ముత్యాల ముగ్గులు రతనాల బొమ్మలు చెమ్మ చెక్క చెమ్మ చెక్క నవరత్న సంక్రాంతి చేరడేసి మొగ్గ శతమానం భవతి ! www.www.kadapa.info వీక్షక దేవుళ్ళకు మా హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు …పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలోని నందలూరు మండలం పాటూరు గ్రామ పొలంలో గురువారం పిల్లి జాతికి చెందిన అరుదయిన పునుగుపిల్లి దొరికింది. గ్రామానికి చెందిన రైతు కోటకొండ సుబ్రహ్మణ్యం తాను సాగుచేసిన కర్భూజ పంటను పందులు, పందికొక్కులు నాశనం చేయకుండా బోను ఏర్పాటు చేశారు. ఆ బోనులో పునుగుపిల్లి చిక్కుకొంది. పాటూరు మాజీ సర్పంచి గాలా సుధాకరరెడ్డి ఈ విషయాన్ని తిరుపతిలోని జంతు ప్రదర్శనశాల అధికారి పార్థసారధి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గురువారం సాయంత్రం ఎస్వీ జంతుప్రదర్శనశాలకు చెందిన సెల్వరాజ్, […]పూర్తి వివరాలు ...
కడప విమానాశ్రయంలో జింకల మందలు సంచరిస్తున్నాయని.. వాటిని తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కడప డీఎఫ్‌వో నాగరాజు తెలిపారు. విమానాశ్రయం వద్ద మైదానం పెద్దగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయన్నారు. కృష్ణజింకలు 10 నుంచి 15 వరకు మందలుగా వస్తాయని.. అలాంటి ఈ ప్రాంతంలో అయిదు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఇటీవల ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో కలెక్టరు సమావేశం నిర్వహించారు. జింకలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు తగిన ప్రణాళిక రూపొందించాలని తమకు ఆదేశించారన్నారు. ఆదేశం మేరకు ప్రణాళిక […]పూర్తి వివరాలు ...
దాదాపు ఆరు దశాబ్దాలు (1953 నుంచి 2013) దాకా కోస్తాంధ్రవాసుల సాహచర్యంలో ఉన్నాం. అయితే సీమకు మిగిలింది ఏమిటి? ఒరిగింది ఏమిటి? దేశంలోనే అత్యంత దుర్భిక్షంలో ఉండే కరువు ప్రాంతంగా రాయలసీమ మిగిలిపోయింది. దేశంలోనే అత్యంత కరువుబారిన పడిన జిల్లాల్లో అనంతపురానిదే అగ్రస్థానమని 90వ దశకంలోనే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం నివేదించిన సంగతి అక్షర సత్యం. మరో పాతికేళ్లలో అనంతపురం పూర్తిస్థాయి ఎడారిగా మారిపోతుందని జలవనరుల నిపుణులు ఏకరువు పెట్టిన మాట వాస్తవం కాదా? కడప, కర్నూలు […]పూర్తి వివరాలు ...
స్వతంత్ర భారత్‌ను 50 సంవత్సరాలు పైగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నేడు కప్పల తక్కెడగా మారిపోయింది. కేంద్రంలో, రాష్ట్రంలో తానే అధికారంలో ఉన్నా రాష్ట్ర విభజనను ఎలా చేయాలో దిక్కుతోచక చిత్ర-విచిత్ర ప్రకటనలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎక్కిరిస్తున్నది. 10 జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. కేంద్ర కేబినెట్ కూడా దాన్నే అంగీకరించింది; గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్ను నియమించింది. జీవోఎం పదే పదే సమావేశాలు జరిపి విభజన బిల్లు తయారీకి గొప్పగా కసరత్తు చేసినట్లు […]పూర్తి వివరాలు ...
నేను 1981 నుండి 1985 వరకూ శ్రీ కాళహస్తిలో పనిచేశాను.ఆ రోజుల్లో సంజీవరాయ శర్మ గారు స్వామి వారి సన్నిధిలో రోజూ సాయంత్రం వయోలిన్ వాయించేవారు.అంధులు.వయోలిన్ మీద కమాన్ కర్ర నాట్యంచేస్తుంటే,ద్వారం వారి వయోలిన్ సంగీతం గుర్తుకు వచ్చేది! నేను పనిచేసే బాంక్ సమీపంలోనే ఒక చిన్న పాడుపడ్డ ఇంటిలో వుండేవారు.”ప్రతి రోజూ బాంక్ కు వచ్చి కాసేపు నాతో ముచ్చటించండి,మీతో సరదాగా మాట్లాడుకోవచ్చు,ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు”అని వారిని వేడుకున్నాను.వారు అలానే,సాయంత్రం నాలుగు గంటల సమయంలో వచ్చేవారు.రాగానే,వారికి […]పూర్తి వివరాలు ...
కాంగ్రెసు సంస్కృతి పూర్తిగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న రోజులలో కేంద్రం తన ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రులను పేకముక్కలవలె మార్చేసింది. చెన్నారెడ్డిని తొలగించి అంజయ్యను, ఆయనను పక్కన పెట్టి భవనం వెంకట్రామ్ ను ముఖ్యమంత్రిగా చేశారు. అదంతా ఇందిరాగాంధీ అధిష్ఠాన వర్గం చదరంగంలో భాగమే. 1978లో భవనం వెంకట్రామ్ విద్యామంత్రి అయ్యాడు. చెన్నారెడ్డి ఆయనను తరువాత కౌన్సిల్ సభ్యుడుగా చేశారు. ఆ దశలో డా. తంగిరాల సుభాష్ నాకు భవనం వెంకట్రామ్ ను పరిచయం చేశాడు. భవనం వెంకట్రామ్ సోషలిస్టు […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ‘యువతరంగం’ పేరిట సాంస్కృతిక, సాహిత్యోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి.పద్మావతి తెలిపారు. 11, 12 తేదీలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పోటీలు కళాశాల మైదానంలో ఉంటాయన్నారు. ఇందులో భాగంగా క్రింది పోటీలు నిర్వహిస్తారు. పద్యపఠనం (ప్రాచీన సాహిత్యంలో అయిదు పద్యాలు కంఠస్థంగా) క్విజ్, వ్యాసరచన, వక్తృత్వం, ఏకాంకిక, ఏకపాత్రాభినయం, చుక్కల ముగ్గు (బాలికలు), జానపద, గిరిజన నృత్యం, సంప్రదాయం నృత్యం […]పూర్తి వివరాలు ...
బదిలీపై వెళ్తున్న ప్రస్తుత ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా నుండి జీవీజీ అశోక్ బుధవారం సాయంత్రం 4.20 గంటలకు కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ … జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.తాను ఎస్పీగా మొదట కడపకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తానన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసుల సంక్షేమానికి ఎస్పీ మనీశ్‌కుమార్ సిన్హా తీసుకున్న చర్యలను […]పూర్తి వివరాలు ...