కడప: వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతిని బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైకాపా శ్రేణులు జిల్లా వ్యాప్తంగా విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్‌లో వైఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ సతీమణి, వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుమార్తె షర్మిల, కోడలు వైఎస్ భారతి, అల్లుడు అనిల్, మేనత్త కమలమ్మ, సొదరి విమలమ్మ, సోదరుడు సుధీకర్‌రెడ్డి, చిన్నాన్న వైఎస్ పురుషోత్తంరెడ్డి, బావ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, వదిన […]పూర్తి వివరాలు ...
జార్జియాలోని కమ్మింగ్ నగరంలో… నోరూరించే రాయలసీమ వంటకాలతో మెనూ.. (అమెరికా నుండి నరేష్ గువ్వా) జులై 12న ఆదివారం నాడు అమెరికాలోని కమ్మింగ్ నగరం (జార్జియా)లో రాయలసీమ వనభోజనాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వెస్ట్ బ్యాంక్ పార్కులో ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ రకాలైన రాయలసీమ వంటకాలను వడ్డిస్తారు. భోజనాల తర్వాత ఆట పాటల కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న రాయలసీమ వాసులూ, తెలుగు […]పూర్తి వివరాలు ...
40 మంది విద్యార్థులకు ప్రవేశం కడప: జిల్లాలోని వైఎస్సార్ క్రీడాపాఠశాలలో ప్రవేశానికి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రత్యేకాధికారి రుద్రమూర్తి మంగళవారం వైఎస్సార్ క్రీడాపాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి నాల్గవ తరగతి ప్రవేశానికి 20 మంది బాలురు, 20 మంది బాలికలకు ఎంపిక చేయనున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల విద్యార్థులు ఈ ఎంపికల్లో పాల్గొనేందుకు అర్హులని చెప్పారు. ఎంపికల ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుందన్నారు. మండల స్థాయిలో ఎంఈవోలు, […]పూర్తి వివరాలు ...
విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో శాసనసభ్యులు మౌనముద్ర దాల్చిన కలెక్టర్ కడప: జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు అవసరమని కమిటీ ఛైర్మన్, ఎంపీ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు, కేటాయింపులు, నిధుల వినియోగం, ప్రజలకు చేరువపై సమీక్షించడానికి బుధవారం సభాభవన్‌లో నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కమిటీ ఛైర్మన్‌గా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కార్యదర్శి హాదాలో జిల్లా కలెక్టర్ వెంకటరమణ, సభ్యులుగా జడ్పీ ఛైర్మన్ గూడూరు రవి, 8 […]పూర్తి వివరాలు ...
కడప: వర్థమాన కథానాయకుడు ఆదిత్య ఓం సోమవారం అమీన్ పీర్ దర్గాను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. గురువులకు పూల చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధులను అడిగి గురువుల గొప్పదనాన్ని, దర్గా మహత్యాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చాలా రోజుల నుంచి దర్గాను దర్శించాలనుకునే కోరిక నేటికి నెరవేరిందన్నారు.పూర్తి వివరాలు ...
కడప: యోగివేమన విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాల కోసం అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయ సంచాలకులు ఆచార్య రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ కేంద్ర గ్రంథాలయంలో ఉదయం 9 గంటలకు అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. 26న ఉదయం ఉదయం బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్, మైక్రో బయాలజీ సబ్జెక్టులకు, మధ్యాహ్నం 2 గంటలకు పొలిటికల్ సైన్సు అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం, […]పూర్తి వివరాలు ...
కడప: కడప-బెంగుళూరు మధ్య నడుస్తోన్నఎయిర్ పెగాసస్ విమానం గురువారం ఉదయం కడపలో ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించక సుమారు అరగంటకు పైగా గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం ఏటీసీ అనుమతితో విమానాన్ని పెలైట్ సురక్షితంగా కిందకు దించారు. దాదాపు 45 నిమిషాలు ఆలస్యంగా టేకాఫ్ తీసుకొని బెంగుళూరుకు వెళ్లింది. బెంగుళూరు నుంచి ఉదయం 10.45కు 30 మంది ప్రయాణీకులతో బయలుదేరిన ఈ విమానం 11.30 గంటలకు కడపలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో […]పూర్తి వివరాలు ...
పోయిన వారం విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి కడపకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రులూ, అధికారుల సమక్షాన మాట్లాడుతూ “కడప జిల్లాకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం” అని ఘనంగా ప్రకటించేశారు. ఆయన వివిధ సందర్భాల్లో జిల్లాకిచ్చిన హామీలన్నీ కలిపి జాబితా తయారుచేస్తే ఒక ఉద్గ్రంథమౌతుంది. రాజకీయ నాయకులన్నాక చాలా సందర్భాల్లో చాలా చాలా హామీలు అటు ఆంతరంగిక సమావేశాల్లోనూ, ఇటు బహిరంగ సభల్లోనూ కూడా ఎన్నెన్నో ఇచ్చేస్తూ ఉంటారు. వాటిని పట్టుకుని నిలదీయాలనుకోవడం […]పూర్తి వివరాలు ...
ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలని కోరుతూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణులు ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించాయి. కడపలో… కడప కలెక్టరేట్ దగ్గర మేయర్ సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ధర్నా చేశారు. అనంతరం మాట్లాడుతూ…తన అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఓటుకు నోటు వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూస్తున్నారని పేర్కొన్నారు. పులివెందులలో… అవినీతి చంద్రబాబు గద్దె దిగాలంటూ వైకాపా నేతలు, కార్యకర్తలు పులివెందులలో భారీ ర్యాలీ నిర్వహించారు. […]పూర్తి వివరాలు ...