కడప : నగర శివార్లలోని రాజీవ్ గాంధీ వైద్య కళాశాల(రిమ్స్)ను శనివారం భారత వైద్య మండలి (ఎంసీఐ) బృందం తనిఖీ చేసింది. ఎంసీఐ ఇదివరకే రిమ్స్‌లో చివరి తనిఖీలు (మార్చి నెలలో) నిర్వహించింది. అప్పట్లో 562 జీవో అమలు, ఫార్మాకో విభాగం, లైబ్రరీ విభాగంలో పుస్తకాల కొరత, ఎక్స్‌రే ప్లాంట్లలో ఒకే యూనిట్, చెన్నూరు పీహెచ్సీలో కొన్ని కొరతలపై నివేదికను పంపించారు. ఆ నివేదికలతో పాటు ఎంసీఐ బృందం రిమ్స్ ఫైనలియర్ అనుమతికి కూడా ఎసరు పెట్టింది.పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Friday, June 3, 2011
సుమారు వందేళ్ళ క్రితమే అంతరించిపోయిందని భావించిన కలివికోడి ఇరవై ఏళ్ళ కిందట 1986వసంవత్సరంలో మనదేశంలోని తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల, శేషాచలం పర్వతపంక్తులలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో సిద్దవటం-బద్వేలు మధ్య అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమై పక్షిశాస్త్ర వేత్తలనూ, ప్రకృతి ప్రేమికులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. కలివికోడి రక్షణకు గత ఇరవై ఏళ్ళగా పలుచర్యలను తీసుకుంటున్నారు. ..ఆ పక్షి ఉనికికే ప్రమాదం కలిగే రీతిలో జరిగిన పరిణామాలు ప్రపంచవ్యాప్త చర్చకు దారితీశాయి. కలివికోడికి ఆవాస ప్రాంతమైన లంకమల పరిథిలో తెలుగుగంగ […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Monday, May 30, 2011
కడప : అభ్యర్థులు ఎంతకాలంగానో కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ పరీక్ష తేదీలను ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించింది. ఈ సంవత్సరం అక్టోబరు 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థుల ప్రిపరేషన్‌కు బాగా సమయం ఉండడం కొంత సౌలభ్యం. ఇంతకుమునుపు అభ్యర్థులు కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాదు వంటి నగరాలకు వెళ్లి వేలకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇది తలకుమించిన భారంగా […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Monday, May 30, 2011
వేంపల్లె : గవర్నర్ కోటా కింద తనకు ఎమ్మెల్సీ ఇవ్వనందుకు ఎలాంటి బాధ లేదని మాజీ మంత్రి వివేకానందరెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లెలో 20సూత్రాల ఆర్థిక అమలు కమిటి ఛైర్మన్ తులసిరెడ్డి, కాంగ్రెస్ నేత కందుల రాజమోహన్‌రెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఓటమిచెందితే ఎమ్మెల్సీ, మంత్రి పదవి తీసుకోకుండా సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని నేను అన్న మాటను కాంగ్రెస్ అధిష్ఠానం గౌరవించిందన్నారు. ఎన్నికల్లో ఓడినందున అన్నమాట ప్రకారం ఎలాంటి పదవి తీసుకోకుండా కాంగ్రెస్‌లో కొనసాగుతానన్నారు.పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, May 29, 2011
కడప : జిల్లాలోని పవిత్రపుణ్యక్షేత్రం పుష్పగిరిలో శనివారం సాయంత్రం శ్రీజ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న (ఇంకాపేరుపెట్టని) ప్రొడక్షన్‌నెంబరు1 సినిమా చిత్రీకరణ జరిగింది. నిర్మాణంలో భాగంగా హీరో రోహిత్, హీరోయిన్ శ్రీలపై సన్నివేశాన్ని చిత్రీకరించారు. పీఎన్రెడ్డి దర్శకత్వంలో నిర్మాత మదన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సుకుమార్ కాగా మగధీరా సినిమాలో నటించిన సంపత్‌రాజు ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ గుడి నుంచి వస్తుండగా హీరో ఆమెను చూస్తూ అందానికి ముగ్దుడై పరవశించే సన్నివేశాన్ని చిత్రీకరించారు.పూర్తి వివరాలు ...
సంపాదకుడు
Sunday, May 29, 2011
గాలివీడు: గాలివీడు మండలంలోని చీమలచెరువుపల్లి పంచాయతీ ఎర్రదొడ్డిపల్లిలో పురిగమ్మ వేల్పు శుక్ర, శనివారం ఘనంగా జరిగింది. 15 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేల్పునకు ప్రజలు భారీగా హాజరయ్యారు. శుక్రవారం రాత్రి వివిధ గ్రామాల నుంచి 12 నాణములు వేల్పులో పాల్గొన్నాయి. ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు. శనివారం సాయంత్రం నిర్వహించిన దేవతా నాణములతో నీలకర్త కార్యక్రమం, పూజ, గందోడి కోలలాడే సంబరాలు,.పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, May 26, 2011
కలియుగ ప్రత్యక్షదైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, శ్రీ వెంకటేశ్వరస్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు. అందుకే ఆయన సన్నిధి ఎప్పుడూ జనసంద్రమే. ఆ స్వామిని సులభంగా దర్శించుకునే అవకాశం కల్పించడానికి, ఆయన సన్నిధిలో ఆర్జిత సేవలందించడానికి, తిరుమల గిరిపై శ్రమ లేకుండా ఒకరోజు సేద తీరేందుకు గదిని సంపాదించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ పద్ధతిలో ఈ-సేవ కౌంటర్లను ఏర్పాటు చేశారు.కడప నగరంలో మద్రాసురోడ్డులోని టీటీడీ కల్యాణ మండపంలో ఈ-సేవా కౌంటర్ ఏర్పాటు చేశారు.పూర్తి వివరాలు ...
సంపాదకుడు
Thursday, May 26, 2011
కడప : జిల్లాలో పనిచేస్తున్న 25 మంది తహశీల్దార్లను వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ బుధవారం రాత్రి కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ జి.శ్రీనివాసులును ప్రొద్దుటూరు తహశీల్దార్‌గా నియమించారు. కలెక్టరేట్ ఎఫ్ సెక్షన్ సూపరింటెండెంట్ కె వెంకటరెడ్డిని మైదుకూరు తహశీల్దారుగా నియమిం చారు. రాజంపేట ఆర్డీఓ కార్యాలయంలో ఏఓ గా పనిచేస్తున్న పి. భవానీని సంబేపల్లె తహశీల్దారుగా, .పూర్తి వివరాలు ...
సంపాదకుడు
Thursday, May 26, 2011
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేసి 96 సంవత్సరాలు గడిచాయి. 1915వ సంవత్సరంలో రామేశ్వరం, మోడంపల్లె, నడింపల్లె, బొల్లవరం గ్రామాలను కలిపి ప్రొద్దుటూరు మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. 2014 సంవత్సరంతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ శత వసంతాలు పూర్తి చేసుకోనుంది. తృతీయ శ్రేణి పురపాలక సంఘం నుంచి ప్రత్యేక స్థాయి మున్సిపాలిటీకి ఎదిగింది . ఐదారు గ్రామ పంచాయితీలను వీలినం చేసి అప్పట్లో ప్రొద్దుటూరు పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేశారు. .పూర్తి వివరాలు ...