తెలుగు సినిమాకు ప్రపంచ ఖ్యాతి తీసుకురావడమే కాకుండా ఎన్టీఆర్ ,ఏయన్నార్ లాంటి సినీ నటులను ఆదరించి విజయా సంస్థ ద్వారా అవకాశాలు కల్పించి దారి చూపిన న బి.ఎన్. రెడ్డి, బి.నాగిరెడ్డి లాంటి మహనీయులు రాయలసీమలో పుట్టారు. కరువు ప్రాంతమైన కడప జిల్లాకు వన్నె తెచ్చారు. వారు సినీ నిర్మాణ రంగంలో విజయం సాధించారు. “చందమామ” లాంటి బాలల పత్రికను దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో ప్రచురించి సాహిత్య సేవ కూడా చేసారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో 48 కులాలను సూచించే ఊర్ల పేర్లున్నాయి. కులాల పేర్లను సూచించే ఆయా ఊర్లలో ఆ కులస్తులే ఉంటారనుకోవడం ఊహే అవుతుంది. కులాల పేర్లు సూచించే గ్రామ నామాలను ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు తన పరిశోధనా గ్రంధం ‘కడప ఊర్లు – పేర్లు’లో విశదీకరించారు. ఆ వివరాలు కడప.ఇన్ఫో వీక్షకుల కోసం … ఆసాది – ఆసాదివాండ్లపల్లె (6) ఈడిగ – ఈడిగపల్లె (17) ఉప్పర – ఉప్పరపల్లె (13), ఉప్పరకొట్టాలు ఏకరి – […]పూర్తి వివరాలు ...
కడప : రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన సీమ అభివృద్ధి కోసం త్వరలో కేంద్ర మంత్రులు, ప్రధాని కడప జిల్లాకు రానున్నారని తెలిపారు. రాయలసీమ అభివృద్ధి చేయకుండా టీడీపీ కంకణం కట్టుకుందని అందుకే దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. 2014 ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు టీడీపీకి ఓటు వేయలేదని కక్ష తీర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ […]పూర్తి వివరాలు ...
ఎందుకో ఈ రోజు మా వూరి చెట్లు గుర్తుకొస్తున్నాయి… బయట నుండి వచ్చేవాళ్ళకు మా వూరి గుమ్మం తొక్కకముందే రోడ్డుకు కుడివైపున పెద్ద పెద్ద చింతమాన్లు కనపడేవి. అవేవీ మేమో, మా నాన్నలో, వాళ్ళ నాన్నలో నాటినవి గాదు. ఆ చింత చెట్ల ప్రాంతాన్నంతా “పాతూరు” అనేవారు. మా వూరికి ముందున్న వూరు అదే. దాని అసలు పేరు అగ్రహారం. అగ్రహారానికి ఉత్తరంగా చెరువు. అదే కల్పనాయుని చెరువు. ఆ చెరువు గట్టున వున్న శివాలయం అప్పటి […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో 16 రకాలయిన ప్రాణులను (Animals, Birds, reptiles etc..) సూచించే ఊర్ల పేర్లున్నాయి. ప్రాణుల పేర్లు సూచించే గ్రామ నామాలను ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు తన పరిశోధనా గ్రంధం ‘కడప ఊర్లు – పేర్లు’లో విశదీకరించారు. ఆ వివరాలు కడప.ఇన్ఫో వీక్షకుల కోసం … ఆలవ – ఆలవలపాడు ఎద్దు – ఎద్దులఏనె ఎనుము – ఎనుముల చింతల ఏనుగు – అనిమెల కాకి – కాకులవరం కొంగ – కొంగలవీడు కోతి […]పూర్తి వివరాలు ...
కడప : ప్రతిరోజు రాత్రి మనం టివీ ముందు కూర్చుని భోంచేస్తున్న సమయంలో కోల్గెట్ స్కార్షిప్ ప్రకటనలో వెంకటహారిక అనే బాలిక వస్తుంది కదా! ఆ అమ్మాయిది వై.ఎస్.ఆర్ జిల్లా ఖాజీపేట మండలంలోని బక్కాయపల్లె గ్రామం. వెంకట హారిక కోల్గేట్ వారు విద్యార్థులకు ఇచ్చే స్కాలర్ షిప్ పథకానికి ఎంపిక అయింది. కోల్గేట్ వారు ఈపాపకు లక్ష రూపాయలవరకు చదువుల ఖర్చులకు ఆర్ధిక సాయం అందిస్తారు. వేంకట హరికతో పాటు పాప తల్లిదండ్రులతో కోల్గేట్ 35సెకండ్ల లఘు […]పూర్తి వివరాలు ...
ఐదు వందల ఏళ్లకు పైగా ఆధ్యాత్మికంగా , రాజకీయంగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన గంజికుంట నేడు పట్టించుకునేవారు కరువై క్రమక్రమంగా చీకటి పుటల్లోకి నెట్టివేయబడుతోంది. విజయనగర సామ్రాజ్య కాలంలో వనిపెంట , మైదుకూరు, దువ్వూరు ప్రాంతాలకు రాజకీయ కేంద్రంగా విలసిల్లిన గంజికుంట సీమ చరిత్రకు శ్రీకృష్ణ దేవరాయల, అచ్యుతదేవరాయల కాలంనాటి శిలాశాసనాలు(16వ శతాబ్దం ) ఆధారాలుగా నిలుస్తున్నాయి. బ్రిటీషువారి రికార్డులకు ఎక్కిన పాలెగాళ్ళు పట్రా విటలపతినాయుడు వెలమ వెంకోజీ నాయుడు , వన్నూరమ్మలు రాజకీయ కార్యకలాపాలకు గంజికుంట […]పూర్తి వివరాలు ...
కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్గా నియమితులైన హరికిరణ్ బదిలీపై వెళుతున్న కలెక్టర్ బాబురావు నాయుడు నుంచి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా 51 వ కలెక్టరుగా బేస్తవారం పొద్దున 11 గంటలకు కలెక్టరేట్లోని ఛాంబరులో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. హరికిరణ్ 2009 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇక్కడ పనిచేసిన బాబురావు నాయుడు గిరిజన కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న హరికిరణ్ ను ప్రభుత్వం […]పూర్తి వివరాలు ...
నాగులపల్లె మౌర్యకు 100వ ర్యాంకు వేంపల్లె రిషికి 374వ ర్యాంకు కడప : శుక్రవారం ప్రకటించిన 2017 సివిల్స్ ఫలితాల్లో మన కడపోల్లు మెరిశారు. చాపాడు మండలం నాగులపల్లెకు చెందిన నారపురెడ్డి మౌర్య 100వ ర్యాంకు సాధించగా వేంపల్లికి చెందిన రుషికేష్రెడ్డి 374వ ర్యాంకును సాధించి సివిల్స్ లో కడప జిల్లా సత్తా చాటినారు. రైతు కుటుంబానికి చెందిన మౌర్య సివిల్ సర్వీసెస్లో ఉన్నత కొలువు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు చంద్రఓబుళరెడ్డి, జయశ్రీ […]పూర్తి వివరాలు ...