భక్త కన్నప్ప కడప (వైఎస్సార్) జిల్లా వాడే. కైఫీయతుల్లో ఇందుకు స్పష్టమైన ఆధారం ఉందని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో కన్నప్ప కర్నాటకవాడనీ, తమిళుడని, ఆ ప్రాంతాల వారు చేసిన వాదనలో నిజం లేదని స్పష్టమైంది. కన్నప్ప వైఎస్సార్ జిల్లావాడేననడానికి రుజువుగా ఆయన ప్రతిష్టించిన శివలింగం రాజంపేట మండలం ఊటుకూరులో నేటికీ ఉందని పండిత పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రం దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం. తిరుమలకు తొలి గడపగా పేరున్న ఈ క్షేత్రంలో యేటా జరిగే తిరుణాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. కడప రాయునిగా, వెంకటాద్రి కడప రాయనిగా, కప్పురపు నవ్వుల కడప రాయనిగా భక్తుల పూజలందుకుంటున్న ఈ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పాడ్యమి నుంచి సప్తమి వరకూ నిర్వహిస్తారు. రథసప్తమి నాడు జరిగే రథోత్సవం ‘దేవునికడప’ తిరుణాలగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.పూర్తి వివరాలు ...
కోవరంగుంటపల్లె: ప్రముఖుల పుట్టినిల్లుగా పేరొందిన కోవరంగుంటపల్లెకు స్వాతంత్య్ర సమర యోధుల గడ్డగా కూడా పేరుంది. కడప గాంధీగా పేరొందిన దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి స్వగ్రామం ఇదే. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఈయన ఇంగ్లాండ్‌లో బారిష్టర్ చదివారు. గాంధీ ఆశయాలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. స్వాతంత్య్రం కోసం జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు అరెస్టు చేసి ఒక ఏడాది పాటు జైలులో ఉంచారు. రామసుబ్బారెడ్డి జైలు నుంచి విడుదలయిన కొద్ది రోజులకే గాంధీ విదేశీవస్తు […]పూర్తి వివరాలు ...
కడప: రాయలసీమ ప్రజల ఉపాధికి అవకాశాలున్న బ్రహ్మణి స్టీల్స్‌ను రాజకీయాలతో ముడిపెట్టి అడ్డుకోవద్దని రాయలసీమ కార్మిక, కర్షక సమితి డిమాండ్ చేసింది. వెనుకబడిన రాయలసీమ, ప్రత్యేకించి వైఎస్సార్ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో నిర్దేశించిన ఈ ప్రాజెక్టును రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమితి ఆరోపించింది. స్థానిక ప్రజల ఉపాధి కోసం తలపెట్టిన ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేలా పార్టీలకు అతీతంగా అందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేసింది. రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు […]పూర్తి వివరాలు ...
బద్వేలు: వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం పాలకులు రాజకీయ కుట్రలతోనే జిల్లాకు నిధులను నిలిపివేశారని సీపీఎం నాయకులు ధ్వజమెత్తారు. రాజకీయ కుట్రలతోనే జిల్లా అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన నేతలు ఇదేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. బద్వేలులో నిర్వహించిన ఆ పార్టీ 8వ జిల్లా మహాసభలు గురువారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రవిశంకర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…పూర్తి వివరాలు ...
నేషనల్ అల్యూమియం కంపెనీ లిమిటెడ్ ( నాల్కో ) వై.ఎస్.ఆర్ జిల్లా లోని గండికోటలో 274 కోట్ల రూపాయల వ్యయంతో 50.4 ఎం.వి. పవన విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ 274 కోట్ల రూపాయల వ్యయంతో నిర్వహిస్తుందని నాల్కో సి.ఎం.డి బాగ్రా భువనేశ్వర్ లో ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కోసం ఒక్కొక్కటి 2.1 ఎం.వి. సామర్థ్యంతో 24 గాలిమరలను గండికోట సమీపంలో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని […]పూర్తి వివరాలు ...
మైలవరం: కోరిన వారికి కొంగు బంగారంగా మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరీ దేవి జ్యోతి మహోత్సవాలు ఈ నెల 16 వ తేదీ ఆదివారం నుండి 18 వ తేదీ మంగళవారం వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా 16 వ తేదీ బిందుసేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, రాత్రి జ్యోతులను ఊరేగిస్తారని, 17 న విడిదినం, 18 న గొడుగుల కార్యక్రమం ఉంటుందని అలాగే ఆదివారం రాత్రి, సోమవారం ఉదయంపూర్తి వివరాలు ...
పులివెందుల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రహ్మతుల్లా కేసు విషయంలో నిన్న రాత్రి పులివెందుల పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేసిన కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా 68మందిపై పోలీసులు నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వీరిపై 11 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. రహ్మతుల్లా అనే పార్టీ కార్యకర్తను పోలీసులు దూషించటంతో పాటు కొట్టడాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8.30 […]పూర్తి వివరాలు ...
కడపః ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో అందుబాటులో ఉంటారు. 9,11 వ తేదీలలో పులివెందులలోని తన క్యాంపు కా ర్యాలయంలో అందుబాటులో ఉంటారు. 10వ తేదీన కడపలో పర్యటిస్తారని పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వై.ఎస్.భాస్కర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారైన సమయంలోనే జగన్ పర్యటన ఖరారవడం విశేషం.పూర్తి వివరాలు ...