కడప: ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళిన అఖిల పక్షాన్ని శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ఎర్రగుంట్లలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ…అయ్యే పనులు చెప్పి, ప్రజలకు సేవ చేస్తే సంతోషిస్తాం.. జూలైలో 35 టీఎంసీల నీరు గండికోట, మైలవరం రిజర్వాయర్లులలో నిల్వ చేయగల్గితే పదవికి రాజీనామ చేస్తానని సవాల్ విసిరారు. 2016 జూలైకి పూర్తి స్థాయిలో 35 టిఎంసీలు నీరు నిల్వ చేస్తే పదవికే కాదు రాజకీయాలకు సైతం […]పూర్తి వివరాలు ...
కడప: గురువారం పోతిరెడ్డిపాడు నుంచి ప్రాజెక్టుల పరిశీలన చేపట్టిన అఖిలపక్షం శుక్రవారం ఉదయం గోరుకల్లు నుంచి బయలుదేరి కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు వద్దకు చేరుకుంటుంది. కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి, జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి, రైల్వేకోడూరు శాసనసభ్యుడు శ్రీనివాసులు, బద్వేలు శాసనసభ్యుడు జయరాములు, కడప శాసనసభ్యుడు అంజాద్‌బాషా, శాసనమండలి సభ్యుడు దేవగుడి నారాయణరెడ్డి, వైకాపా రైతువిభాగం జిల్లా కార్యదర్శి ఎస్.ప్రసాద్‌రెడ్డి, ఆ […]పూర్తి వివరాలు ...
కడప: సాగునీటి ప్రాజెక్టులపైన అఖిలపక్షం ప్రాజెక్టుల పరిశీలన చేస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రోజు (శుక్రవారం) జిల్లా పర్యటనకు వస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న ఆయన గాలేరు – నగరి సుజల స్రవంతి కాల్వలను వాయుమార్గంలోపరిశీలించనున్నారు. మధ్యాహ్నం గండికోట జలాశయం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులపై సమీక్ష జరిపి, రైతులతో ముఖాముఖిలో మాట్లాడనున్నారు. రాష్ట్ర రాజధానిగా విజయవాడను ప్రకటించిన సమయంలో జిల్లాలో […]పూర్తి వివరాలు ...
కర్నూలు: రాయలసీమకు సాగునీటిని మళ్లించే పోతిరెడ్డిపాడు నుంచి అర్ధంతరంగా నీటి విడుదల నిలిచిపోవడంతో అఖిలపక్షం నేతలు గురువారం ఇక్కడి నుంచి గండికోట రిజర్వాయరు వరకు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించేందుకు బృందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి గండికోట జలాశయం వరకు నీరు విడుదల చేసుకునేందుకు ఉన్న అడ్డంకులపై పరిశీలించారు. ఏస్థాయిలో పనులు అడ్డంకిగా ఉన్నాయన్న వివరాలను తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ, డీఈల ద్వారా తెలుసుకున్నారు. రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు సజావుగా నీటిని తరలించడానికి అత్యవసరంగా […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట స్ఫూర్తితో ఉద్యమించాల 25, 26వ తేదీల్లో ప్రాజెక్టుల పరిశీలన కడప: జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోతే జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని అఖిలపక్షం నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో కార్మికనేత సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ప్రభుత్వ లాంఛనాలతో నవమి వేడుకలు నిర్వహించాలని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి వచ్చారన్నారు. ఫలితంగా […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్టలో అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు శుక్రవారం హైదరాబాదులో తెలిపారు. ఆ రోజు స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. 11వ శతాబ్దంలోనే ఈ దేవాలయం నిర్మించినట్లు ఆధారాలున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కోదండరామాలయాన్నిపరిశీలించిన ప్రిన్పిపల్ సెక్రటరీ స్థానిక కోదండరామాలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్పిపల్ కార్యదర్శి ఏవీఎస్ ప్రసాద్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, […]పూర్తి వివరాలు ...
అనంతపురం: గంగమ్మ జాతరలో గురువారం నేతల సందడి కనిపించింది. అమ్మవారిని దర్శించుకోడానికి నాయకులు తరలిరావడంతో సాధారణ భక్తులు క్యూలైన్లలో గంటలకొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది. శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు.రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు జరిపించారు. మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. జాతర సందర్భంగా అనంతపురం గంగమ్మను న్యాయమూర్తులు దర్శించుకున్నారు. లక్కిరెడ్డిపల్లె న్యాయమూర్తి చెంగల్రాయనాయుడు, […]పూర్తి వివరాలు ...
కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయానికే శ్రీరామనవమి నాడు ప్రభుత్వ లాంఛనాలు అందజేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు సమాచారం. ప్రభుత్వం వైపు నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాష్ర్టం విడిపోయిన నేపధ్యంలో రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన, గొప్ప ప్రశస్తి గల ఒంటిమిట్ట కోదండ రామయ్యకు ప్రభుత్వ లాంచనాలు అందుతాయని జిల్లా ప్రజలు ఆశించారు. విజయనగరం జిల్లాలోని రామతీర్థం రామాలయానికి ఆ హోదా దక్కనుందని ఒక వర్గం మీడియాలో ప్రచారం జోరందుకుంది. దీంతో ఒంటిమిట్టకే రాజ […]పూర్తి వివరాలు ...
మైదుకూరు: మండలంలోని మిట్టమానుపల్లెకు చెందిన రైతు మూలే రామసుబ్బారెడ్డి తన పంటపొలాలను అడవి జంతువుల నుంచి రక్షించుకొనే నేపధ్యంలో తన తోటకు విద్యుత్ వైర్లతో కంచె వేశాడని, రాత్రివేళ చిరుత వచ్చి విద్యుత్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందిందని, చిరుత మృతిచెందడంతో రైతు రామసుబ్బారెడ్డి శక్రవారం స్టార్టర్ ఆయిల్ చిరుతపై పోసి నిప్పుపెట్టి ఆనవాలు లేకుండా కాల్చివేయాలనే ప్రయత్నం చేశాడని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో దర్యాప్తు చేసి శనివారం నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు […]పూర్తి వివరాలు ...