోని హజరత్ అమీన్‌పీర్ సాహెబ్ మజార్‌ను రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో కన్నుల పండువగా అలంకరించారు. భక్తులు […]పూర్తి వివరాలు ...