త్వరలో అందుబాటులోకి 47కి.మీ రైలు మార్గం ప్రొద్దుటూరు: ఎర్రగుంట్ల-నొస్సం మార్గంలో సోమవారం రైల్వే అధికారులు ప్రత్యేక రైలును నడిపించి తనిఖీ చేశారు. పూర్తయిన రైల్వేపనులను దక్షిణ మధ్య రైల్వే భద్రతా కమీషనరు(సిఆర్ఎస్) డి.కె.సింగ్ పరిశీలించారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో ఆయన ఎర్రగుంట్లకు చేరుకున్న ఆయన ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లోని రికార్డులు పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లోని బ్యాటరీ, ఐపీఎస్, ఈఎల్‌సీ, ఓఎఫ్సీ గదులను పరిశీలించారు. ఎర్రగుంట్ల నుంచి రైల్వేసిబ్బందితో కలిసి ట్రాలీలో తనిఖీకి వెళ్లారు. ఎర్రగుంట్ల-నొస్సం మధ్యలోని 47 […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: విద్యార్థులు పాఠశాల దశ నుండే సామాజిక స్పృహ కలిగి ఉండాలని ఇటీవలే ఐఏఎస్‌కు ఎంపికైన జిల్లా వాసి విజయభాస్కర్‌రెడ్డి పాతకోట పేర్కొన్నారు. స్థానిక రామేశ్వరంలోని పురపాలక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సత్తిబాబు అధ్యక్షతన ఈ రోజు (శుక్రవారం) విజయభాస్కర్‌కు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… తెలుగుతో పాటు ఆంగ్ల భాష పైన కూడా విద్యార్థులు పట్టు సాధించాలని సూచించారు. సివిల్ సర్వీసు లాంటి పోటీ పరీక్షలను ఎదుర్కోవాలంటే విద్యార్థులు వార్తా […]పూర్తి వివరాలు ...
కడప: చాలా రోజుల తర్వాత జిల్లాలోని పలు ప్రాంతాలలో మాంచి వాన కురిసింది. బేస్తవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న వానకు తూములు దునికి నీళ్ళు వీధుల వెంబడి ప్రవహించాయి. కడప నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. జిల్లలో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముద్దనూరులో కురుస్తోన్న భారీ వర్షానికి కాయలవంక, పుల్లేరు వంక వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వాన కారణంగా ప్రజలకు తాగునీటి సమస్యల నుండి కొంతమేర ఉపశమనం కలగనుంది. పొలతల […]పూర్తి వివరాలు ...
ఉక్కు పరిశ్రమను కడపలోనే ఏర్పాటు చేయాల ఉక్కు పరిశ్రమను తరలించడం చట్టాన్ని ఉల్లంఘించడమే! కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప జిల్లా పట్ల రాజకీయ కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్, శాసనమండలి సభ్యుడు డాక్టర్ గేయానంద్ ధ్వజమెత్తారు. సీమ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర […]పూర్తి వివరాలు ...
పోలీసు బలగాలతో నిండిన నగరం పలువురు నేతల గృహనిర్భందం కడప : నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినిలు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, అనుంబంధ విభాగాలు చేపట్టిన బంద్ విజయవంతమైంది. బంద్‌ను విచ్చిన్నం చేయడానికి ప్రభుత్వ ఆదేశానుసారం కడపలోనే తిష్ట వేసిన డిఐజీ రమనకుమార్ బందోబస్తు కోసమని మూడు జిల్లాల నుండి పోలీసు బలగాలను రప్పించారు. పోలీసు యంత్రాంగం మంగళవారం అర్థరాత్రి […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: దోమకాటు వలన వ్యాప్తి చెందే జబ్బుల గురించి ప్రజలలో అవగాహన కలిగించేందుకు జనవిజ్ఞాన వేదిక కడప జిల్లా కమిటీ ‘దోమకాటు – మనిషికి చేటు’ పేర రూపొందించిన కరపత్రం ఆవిష్కరణ బుధవారం పట్టణంలో జరిగింది. స్థానిక రవి నర్సింగ్ హోంలో జరిగిన ఈ కార్యక్రమంలో డా.రామ్మోహన్ రెడ్డి, డా.చంద్రమోహన్ లు మాట్లాడుతూ… ఒక్క డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడే కాకుండా ఇతర జ్వరాలు వచ్చినపుడు కూడా రక్తకణాల (ప్లేట్లెట్స్) సంఖ్య తగ్గుతుందని, ఈ విషయంపైన ప్రజలు అవగాహన్ […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం వస్తే ఇక్కడి జీవితాలకు కొంతైనా ఒక ఆదరువు, భరోసా లభించినట్లే. తరతరాలుగా దగాపడ్డ రాయలసీమ ఎన్నో కరువు, కాటకాలను చూసింది. రాయలసీమలో క్రిష్ణదేవరాయుల కాలంలో వజ్రాలను, వైడూర్యాలను రాసులుగా పోసి అమ్మేవారని విన్నాం. కానీ యిప్పుడు నీరులేక – పంటలు ఎండిపోయి కరువులతో జీవిస్తున్న రైతులు ఒకవైపు…చదివిన చదువుకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వలసలు వెళ్ళే యువతరం ఒకవైపు..ఉపాధి లేక ఏమీ తోచని పరిస్థితులలో మధ్య వయస్కులు మరొక వైపు వున్న రాయలసీమను […]పూర్తి వివరాలు ...
ఒకప్పుడు ‘బ్రాహ్మణి’ ఉక్కు కర్మాగారానికి వ్యతిరేఖంగా పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురించిన ‘ఈనాడు’ దినపత్రిక ఇప్పుడు అదే కర్మాగారాన్ని ఆహా…ఓహో అని కీర్తిస్తోంది. ఇవాల్టి కడప జిల్లా టాబ్లాయిడ్ లో ఈనాడు దినపత్రిక ఇలా రాసింది… ‘జిల్లాలోనే ఎందుకు ఏర్పాటు చేయాలి: ఉక్కు పరిశ్రమ కోసం జమ్మలమడుగు- ముద్దనూరు మధ్యలో సుమారు 11వేల ఎకరాల భూమిని కేటాయించారు. విమానాశ్రయం కోసం మరో 4 వేల ఎకరాలు భూమి కేటాయించారు. జపాన్ నుంచి విలువైన యంత్రాలు ఇక్కడికి తెప్పించారు. టౌన్షిప్, […]పూర్తి వివరాలు ...
కడప: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప జిల్లాలోనే ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కడప విమానాశ్రయం వద్ద ఆందోళన చేపట్టారు. విమానాశ్రయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అడ్డుకునేందుకు యత్నించారు. అంతకు మునుపు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆపార్టీ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో కడప జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాలని తీర్మానం చేశారు. ఆందోళన కార్యక్రమానికి ముందుగా ఎయిర్‌పోర్టు వద్ద నాయకులు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోనే ఉక్కుఫ్యాక్టరీ […]పూర్తి వివరాలు ...