రాజధాని నగరాన్ని, నదీ జలాలను త్యాగం చేసిన రాయలసీమ ప్రజలు ‘హైదరాబాద్ బిర్యానీ’ని కోరుకోవడం లేదు. తమ ‘రాగి సంకటి’ తమకు దక్కితే చాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సుదీర్ఘకాలంగా అటు రాజకీయ పక్షాలకు, ఇటు సామాన్య ప్రజలకు కూడా తీవ్ర సమస్యగా పరిణమించింది. ఎట్టకేలకు తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం… కాదు, కాదు సకల రాజకీయ పక్షాలూ సంసిద్ధమయ్యాయి. రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేస్తున్నారో లేక సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపించాలనుకుంటున్నారో గానీ […]పూర్తి వివరాలు ...
సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు తిరస్కరణకు గురయ్యాయి. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా దాదాపు రెండు నెలల కిందట కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన 13 మంది ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వాలకు సమర్పించిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ శుక్రవారం తిరస్కరించారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీలకు చెందిన లోక్‌సభ సభ్యుల రాజీనామాలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వచ్ఛందంగా చేసినవి కావని.. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఏర్పడిన తీవ్రమైన భావోద్వేగాల నడుమ తీసుకున్న […]పూర్తి వివరాలు ...
కోస్తాంధ్రలో జరిగిన నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధి బ్రిటిష్ కాలం నాటిది. కానీ నిజాం ప్రభుత్వం హయాంలో తెలంగాణ అలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. 1957 తరువాత మిగిలిన రెండు ప్రాంతాలతో పోల్చి చూసినప్పుడు సాగునీటి పథకాల అభివృద్ధి తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే నదీ జలాల పంపీణీలో అదనం గా ఉత్పన్నమయ్యే సమస్యలు ఏమీ ఉండబోవని కొందరు తెలంగాణ ప్రాంత ప్రముఖులు వాదిస్తున్నారు. అంటే ఇప్పుడు న్న సమస్యలే తప్ప అదనంగా ఎదురయ్యే […]పూర్తి వివరాలు ...
ఈరోజు నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు రిమ్స్ వైద్య కళాశాలకు సెలవులను ప్రకటించారు. సమైక్య సమ్మె నేపధ్యంలోనే సెలవులు ప్రకటించారని విద్యార్థులు భావిస్తుండగా అది వాస్తవం కాదని కళాశాల వర్గాలు ధ్రువీకరించాయి. కేవలం దసరా పండుగను పురస్కరించుకుని మాత్రమె కళాశాలకు పది రోజుల సెలవు ప్రకటించినట్టు కళాశాల వర్గాలు ధ్రువీకరించాయి. పది రోజుల సెలవు దొరకటంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి వైకాపా గూటికి తిరిగొచ్చారు. ఈ రోజు హైదరాబాదులో దీక్ష చేస్తున్న జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో కడప ఉప ఎన్నికల సమయంలో ఆయన జగన్ కే మద్దతు ఇచ్చారు. కాకపోతే ఆ తర్వాత కాంగ్రెస్ అదికారంలో ఉండడంతో తనకు వ్యక్తిగతం గా వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జగన్ కు కొంత దూరంగా ఉండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెబుతున్నారు. ఆయన సోదరుడు నారాయణరెడ్డి […]పూర్తి వివరాలు ...
ఉద్యోగుల సమైక్య సమ్మె నేపధ్యంలో రాయలసీమ తాప విద్యుత్ కేంద్రం(ఆర్టీపీపీ)లో మూడు రోజులుగా కరెంటు తయారీ ఆగిపోయింది. కడపతోపాటు, రాయలసీమలోని పలు జిల్లాలకు ఎంతో కీలకమైన ఈ కేంద్రం మూడు రోజులుగా పడకేసింది. అయిదు యూనిట్లలో 1,050 మెగావాట్ల కరెంటు తయారీ నిలిచిపోయింది. ఇంజినీర్లు, ఉద్యోగులంతా సమ్మె కారణంగా విధులకు హాజరుకామంటూ కరాఖండిగా చెబుతున్నారు. ఈ ప్రభావం జిల్లాఅంతటా స్పష్టంగా కనిపిస్తోంది. ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్ఉద్యోగులంతా రాజీలేని సమ్మె కొనసాగిస్తుండటంతో జిల్లావాసుల విద్యుత్ కష్టాలు వినే నాథుడే కరవయ్యాడు. […]పూర్తి వివరాలు ...
గతంలో చేసుకున్న ఒప్పందాలు, అమలుచేయాలనుకున్న పథకాలు సాకారం కాలేదు కాబట్టి నేడు రాయలసీమకు కృష్ణాజలాల్లో హక్కే లేదంటూ రిటైర్డు చీఫ్ ఇంజనీర్ విద్యాసాగర్‌రావు ‘సాక్షి’లో రాశారు. నేడు రాయలసీమలో అమలు జరుగుతున్న తెలుగు గంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, గండికోట ప్రాజెక్టు కేటాయింపులు, అనంతపురం జిల్లాకు నీటి మళ్లింపు- వీటన్నింటి మీద సీమవాసులకు ఉన్న హక్కు కాదనలేనిది. 1956లో ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు ముందు, పైపథకాలన్నీ అమలు కాలేదు కాబట్టి, నేడు ఆ పథకాలకు నీటి […]పూర్తి వివరాలు ...
విశాలాంధ్ర ప్రచురించిన ‘కొత్త దుప్పటి’ కథల సంకలనం (సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి కథలు) పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారానికి (2011) ఎంపికైంది. హైదరాబాదులోని ఎన్టీఆర్ కళామందిరంలో గురువారం జరిగిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరావు చేతుల మీదుగా రచయిత సన్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు. పురస్కారాల ప్రదానోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు పొట్టిశ్రీరాములు […]పూర్తి వివరాలు ...
తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. 35 ఏళ్లుగా కాంగ్రెస్‌ను నమ్ముకుని ఎనలేని సేవలందించినా, సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా కేబినెట్లో టీ.నోట్‌ను పెట్టడంపై సాయిప్రతాప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీమాంధ్ర ప్రజలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ను వీడడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, పీసీసీ అధ్యక్షుడికి కూడా పంపానన్నారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు […]పూర్తి వివరాలు ...