రాయలసీమలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలనే నినాదంతో పోరాటాన్ని ఉద్ధృతం చేసి, అన్నివర్గాల మద్దతుతో ముందడుగు వేస్తామని డాక్టరు పద్మలత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాంధీరోడ్డులోని బాలాజీ వైద్యాలయంలో మంగళవారం రాయలసీమ రాజధాని సాధన కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పద్మలత మాట్లాడుతూ.. ఉద్యమ్యాన్ని ముందుకు నడిపించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, వ్యాపార, ప్రజా సంఘాల మద్దతు తీసుకుని ముందడుగు వేస్తామని వివరించారు. గతంలో కర్నూలులో రాష్ట్ర రాజధాని ఉండేది […]పూర్తి వివరాలు ...
కమలాపురం శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం 15 మంది అభ్యర్థులు తుదిపోరులో నిలుచున్నారు. ఇక్కడ వైకాపా తరపున బరిలోకి దిగిన పోచంపల్లి రవీంద్రనాద్ రెడ్డి తన సమీప ప్రత్యర్ధి, తెదేపా – భాజపా ల ఉమ్మడి అభ్యర్థీ అయిన పుత్తా నరసింహారెడ్డి పై సుమారు ఐదు వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. తుదిపోరులో తలపడిన అభ్యర్థులకు దక్కిన […]పూర్తి వివరాలు ...
గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై కమలాపురం వైకాపా శాసనసభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి పెదవి విరిచారు. శనివారం శాసనసభ ఆవరణలో విలేఖరులతో మాట్లాడిన ఆయన గవర్నర్ తన ప్రసంగంలో టీడీపీ హామీలనే ప్రస్తావించారని అన్నారు. రాయలసీమ గురించి ప్రస్తావనే లేదని, ఆంధ్రప్రదేశ్ రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదని రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. వెనుకబడిన ప్రాంతాన్ని రాజధానిగా గుర్తిస్తే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రహ్మణీ స్టీల్స్ గురించి కూడా గవర్నర్ మాట్లాడలేదని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. రైల్వే ఛార్జీల పెంపు దురదృష్టకరమని […]పూర్తి వివరాలు ...
జిల్లాలో తెదేపా తరపున రాజంపేట శాసనసభ్యుడిగా గెలుపొందిన మేడా మల్లికార్జునరెడ్డికి అసెంబ్లీ విప్‌గా పదవి లభించింది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లా నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి చంద్రబాబునాయుడు కొలువులో మంత్రిపదవి దక్కుతుందని అందరూ ఊహించారు. కానీ నారా వారు కడప జిల్లాను పక్కన పెట్టేయ్యడంతో మొదటి విడతలో మేడా వారికి మంత్రిగిరీ దక్కలేదు. కనీసం మలివిడతలో మంత్రిపదవి లభిస్తుందని మేడా వారు ఆశపడ్డారు. శుక్రవారం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా […]పూర్తి వివరాలు ...
దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్న రాయసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. సీమను అభివృద్ధి చేసుకునే సమయం వచ్చిందనీ ఇప్పటికైనా సీమ ప్రజల గళమెత్తితేనే న్యాయం జరుగుతుందని రాయలసీమ సంఘర్షణ సమితి నిర్వహకులు డాక్టరు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరులోని ఐఎంఏ హాలులో గురువారం సాయంత్రం రాయలసీమ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో భవిషత్తు కార్యాచరణపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత నాయకులు తొలుత రాజధాని, పరిపాలన విభాగాలను ఒకచోట […]పూర్తి వివరాలు ...
జిల్లా నుండి గెలుపొందిన శాసనసభ్యులలో తొమ్మిది మంది గురువారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసినారు. పులివెందుల శాసనసభ్యుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, మేడామల్లికార్జునరెడ్డి (రాజంపేట), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), శ్రీనివాసులు (రైల్వేకోడూరు), రఘురామిరెడ్డి (మైదుకూరు), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), అంజాద్‌బాషా (కడప), జయరాములు (బద్వేలు), రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (ప్రొద్దుటూరు)లు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాత్రమే ప్రమాణ స్వీకారం చేయలేదు. అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో వరుసగా ప్రమాణం చేయిస్తుండగా, రవీంద్రనాథ్‌రెడ్డి పేరు పిలిచే సరికి రాహుకాలం వచ్చింది. […]పూర్తి వివరాలు ...
22న అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో బహిరంగసభ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన రాయలసీమలో రాజధాని నిర్మించడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి అన్నారు. విజయవాడ, గుంటూరు ఇప్పటికే పెద్ద నగరాలని, అక్కడ రాజధానికి తగినవిధంగా మౌలిక సదుపాయాలు లేవని, ప్రజలు తిరిగి హైదరాబాద్ మాదిరి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. రాజధాని నిర్మాణ ఖర్చును భరిస్తానని కేంద్రం హామీ ఇచ్చినందున సీమలో రాజధాని నిర్మిస్తే అక్కడ రైల్వే, విమానాశ్రయాలు అందుబాటులోకి […]పూర్తి వివరాలు ...
జిల్లాకు మలివిడతలో మంత్రి పదవి వస్తుందని తెదేపా తరపున కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శ్రీనివాసరెడ్డి (వాసు) ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరికి మంత్రి పదవి దక్కుతుందన్న విష యమై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఆదివారం వేంపల్లెకు వచ్చిన శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ జమ్మలమడుగు ప్రాంతంలో గానీ, కొప్పర్తి పారిశ్రామిక వాడలో కానీ ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆరు నెలల్లో పాలనాపరమైన అనుమతి […]పూర్తి వివరాలు ...
మైదుకూరు: రాయలసీమ రచయితలు చాలామంది రాజకీయాలు మాట్లాడకుండా సీమ దుస్థితికి ప్రకృతిని నిందిస్తూ ఏడుపుగొట్టు సాహిత్యాన్ని రచించడం ఎంతమేరకు సబబు అని విరసం రాష్ట్ర కార్యదర్శి పి.వరలక్ష్మి ప్రశ్నించారు. స్థానిక జిల్లాపరిషత్ హైస్కూల్ ఆవరణలో ఆదివారం కుందూసాహితీసంస్థ ఆధ్వర్యంలో నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ భవితవ్యము అనే అంశంపై సంస్థ కన్వీనర్ లెక్కల వెంకటరెడ్డి అధ్యక్షతన రచయితలు, కవులు, కళాకారుల సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా నూతన ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రులో కూడా […]పూర్తి వివరాలు ...