కడప: కడప జిల్లా రచయితల సంఘానికి 4 దశాబ్దాలు అవిశ్రాంత సేవలందించిన ప్రముఖ రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి (88) కన్నుమూశారు. నెల రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్‌లో ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. అక్కడే పొరపాటున మంచంపైనుంచి జారిపడ్డారు. వెన్నెముక వెనుక భాగంలో కాస్త చీలిక ఏర్పడింది. దీంతో ఆయన నడవలేకపోయారు. అప్పటినుంచి ఆరోగ్యం కుదురుగా లేదు. ఆయనకు హైదరాబాద్‌లో ఉండడం ఇష్టం లేకపోవడంతో కుటుంబసభ్యులు కడప లోని రాజీవ్ వైద్యవిజ్ఞాన సంస్థ(రిమ్స్)లో చేర్చారు.అక్కడ చికిత్స […]పూర్తి వివరాలు ...
చక్రాయపేట : రంగస్థల నాటక రంగంలో విభిన్న పాత్ర పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న కళాకారుడు వెంకటకృష్ణయ్య ఇకలేరు. రంగస్థలంపై అనేక ప్రదర్శనలు ఇచ్చిన నటుడు వెంకటకృష్ణయ్య మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు పేర్కొన్నారు. నాగులగుట్టపల్లెలో నివాసముంటున్న నటుడు వెంకటకృష్ణయ్య బుధవారం కన్నుమూశాడు. పౌరాణిక, సాంఘిక ఘట్టాలలో పలు వైవిధ్యభరతమైన పాత్రలు పోషించిన వెంకటకృష్ణయ్య స్వగ్రామం లక్కిరెడ్డిపల్లె. 1953లో కృష్ణయ్య విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉద్యోగ రీత్యా 1975దశకంలో రికార్డు […]పూర్తి వివరాలు ...
II విష్ణు ఉవాచః II నమో రుద్రాయ శాంతాయ బ్రహ్మణే పరమాత్మనే I కపర్దినే మహేశాయ జ్యోత్స్నాయ మహతే నమః II త్వం హి విశ్వసృపాం స్రష్టా ధాతా తవం ప్రపితామహః I త్రిగుణాత్మా నిర్గుణశ్చ ప్రకృతైః పురుషాత్పరః II నమస్తే నీలకంఠాయ వేధసే పరమాత్మనే I విశ్వాయ విశ్వబీజాయ జగదానన్దహేతవే II ఓంకారస్త్వం వషట్కార స్సర్వారంభ ప్రవర్తకః I హన్తకారస్స్వధాకారో హవ్యకవ్యాన్నభుక్ సదా II నమస్తే భగవన్ రుద్ర భాస్కరామితతేజసే పూర్తి వివరాలు ...
ఇది ఊహకు అందని విషయమనీ … మీరు నమ్మరనీ మాకూ తెలుసు. మీరు ఈ విషయాన్ని నమ్మాలని మేము కోరుకోవడం లేదు. కాకపొతే అలోచించి చూడండి – మీకే తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణను ఊహలకు అందకుండా పార్లమెంటు సాక్షిగా ఆమోదించిన కాంగిరేసు పెద్దలు ఇప్పుడు మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు చెప్పి వైకాపా మరియు తెదేపాలకు తలనొప్పి సృష్టించేందుకు చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు డిల్లీ పెద్దలు పెద్ద వ్యూహమే రూపొందించినట్లు నిఘా వర్గాల సమాచారం. […]పూర్తి వివరాలు ...
కడప : దేశభాషలందు తెలుగులెస్స అన్నది నిన్నటి మాట. నేడు విశ్వభాషలందూ తెలుగేలెస్స అనాలి! విశ్వభాషగా ఎదిగే శక్తికలిగిన భాషాగా తెలుగుకు అర్హతలున్నాయని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత కులసచివుడు ఆచార్య పీఎల్ శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో భారత జాతీయ కళా వారసత్వ పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ భాషాదినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రాథమిక దశ నుంచి తెలుగు చదువుకునే స్థానంలో సంస్కృతం, […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరులో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 8.30 మధ్య జరుగనున్న దివ్య సత్సంగ్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ అనుగ్రహ భాషణం చేయనున్నారు. ఇందుకోసం టీబీ రోడ్డులో ఉన్న అనిబిసెంట్ పురపాలిక మైదానం భారీ వేదికతో సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం గురూజీ శిష్యులు పర్యటన వివరాలను వెల్లడించారు. శనివారం ఉదయం 7 గంటలకు రవిశంకర్ గురూజీ ప్రత్యేక రైలులో హైదరాబాద్ కాచిగూడ నుంచి ప్రొద్దుటూరుకు బయల్దేరనున్నారు. 22 బోగీలున్న ఈ రైలులో వెయ్యిమంది శిష్యులు ఉంటారన్నారు. […]పూర్తి వివరాలు ...
హెడ్డింగు చూసి ఆశ్చర్యపోయే ముందు కాస్త నిభాయించుకోండి. ఎందుకంటే రైల్వే మంత్రి ఖార్గే గారడీ చేసి బడ్జెట్ ను తియ్యగా కనిపించేట్లు చేశారు. నిజం చెప్పాలంటే రైల్వే బడ్జెట్ విషయంలో జిల్లాకు మళ్లీ మొండి చెయ్యే ఎదురైంది. జిల్లా మీదుగా నాలుగు రైళ్ళు నడవనున్నా అవి సగటున సంవత్సరానికి కేవలం 42 రోజులు మాత్రమే నడుస్తాయి. అంటే సంవత్సరమంతా కలిపి కేవలం ఒకటిన్నర నెల రోజులు మాత్రమే మనకు ఈ రైళ్ళు అందుబాటులో ఉంటాయి. నాలుగు రైళ్ళని […]పూర్తి వివరాలు ...
కడపను క్రీడల ఖిల్లాగా తయారు చేస్తామని కలెక్టర్ కోన శశిధర్ ప్రకటిం చారు. ఇక్కడి వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో అఖిల భారత బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ ర్యాంకింగ్ పోటీలను శుక్రవారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. కడపలో తొలిసారి ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు మంచి సూచనలు ఇస్తే రాబోయే కాలంలో మరింత పకడ్బందీగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తానని […]పూర్తి వివరాలు ...
దక్షిణ భారతదేశంలో విశిష్టమైన చారిత్రక ప్రదేశం గండికోట. నాటి విదేశీ పర్యటకుల నుంచి నేటి చరిత్రకారుల దాకా రెండో హంపీగా కొనియాడిన ప్రాంతమిది. ఈనెల 8 నుంచి రెండురోజులపాటు గండికోట వారసత్వ ఉత్సవాల నిర్వహించాలని జిల్లా పాలనాధికారి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో యంత్రాంగం చిత్తశుద్ధి, గండికోట అభివృద్ధికి ఎదురవుతున్న ఆటంకాలు, పర్యటక వికాసం వంటి అంశాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో గండికోట చరిత్ర, పర్యాటక విశేషాలపై ‘గండికోట’ పేరుతో పుస్తకాన్ని రచించిన కథా రచయిత […]పూర్తి వివరాలు ...