రాయలసీమలో ఇప్పటికీ గుక్కెడు నీటికోసం అలమటించే అభాగ్య జీవులున్నారు. ఇంటికి భోజనానికి వచ్చిన చుట్టాన్ని కాళ్లు కడుక్కోమనడానికి బదులుగా, చేయి కడుక్కోమని చెప్పాల్సిన దుర్భర పరిస్థితులు సీమ ప్రాంతంలో తారసపడుతుంటాయి!గంజి కరువూ, డొక్కల కరువూ పేరేదైనా బుక్కెడు బువ్వ కోసం, గుక్కెడు నీటి కోసం నకనకలాడిన రాయలసీమ చరిత్రకు కైఫీయత్తులు సైతం సాక్ష్యాధారంగా నిలుస్తున్నాయి. సీమ రైతులు , తమ కంట్లో పెల్లుబుకుతున్న కన్నీటి చెమ్మను తుడుచుకుంటూ నీటిచెమ్మ కోసం భూమిని 500 అడుగుల లోతు దాకా […]పూర్తి వివరాలు ...
అండర్-17 విభాగంలో 5 బంగారు పతకాలు అండర్-14 విభాగంలో 11 బంగారు పతకాలు కడప: విజయవాడలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి ఈత(స్విమ్మింగ్) పోటీలలో వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులు పతకాల పంట పండించారు. మొత్తం 29 పతకాలను (16 బంగారు, 11 వెండి, 3 కాంస్య పతకాలు) సొంతం చేసుకుని కడప జిల్లా కీర్తి పతాకను ఎగరేశారు. పతకాలు సాధించిన విద్యార్థులలో 11 మంది డిసెంబరు 15 నుంచి 20వ […]పూర్తి వివరాలు ...
మెగాసిటీ తెలుగువాళ్ళ కోసమా తమిళుల కోసమా? “బెంగళూరుకు ఉపనగరంగా అనంతపురాన్ని అభివృద్ధి చేయాలి.” – మొన్న (ఆగస్టు 7) కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు. అంటే బెంగళూరు నగరం యొక్క జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనంతపురం వరకు (గూగుల్ మాప్స్ ప్రకారం 214 కి.మీ.) ఉందని ఒకవైపు అంగీకరిస్తూ, మనరాష్ట్రం దక్షిణభాగంలో మెగాసిటీగా అభివృద్ధిచెయ్యడానికి రాష్ట్రసరిహద్దుల్లో ఉన్న తిరుపతిని ఎంచుకోవడం ఏ రకమైన విజ్ఞతో ఆలోచించుకోవాలి. అభివృద్ధి విషయంలో మెగాసిటీ పరిధి ఒక్క ఆ నగరానికే పరిమితం […]పూర్తి వివరాలు ...
కడప: 2015-16 సంవత్సరాలకు గాను అక్రిడిటేషన్ సౌకర్యం కోసం జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు డిసెంబర్ 5వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని అక్రిడిటేషన్ కమిటీ అధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ కె.వి.రమణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో మూడేళ్లు, మండల స్థాయిలో రెండేళ్ళ పాటు పాత్రికేయ వృత్తిలో అనుభవం తప్పని సరిగా ఉండాలని తెలిపారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టు విభాగంలో దరఖాస్తు చేసేవారు పేరుతో సహా ప్రచురితమైన 12 వార్తా కథనాల ప్రతులను దరఖాస్తుకు జతచేసి సమర్పించాలని […]పూర్తి వివరాలు ...
బుధవారం కడపలో జరిగిన 22వ రాష్ట్ర మహాసభలో కథకుడు, కడప.ఇన్ఫో గౌరవ సంపాదకులు తవ్వా ఓబుల్రెడ్డిని జర్నలిస్ట్స్ అషోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( జాప్ ) ఘనంగా సత్కరించింది. సీనీయర్ పాత్రికేయులైన ఓబుల్ రెడ్డి గతంలో జాప్కు కడప జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేసినారు. జాతీయ పాత్రికేయ సంఘం ( ఎన్.యు.జె ) అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ , జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగా రెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గూడూరు రవి, […]పూర్తి వివరాలు ...
కడప: సీమ సమగ్రాభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్దిపైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకూ రాయలసీమ వ్యాప్తంగా సంతకాల సేకరణ, 24, 25 తేదీలలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయనున్నట్లు అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్యల జిల్లా నాయకులు చెప్పినారు. మంగళవారం స్థానిక రారా గ్రంథాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ… రాయలసీమపై వివక్ష చూపితే సహించేదిలేదని పరిస్థితిలో మార్పురాకపోతే ప్రభుత్వంపై తిరగబడతామని హెచ్చరించారు. […]పూర్తి వివరాలు ...
కడప: జీవిత బీమా పాలసీదారులపై ప్రభుత్వ విధిస్తున్న సేవా పన్నును తొలగించాలని భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్లు డిమాండ్ చేశారు. జీవిత బీమా పాలసీదారులపై కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మంగళవారం నాగరాజుపేటలోని జీవిత బీమా కార్యాలయం ఎదుట సంఘం అధ్యక్షులు సుబ్బారెడ్డి, ఈశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలసీదారుల బీమా గడువుతీరిన తర్వాత ఇచ్చే మొత్తంపై ఆదాయ పన్నును తొలగించాలని కోరారు. బీమా […]పూర్తి వివరాలు ...
ప్రారంభానికి సర్వమూ సిద్దమై చివరి నిమిషంలో ఆగిపోయిన (ప్రారంభం వాయిదా పడ్డ) కడప విమానాశ్రయం గురించి డైరెక్టరుగారు ఇచ్చిన సమచారమిది… ప్రశ్న: కడప విమానాశ్రయ ప్రస్తుత పరిస్తితి ఏమిటి? సమాధానం: విమానాశ్రయానికి సంబంధించిన రన్ వే, టెర్మినల్ భవనం, ఏటిసి (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) స్తూపాల నిర్మాణం పూర్తయింది. ప్రశ్న: కడప విమానాశ్రయం ఎప్పటి నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది? సమాధానం: సమాచారం అందుబాటులో లేదు ప్రశ్న: కడప విమానాశ్రయం ఎప్పటి నుంచి ప్రజలకు అందుబాటులోకి […]పూర్తి వివరాలు ...
ఇటీవల అసోంలో మహేశ్వరరెడ్డి అనే జిల్లావాసిని బోడో తీవ్రవాదులు అపహరించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఫిర్యాదులో పేర్కొన్న వైనానికి,బోడో తీవ్రవాదుల పద్దతులకు తేడా కనిపించడంతో పోలీసులు జాగ్రత్తగా ట్రాక్ చేసి అసలు విషయం ఛేదించారు. మహేశ్ రెడ్డి కాంట్రాక్టర్ కిడ్నాప్ డ్రామా ఆడారన్న విషయం బహిర్గతం అయింది.కిడ్నాప్ డ్రామా ఆరంభించిన మహేశ్ పాట్నాకు రైలులో వెళ్లిపోయారట. ఆయన పాట్నా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.అంతేకాక ఆయన ఎపిలోని తన ఇంటికి ఫోన్ చేసి తాను కిడ్నాప్ కు […]పూర్తి వివరాలు ...