జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల తొలి విడత సమరం ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ఆరంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. స్థానిక ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. జెడ్పీటీసీకి తెలుపు రంగు, MPTC గులాబి రంగు బ్యాలెట్ పత్రాలను వాడుతున్నారు. రాయచోటి మండలం అబ్బవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా, తెదేపా కార్యకర్తలు తోపులాటకు దిగడంతో ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని […]పూర్తి వివరాలు ...
తొలివిడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 29 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎంపీటీసీ బరిలో 1055 మంది, జడ్పీటీసీ బరిలో 144 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 29 జడ్పీటీసీ స్థానాలకు, 326 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 8,05,681 మంది పల్లె ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. బద్వేల్, అట్లూరు, గోపవరం, బికోడూరు, కలసపాడు, పోరుమామిళ్ళ, కాశినాయన, మైదుకూరు, బీమఠం, దువ్వూరు, […]పూర్తి వివరాలు ...
చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాలనలో ఆంధ్రప్రదేశ్ దుస్థితిని గురించి ‘ది హిందూ’ రెసిడెంట్ ఎడిటర్ పాలగుమ్మి సాయినాద్ వ్యాఖ్యలు మీ కోసం … విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి ఇలా సకల రంగాలలో బాబు గారి గోబెల్ ప్రచారాన్ని ఎండగట్టిన ప్రసంగం…పూర్తి వివరాలు ...
భాజపా రాష్ట్ర నాయకుడు, సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజు గురువారం ఒంటిమిట్ట కోదండరామాలయాన్నీ సతీసమేతంగా సందర్శించారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయించారు. ఆలయ అధికారులు పూలమాల, దుశ్శాలువాలతో కృష్ణంరాజు దంపతులను సత్కరించారు. అనంతరం కడపలోని అమీన్‌పీర్ (పెద్ద ) దర్గాను దర్శించుకున్నారు. భార్య శ్యామలాదేవితో కలసి ఆయన దర్గాలోని ప్రధాన మజార్ వద్ద ప్రార్థనలు చేశారు. దర్గా ప్రాంగణంలోని ఇతర […]పూర్తి వివరాలు ...
లెజెండ్ సినిమా విజయ యాత్రలో భాగంగా బాలయ్య, చిత్ర యూనిట్ తో కలిసి గురువారం కడపకు వచ్చారు. సాయంత్రం 4 గంటలకు ఆయన రవి థియేటర్ వద్దకు రాగానే అభిమానులు ఈలలు, కేకలు వస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులనుద్దేశించి మాట్లాడారు. బాలయ్య కోసం ప్రత్యేక కథను రూపొందించి సినిమాను విడుదల చేసినట్లు దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు.థియేటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బాలయ్య ప్రసంగిస్తున్నంత సేపు అభిమానుల ఈలలు, కేకలతో థియేటర్ ప్రతిధ్వనించింది. […]పూర్తి వివరాలు ...
తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగర్జన సభ కోసం 7న జిల్లాకు రానున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన వివరాలు జిల్లా నాయకత్వానికి అధిష్ఠానం సమాచారం అందించింది. గతంలో మార్చి 27న నిర్వహించాలని ముందుగా భావించినా వాయిదా వేశారు. చంద్రబాబునాయుడు ప్రజాగర్జనను కడపలో ఏ మైదానంలో నిర్వహించాలి అనే అంశాన్ని జిల్లా కేంద్రంలోని నేతలు పరిశీలిస్తున్నారు. జిల్లాలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా చంద్రబాబు పర్యటనపై జిల్లా నేతలతో మాట్లాడినట్లు సమాచారం. ప్రజాగర్జనకు భారీగా […]పూర్తి వివరాలు ...
సినీనటుడు నందమూరి బాలకృష్ణ 3వ తేదీన కడపకు రానున్నట్లు ఆయన అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు పీరయ్య, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి తెలిపారు. ‘లెజెండ్’ చిత్ర విజయవంతమైన నేపథ్యంలో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను పెద్దదర్గాను సందర్శిస్తారని వివరించారు. చిత్రం ప్రదర్శించే రవి ధియేటర్ను సైతం సందర్శిస్తారని తెలిపారు. అనంతరం ఆయన అహోబిలానికి వెళతారని వివరించారు.పూర్తి వివరాలు ...
జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలలో సరాసరి 72.71% పోలింగ్ నమోదైంది. మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కడప కార్పొరేషన్‌తో పాటు ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, బద్వేల్, మైదుకూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. 232 వార్డులు/డివిజన్లలో ఎన్నికలు జరుగగా 1188 మంది బరిలో నిలిచారు. 6,56,742 మందికి ఓట్లు ఉంటే 4,44,355 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో నేడు నగర పాలకం, పురపాలకంలో ఎన్నికల జరగనున్నాయి. కడప నగర పాలకంలో 50 డివిజన్లలో 311 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున 47 మంది, వైకాపా తరపున 50 మంది, సిపియం తరపున 12 మంది, బిజెపి తరపున 7మంది, సిపిఐ తరపున ఇరువురు, కాంగ్రెస్ తరపున 8 మంది, ఎంఐఎం, బిఎస్పి, లోక్‌సత్తా, స్వతంత్ర అభ్యర్థులను కలుపుకొని 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కడప నగర పాలకంలో […]పూర్తి వివరాలు ...