రైల్వేకోడూరు : వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె మండలాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటలకు రైల్వే కోడూరు పట్టణంలోని చిట్వేల్ రోడ్డు బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. తర్వాత ఓబులవారిపల్లి మండలం బి.కమ్మపల్లి వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. ఉద్యాన పంటలకు రుణాలను మాఫీ చేయలేమని స్పష్టం చేశారు. ఎకరాకు రూ.10వేల పరిహారం మాత్రమే ఇస్తామన్నారు. హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.45 గంటలకు కోడూరుకు వచ్చిన ఆయన తొలుత గుంజన నదిని […]పూర్తి వివరాలు ...
రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం కడప జిల్లాలోని చారిత్రక పర్యాటక ప్రదేశమైన గండికోట లో పర్యటించి ఇక్కడి చారిత్రక విశేషాలను తిలకించారు. ఇక్కడికి సమీపంలోని గండికోట నీటిపారుదల ప్రాజెక్ట్ ను సందర్శించేందుకు సోమవారమే జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి నిన్న రాత్రి గండికోటలోని హరిత టూరిజం హోటల్ లో బస చేసారు. మంగళవారం ఉదయమే కోట ను సందర్శించారు. కోటలోని దేవాలయాలను , జుమ్మ మస్జిద్ , ధాన్యాగారం , పెన్నానది గండిని ఆయన […]పూర్తి వివరాలు ...
రాయలసీమ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న బాబు కరెంటు కోసం సీమ ప్రాజెక్టులను గాలికొదిలేస్తారా? హైకోర్టును వేరే చోట ఏర్పాటు చెయ్యాలి 13 జిల్లాలను ఒకే విధంగా అభివృద్ధి చేయాల కడప: రాయలసీమకు జరుగుతున్న అన్యాయలపైన, రాయలసీమ విషయంలో, అభివృద్ది వికేంద్రీకరణ విషయంలో ప్రభుత్వ వివక్షను ప్రశ్నిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటిసారి బహిరంగంగా గొంతెత్తారు. మంగళవారంనాడు పులివెందుల నియోజకవర్గ పరిధిలోని సింహాద్రిపురం మండలంలో పైడిపాలెం ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజధాని చుట్టూ […]పూర్తి వివరాలు ...
అయ్యా.. విపక్ష నేతలూ! కడప జిల్లా ప్రజలు దుర్భర పరిస్థితుల మధ్య ఉపాధి కరువై, ప్రభుత్వ ఆదరువు లేక, రోగాల పాలై బతుకీడుస్తున్నారు. మిమ్ములను, మీ పార్టీలని ఆదరించిన జిల్లా ప్రజలపైన ప్రభుత్వం కక్ష కట్టి వివక్ష చూపుతోంది. ఇదే విషయాన్ని మీ పార్టీల నేతలే పలు సందర్భాలలో వాక్రుచ్చినారు. ఇదే సమయంలో గత రెండు మూడు నెలలుగా జిల్లా జ్వర పీడితమైంది. ఇప్పటికే సుమారు వంద మంది వరకూ సామాన్యులు ఈ జ్వరాల బారిన పడి […]పూర్తి వివరాలు ...
పల్లెలను వదలని పాడు జరాలు కన్నెత్తి చూడని వైద్య సిబ్బంది నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వం జేబులు గుల్ల చేస్తున్న ప్రయివేటు ఆసుపత్రులు రాజధాని ‘శ్రద్ధ’ ప్రజారోగ్యం పై ఏదీ? కరువు దరువుకు తోడు ప్రభుత్వ ఆదరువు లేక అల్లాడుతున్న మన పల్లెలపైన పాడు జరాలు పగబట్టినాయి. కడప జిల్లాలోని పలు పల్లెలు పాడు జరాల బారిన పడి విలవిలలాడుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సుమారుగా 50కి పైగా ప్రాణాలు జ్వరాల కారణంగా గాల్లో కలిసిపోయినట్లు అనధికార సమాచారం. […]పూర్తి వివరాలు ...
ముఖ్యమంత్రిగారూ! ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన ఉత్సవానికి రమ్మంటూ నాకు ఆహ్వాన పత్రిక పంపారు. రాయలసీమ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ‘నేను రాలేను’ అని చెప్పడానికి చింతిస్తున్నాను. సీమ ప్రజలకు ప్రతినిధిగా ఉన్న నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో మీరు చేసిన ప్రకటనలు, ముఖ్యమంత్రి పదవి చేపట్టాక మీరు వ్యవహరిస్తున్న తీరు పొంతన లేకుండా ఉన్నాయి. అభివృద్ధిలో తీవ్రమైన అసమానతల వల్లే తొలి భాషా ప్రయుక్త […]పూర్తి వివరాలు ...
కడప: కడప బెంగుళూరు నగరాల మధ్య నడుస్తున్న ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసులు గత కొద్ది రోజులుగా నడవటం లేదు. ఈ రెండు నగరాల మధ్య వారానికి మూడు సార్లు ఎయిర్ పెగాసస్ ఎటిఆర్ 72 రకం విమానాల్ని నడుపుతోంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే విమాన ప్రయాణీకుల సంఖ్య కూడా బాగానే ఉంది. అయితే ఉన్నట్టుండి అక్టోబర్ 1 నుండి విమాన సర్వీసును నిలిపివేసిన ఎయిర్ పెగాసస్ టికెట్ల విక్రయాన్ని కూడా ఆపింది. దీంతో కడప బెంగుళూరుల […]పూర్తి వివరాలు ...
తరలివచ్చిన ఐటి నిపుణులు, విద్యార్థులు ప్రత్యేక రాయలసీమతోనే అభివృద్ది సాధ్యమన్న వక్తలు (బెంగుళూరు నుండి అశోక్ అందించిన కథనం) తెలంగాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని రాయలసీమ కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ బెంగళూరు సంఘం ఆధ్వర్యంలో శనివారం (ఈ రోజు) బెంగుళూరు నగరంలోని కుందనహళ్లిలో రాయలసీమ అభివృద్ది పైన నిర్వహించిన చైతన్య సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి శ్రీ పద్మావతి […]పూర్తి వివరాలు ...
తితిదే అధికారుల నిర్వాకమే కారణం పులివెందుల: మండలంలో ఉన్న గండిదేవస్థానం ఎట్టకేలకు తితిదే నుంచి విముక్తమై దేవాదాయశాఖలోకి విలీనమైంది. శనివారం తితిదే అధికారులు స్థానిక నాయకుల సమక్షంలో దేవాదాశాఖ అసిస్టెంట్ కమిషనర్ పట్టెం గురుప్రసాద్కు రికార్డులు అందజేశారు. నిర్వహణతో పాటు భక్తులకు సౌకర్యాలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో 2007లో దేవాదాయ శాఖలో ఉన్న గండిక్షేత్రాన్ని తితిదేలోకి విలీనం చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. ఉత్తర్వులు జారీ చేశారు. మొదట్లో ఆలయ నిర్వహణ విషయంలో శ్రద్ధ చూపిన తితిదే అధికారులు 2009 […]పూర్తి వివరాలు ...