కడప : శ్రీరామనవమి ఉత్సవాల నేపథ్యంలో ఒంటిమిట్టకు 120 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రాంతీయ అధికారి గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 6 వరకు జిల్లాలోని 8 డిపోల పరిధిలో ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని చెప్పారు. కడప డిపో నుంచి 25, రాజంపేట 30, ప్రొద్దుటూరు 15, బద్వేలు, పులివెందుల, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగు డిపోల నుంచి పది బస్సుల చొప్పున మొత్తం 120 బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నట్లు వెల్లడించారు.ఆర్టీసీ […]పూర్తి వివరాలు ...
జిల్లాపై వివక్ష కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కడప : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాపై వివక్ష కొనసాగిస్తున్నాడని , ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఇతర జిల్లాకు తరలించడమే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్అహ్మద్ ఆరోపించారు. స్థానిక ఇందిరాభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కడప జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ, ఒంటిమిట్ట ఉత్సవాలు, పెద్దదర్గా అభివృద్ధి, ఫుడ్‌పార్క్ మొదలైన వాటిపై శాసనసభలో ప్రకటన చేశారని.. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు. ఉర్దూ […]పూర్తి వివరాలు ...
హైదరాబాదు: అన్ని విధాలుగా వెనుకబడిన రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన ప్రజల్లో కూడా ఉందని ఆయన అన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘ గ్రేటర్ రాయలసీమలో హైకోర్టు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ… రాయలసీమ వెనుకబాటుతనం గురించి ఎవ్వరూ […]పూర్తి వివరాలు ...
సీమ కోసం పోరాడేందుకు అఖిలపక్షం, ప్రజా సంఘాలు కలసి రావాలి జాతీయ జెండా సాక్షిగా చంద్రబాబు విఫలం కర్నూలు: రాయలసీమ అభివృద్ధికి సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు చెప్పారు. బుధవారం కర్నూలులోని సి.క్యాంప్ సెంటర్లోని లలిత కళాసమితిలో ‘రాయలసీమ అభివృద్ధి- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కొత్త రాష్ట్రంలో తొలి […]పూర్తి వివరాలు ...
రేపటి నుంచి ఉత్సవాల అంకురార్పణ కడప: ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలను ఈ నెల 27వ నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటరమణ తెలిపారు. భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో సెల్ఫోన్లు, కెమేరాలు వెంట తీసుకెళ్లరాదని, పాదరక్షలు వేసుకుని వెళ్లరాదని సూచించారు. దర్శనం టికెట్ దేవస్థానంలో కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. 27వ తేదీ ఉదయం 4 గంటల నుంచి ప్రజలు స్వామిని దర్శించుకునే వీలు కల్పించామన్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: లోటును అధిగమించేందుకు విద్యుత్ చార్జీలు, పన్నుల పెంపు సమంజసమే అని మాజీ శాసనసభ్యుడు నంద్యాల వరదరాజులురెడ్డి సమర్ధించారు. బుధవారం స్థానిక తెదేపా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ… స్పీకర్ పట్ల వైకాపా సభ్యులు అనుచితంగా ప్రవర్తించి ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేశారని ఆరోపించారు. వైకాపా తన వైఖరిని మార్చుకోవాలని వరద సూచించారు. ప్రతిపక్షం హుందాగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్న విషయం జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. వైకాపాలో గూండాగిరి చేసే వారు అధికంగా […]పూర్తి వివరాలు ...
కడప: కడప – కర్నూలు కాలువ ఆధునికీకరణ పనుల కోసం రూ.25కోట్లు ఖర్చుచేయాల్సి వస్తుందని అధికారులు చెబితే ప్రభుత్వం రూ.4.9కోట్లు కేటాయించడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి నిధులు, నికర జలాలు సాధించి సకాలంలో పూర్తిచేస్తానని మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబునాయుడు ప్రస్తుతం సీమ ప్రయోజనాలను గాలికొదిలేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం రాజోలి ఆనకట్ట పరిశీలనకు ప్రతినిధి బృందం వెళ్లి వచ్చింది. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ కేసీ కాలువ […]పూర్తి వివరాలు ...
పట్టిసీమ ద్వారా రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకురావడానికి సీఎం చంద్రబాబు మహాయజ్ఞం చేస్తుంటే, విపక్ష నేత జగన్ దీనికి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ శాసనమండలి ఉపాధ్యక్షులు సతీష్‌కుమార్‌రెడ్డి (తెదేపా) ఆధ్వర్యంలో సోమవారం పులివెందుల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జిల్లాలోని తెదేపా నేతలంతా హాజరై పట్టిసీమకు అనుకూలంగా మాట్లాడటం విశేషంగా ఉంది. అనంతరం ర్యాలీనుద్దేశించి సతీష్‌రెడ్డి, తెదేపా నేతలు ప్రసంగించారు. వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితి మున్ముందు […]పూర్తి వివరాలు ...
కడప: ఒంటిమిట్ట కోదండరామాలయం సమీపంలోని రోడ్లు పునరుద్ధరించేందుకు, అలాగే రథం తిరిగే రోడ్డు వెంబడి మరమ్మతులు చేసేందుకు గాను ప్రభుత్వం 45 లక్షల రూపాయలను (G.O.RT.No. 242) మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం పేర (పంచాయతీ రాజ్ శాఖ) కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జీవో నెంబరు 242ను మార్చి 11న విడుదల చేశారు. ఇందులో 40 లక్షల రూపాయలను వెచ్చించి వాహనశ్రేణి (విఐపి) తిరిగేందుకు వీలుగా ఆలయ సమీపంలోని రోడ్లను పునరుద్ధరిస్తారు. మిగతా ఐదు […]పూర్తి వివరాలు ...