గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారూ! రాష్ట్రం విడిపోయాక ముఖ్యమంత్రైన మీరు మొట్టమొదటిసారిగా నవంబర్ 8న కడప జిల్లాకు వస్తున్నారన్నప్పుడు పారిశ్రామిక రంగంలో మా జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది కాబట్టీ, రాజధానిగా విజయవాడను నిర్ణయిస్తూ చేసిన ప్రకటనలో భాగంగా కడపజిల్లాలో ఖనిజాధారిత పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా నెలకొల్పుతామని ధారాళంగా మాట ఇచ్చారు కాబట్టీ జిల్లాను పారిశ్రామిక రంగంలో ఏ విధంగా “ముందుకు తీసుకుపోనున్నారో” మీకున్న “విజన్”తో ఒక రోడ్ మ్యాప్ ప్రకటించగలరని కొండంత ఆశతో ఎదురుచూశాం. అవేవీ […]పూర్తి వివరాలు ...
జమ్మలమడుగులో తీవ్ర ఉత్కంఠ జమ్మలమడుగు: షాద్‌నగర్ జంట హత్యల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు బుధ,గురువారాల్లో విచారణతోపాటు తుదితీర్పు వెలువరిస్తుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో జమ్మలమడుగులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ముద్దాయిగా ఉన్నారు. గత ఆగస్టు 21న, సెప్టెంబర్ 18 వతేదీన సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చి తీర్పు వెలువడుతుందని భావించారు. అయితే రెండు సార్లూ వారుుదా పడింది. 1990లో షాద్‌నగర్‌లో దేవగుడి శంకర్‌రెడ్డి, లక్కిరెడ్డి గోపాల్‌రెడ్డిలు హత్యకు గురయ్యారు. […]పూర్తి వివరాలు ...
కడప: అసోంలో కిడ్నాపైన ఆంధ్రప్రదేశ్ సివిల్ కాంట్రాక్టర్ మహేశ్వరరెడ్డి విడుదలయ్యారు. ఆయన క్షేమంగా ఉన్నారని మహేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. అసోంలో కిడ్నాప్ చేసిన బోడో మిలిటెంట్లు ఆయనను పాట్నాలో విడుదల చేశారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. మహేశ్వరరెడ్డి విడుదలయ్యారన్న విషయాన్ని మాదాపూర్ డీసీపీ కార్తీకేయ నిర్ధారించారు. అసోంలోని దివాస్ జిల్లా గౌడీ(అటవీ) ప్రాంతంలో మహేశ్వరరెడ్డిని ఆదివారం బోడో మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. మహేశ్వరరెడ్డి స్వస్థలం వైఎస్సార్ జిల్లా రామాపురం మండలం హసనాపురం.పూర్తి వివరాలు ...
అస్సోం రాష్ట్రంలో కాంట్రాక్టు పనులు చేయిస్తున్న పప్పిరెడ్డి మహశ్వరరెడ్డిని ఆదివారం బోడో మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. మహశ్వరరెడ్డి రామాపురం మండలం హసనాపురం గ్రామ వాసి. దివాస్ జిల్లా గౌడీ(అటవీ) ప్రాంతంలో ఇతను కిడ్నాప్‌కు గురైనట్లు బంధువులు తెలిపారు. క్లాస్‌వన్ కాంట్రాక్టర్ అయిన మహేశ్వరరెడ్డి గుజరాత్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అస్సోం రాష్ట్రాలలో ఐఎల్ఎఫ్( రాంకీ కంపెనీ )లో సబ్ కాంట్రాక్టర్‌గా పని చేయిస్తున్నారు. వారం రోజుల నుంచి అక్కడే ఉండి పనులు పర్యవేక్షించి ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చేందుకు […]పూర్తి వివరాలు ...
కడప: త్వరలోనే జమ్మలమడుగు ప్రాంతంలో చిత్ర నిర్మాణం ప్రారంభించనున్నట్లు దర్శకుడు తేజ చెప్పారు. శనివారం నిర్మాత వివేకానందతో కలిసి తేజ గండికోటను సందర్శించి అక్కడి ప్రదేశాలను పరిశీలించారు. గండికోటలోని మాధవరాయస్వామి దేవాలయం, జుమ్మామసీదు, ధాన్యాగారం, తదితర ప్రదేశాలను పరిశీలించారు. అలాగే జమ్మలమడుగుటోని వందేళ్ల చరిత గల ప్రభుత్వ పీఆర్ పాఠశాల, ఆర్డీవో కార్యాలయం, ఎల్ఎంసీ స్కూలు ప్రాంతాలను పరిశీలించారు.పూర్తి వివరాలు ...
కబడ్డీ సబ్‌జూనియర్స్ జాతీయస్థాయి చాంపియన్‌షిప్ పోటీలకు వీరపునాయునిపల్లె జూనియర్ కళాశాలలో చదువుతున్న ఎ.అపర్ణ, రైల్వేకోడూరు ఎస్.వి.జూనియర్ కళాశాలలో చదువుతున్న కె.ప్రశాంత్ ఎంపికైనట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సీఆర్ఐ సుబ్బారెడ్డి, చిదానందగౌడ తెలిపారు. గత నెల 16 నుంచి 19వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన 26వ సబ్‌జూనియర్స్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో వీరు ప్రతిభ చూపడంతో మొదట ప్రాబబుల్స్‌కు ఎంపికచేశారన్నారు. కాకినాడలో అక్టోబరు 24 నుంచి నవంబరు 4వ తేదీ వరకు […]పూర్తి వివరాలు ...
కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రోజు శనివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం చంద్రబాబు వైఎస్సార్ జిల్లాకు రావడం ఇదే ప్రథమం. అందుకు సంబంధించి బాబు తన పర్యటనలో అధికారికంగా పలు కార్యక్రమాలకు బాబు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పర్యటన సాగేదిలా…. చంద్రబాబునాయుడు శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో హైదరాబాదు నుంచి బయలుదేరి 11.30 గంటలకు రేణిగుంటకు చేరుకుని 12.00 గంటలకు కోడూరు సమీపంలోని ఓబనపల్లెకు చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యకక్రమాల్లో పాల్గొంటారు. […]పూర్తి వివరాలు ...
సిద్దవటం ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పి.శైలజ, జగదీశ్వర్‌రెడ్డి జాతీయ స్థాయి అండర్-16 నెట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు రవిబాబు, వ్యాయామ ఉపాధ్యాయుడు రెడ్డెయ్య తెలిపారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు బాలికల విభాగంలో శైలజ, బాలుర విభాగంలో జగదీశ్వర్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. నవంబర్ 1 న విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-16 నెట్‌బాల్ పోటీలో వీరు ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు అర్హత సాధించారన్నారు. […]పూర్తి వివరాలు ...
కడప: 2014 -15 విద్యా సంవత్సరం కళాశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థులు ఉపకారవేతనాల కోసం ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు ప్రసాద్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగులు, మైనార్టీ విద్యార్థులు ప్రైవేటు, ఎయిడెడ్, ప్రభుత్వ జూనియరు డిగ్రీ కళాశాలలు, వృత్తివిద్య కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తునకు అర్హులన్నారు. అర్హులైన విద్యార్థులు https://apepass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషను చేసుకోవాలన్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 2లక్షల లోపున్న […]పూర్తి వివరాలు ...