కడప: ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని.. లేదంటే ప్రభుత్వ మెడలు వంచి చేయిస్తామని వైకాపా నేతలు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం కడప కలెక్టరేట్ ఎదుట వైకాపా నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. ఈ సందర్భంగా పలువురు నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీరుపైన విమర్శలు గుప్పించారు. సొంతమామనే వెన్నుపోటు పొడిచిన బాబుకు రైతుల్ని, మహిళల్ని నిలువునా ముంచడం పెద్ద విశేషమేమి కాదని పలువురు శాసనసభ్యులు వ్యాఖ్యానించారు. నగర మేయర్ సురేష్‌బాబు […]పూర్తి వివరాలు ...
కడప: నగరంలో నేడు వైకాపా ధర్నా కార్యక్రమానికి వచ్చే నేతలు, రైతులు, పార్టీ కార్యకర్తల వాహనాల రాకపోకలకు సంబంధించి కడప డీఎస్పీ అశోక్‌కుమార్ ఆంక్షలు విధించారు. మైదుకూరు, కమలాపురం, పులివెందుల రోడ్డు మార్గంలో వచ్చే వాహనాలను మోచంపేట వద్ద ఉన్న మరాఠీ మఠం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. బద్వేలు, రాజంపేట, రాయచోటి మార్గం నుంచి వచ్చే వాహనాలకు రాజారెడ్డివీధిలోని సీఎస్ఐ చర్చి వెనుక ఖాళీ స్థలాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో నిల్వ ఉన్న 1166 టన్నుల ఎర్రచందనం మొదటి విడత టెండర్లలో సుమారు రూ.315కోట్లు ధర పలికింది. ఎర్రచందనానికి నిర్వహించిన ఈ టెండర్లలో వ్యాపారులు కడప జిల్లాలో నిల్వ ఉన్న ఎర్రచందనానికి టెండర్లు పాడారు. వీటిలో బీ, సీ గ్రేడులు మాత్రమే ఉన్నాయి. వీటిలో బీ గ్రేడు ఎర్రచందనం కేవలం సుమారు రెండు టన్నులు మాత్రమే ఉండగా మిగిలిన 1164 టన్నులు సీ గ్రేడ్ ఎర్రచందనం. ఈ మొత్తానికి మొదటి విడతలో ఈ టెండర్లు పిలిచారు. […]పూర్తి వివరాలు ...
వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థుల ఘనత కడప : కాకినాడలో నవంబరు 27, 28 తేదీలలో జరిగిన రాష్ట్రస్థాయి 60వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులు 23 పతకాలను సొంతం చేసుకుని కడప జిల్లా సత్తా చాటారు. మొత్తం 8 బంగారు, 11 రజతం, 4 కాంస్య పతకాలు సాధించి విజయకేతనం ఎగురవేశారు. అండర్-14 బాలికల విభాగంలో కడపకు టీం ఛాంపియన్షిప్ వచ్చింది. అండర్-17 బాలుర విభాగంలో కడప జట్టు మూడవస్థానాన్ని పొందింంది. విజయవాడలో […]పూర్తి వివరాలు ...
కడప: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు అంకాళమ్మగూడూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అయిదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గతనెల కృష్ణా జిల్లాలో సీబీఆర్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ 60వ హ్యాండ్‌బాల్ పోటీల్లో సత్తా చాటి జాతీయస్థాయి పోటీలకు వీరు ఎంపికయ్యారన్నారు. అండర్-14 బాలుర విభాగంలో కె.పెద్దిరాజు, బాలికల విభాగంలో దీపిక, కడపనాగయ్యపల్లికి చెందిన లక్ష్మీచంద్రిక, తేజస్విని ఈ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. అండర్-17 బాలికల విభాగంలో […]పూర్తి వివరాలు ...
కడప: మైదుకూరు సమీపంలోని రాణిబాయి దగ్గర ఉన్న ‘మల్లుగానిబండ’పై ఆదిమానవులు గీసిన బొమ్మలను (రేఖా చిత్రాలను) యోగివేమన విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ వెలుగులోకి తెచ్చింది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ శనివారం ఈ రేఖాచిత్రాలను విడుదల చేశారు. చిత్రాలను అధ్యయనం చేసిన విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం అవి బృహత్ శిలాయుగం, నవీన శిలాయుగాలకు చెందినవిగా తేల్చింది. చరిత్ర పురావస్తుశాఖ విభాగాధిపతి డాక్టరు రామబ్రహ్మం, భూవిజ్ఞానశాఖ సహాయాచార్యులు డాక్టరు కె.రఘుబాబు, చరిత్ర పురావస్తుశాఖ పరిశోధక విద్యార్థి ఎస్వీ […]పూర్తి వివరాలు ...
దేశంలోని అన్ని నదులకూ 12 యేళ్ళకు ఒకసారి పుష్కరాలు వస్తే.. పెన్నానదికి ప్రతియేటా ఫాల్గుణ మాసం లో పున్నమి రోజున ఒకరోజు పుష్కరాలు వస్తాయని ప్రముఖ సిద్ధాంతి శ్రీ సొట్టు సాంబమూర్తి వెల్లడించారు. రాష్ట్రంలొ గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదుల తర్వాత అతి పెద్దనదిగా పెన్నానది గుర్తించబడింది. కర్నాటకలోని నంది కొండల్లో పుట్టి రాష్ట్రంలోని అనంతపురం, కడప, నెల్లురు జిల్లాలలో దాదాపు 597 కిలోమీటర్లు ప్రవహించి నెల్లూరు జిల్లా ఊటకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. రాయలసీమలోని అనంతపురం, […]పూర్తి వివరాలు ...
ఐజీకార్ల్: కడప జిల్లాలో ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్ లైవ్‌స్టాక్ (IGCARL) అనే పేరుతో ఒక (supposedly) ప్రపంచస్థాయి పరిశోధనా సంస్థ ఏర్పాటై ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వివిధ దేశాల, సంస్థల ప్రతినిధుల రాకపోకలు నిరాటంకంగా, సౌకర్యవంతంగా సాగడానికి వీలుగా కడప విమానాశ్రయం నుంచి ఈ సంస్థ దాకా నాలుగు వరుసల రహదారితో సహా IGCARLలో భవంతులు, ఇతర మౌలిక సౌకర్యాలైతే సిద్ధమయ్యాయిగానీ వాటిని సద్వినియోగం చేసుకుని, ఆ […]పూర్తి వివరాలు ...
కడప: హైకోర్టును కడపలో ఏర్పాటు చేయాలని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగరాజు శాసనమండలి ఉప సభాపతి సతీష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కడపలో హైకోర్టు ఏర్పాటుకు నూతన కలెక్టరేట్ భవన సముదాయం సిద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా విమానాశ్రయం, రైల్వే స్టేషన్ వసతులు ఉన్నాయన్నారు. హైకోర్టును కడపలో ఏర్పాటు చేస్తే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు అన్ని జిల్లాల కక్షిదారులకు కడప కేంద్రంగా ఉంటుందన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే హెల్త్‌కార్డులు న్యాయవాదులకు మంజూరు […]పూర్తి వివరాలు ...