సీమలో రాజధాని ఏర్పాటు చేయకుంటే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని విద్యార్థులు హెచ్చరించారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం రాయలసీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి సంఘం కన్వీనర్ భాస్కర్ మాట్లాడుతూ రాజధాని రాయలసీమ హక్కు అనే విషయాన్ని మన పాలకులు మరచిపోతున్నారన్నారు. సీమలో రాజధాని ఏర్పాటు కోసం కృషి చేయని రాజకీయ నాయకులను తరిమికొట్టాలన్నారు. […]పూర్తి వివరాలు ...
మా రాయలసీమ ముద్దు బిడ్డడు, మా భగీరధుడు, మా రాయలసీమ లో పుట్టి మా సీమ కరవుని తలచి, విచారించి మొత్తం తెలుగు నేల అంతా కరువు ఉండకూడదని కంకణం కట్టుకొని భగీరధ ప్రయత్నం చేసిన వాడు….మా సీమ నిండా సంతోషాలు సిరులు కురవాలని మనసార ప్రయత్నం చేసిన వాడు….మా రాజశేఖరుడు….మా గుండెల్లో సదా స్ఫూర్తి నింపుతూ మమ్ములను నడిపించే చుక్కాని……ఆచంద్ర తారార్కం కీర్తింపబడువాడు నేడు వైఎస్ జయంతి!… కడప జిల్లా ప్రజల తరపున ఆ మహనీయుడికిది […]పూర్తి వివరాలు ...
రాయలసీమ స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని రాయలసీమకు చెందిన కవులు, రచయితలు డిమాండ్ చేశారు. తుఫానులు, భూకంపాల ప్రాంతంగా జిఎస్ఐ నివేదిక పేర్కొన్న విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు అశాస్త్రీయమని వారు గుర్తు చేశారు. కడప సిపిబ్రౌన్ గ్రంధాలయ పరిశోధన కేంద్రంలో కుందూ సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రాయలసీమ కవులు, రచయితలతో సమాలోచన జరిగింది. ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కేంద్రసాహితీ అకాడమి అవార్డు […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా పరిషత్ పీఠం ఏకగ్రీవమైంది. జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని తెదేపా నేతలుచేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకార అనంతరం ఓటింగ్ కన్నా ముందే సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో వైకాపా సభ్యులు జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ఎర్రగుంట్ల జడ్పీటీసీ సభ్యుడు గూడూరు రవి, వైస్‌చైర్మన్‌గా ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుడు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన జడ్పీ పాలకవర్గం ఎన్నికలు జరిగాయి. […]పూర్తి వివరాలు ...
ఎవరి పేరు చెప్పి జమ్మలమడుగు పట్టణంలో తెదేపా వాళ్ళు పోలీసులతో తలపడ్డారో… ఎవరి పేరు చెబితే పోలీసులు, అధికారులు ఉలిక్కిపడతారో…. ఎవరి గురించి జమ్మలమడుగు మునిసిపల్ ఎన్నిక వాయిదా పడిందో… అతడే ఈ జానీ! – రెండు వేల మంది తెదేపా కార్యకర్తలు, పదుల సంఖ్యలో నాయకులను, వందలాదిమంది పోలీసులను రెండు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా జమ్మలమడుగు వీధులలో తన కోసం ఎదురుచేసేలా చేసిన ఘనాపాటి. జమ్మలమడుగు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక రోజున గోవా వెళ్ళిన […]పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు సంఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు సరిగాలేదని తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. స్థానిక పురపాలిక ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా గురు, శుక్రవారం జరిగిన లాఠీఛార్జి, బాష్పవాయు ప్రయోగంలో గాయపడిన తెదేపా నాయకులు, కార్యకర్తలను పరామర్శించడానికి శనివారం జమ్మలమడుగుకు వచ్చిన రమేష్ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పురపాలిక ఎన్నిక న్యాయబద్ధంగా జరపాలంటూ నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిని పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి గాయపర్చారన్నారు. పోలీసు […]పూర్తి వివరాలు ...
రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమ భవితవ్యంపై కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఈ రోజు (ఆదివారం – 6వ తేదీన) నిర్వహించే సీమ స్థాయి కవుల, రచయితల , పాత్రికేయుల సమావేశానికి అందరూ తరలిరావాలని కుందూ సాహితి సంస్థ కన్వీనర్ లెక్కల వెంకటరెడ్డి తెలిపారు. స్థానిక సిపిబ్రౌన్ గ్రంధాలయంలో ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ సమావేశానికి కడప.ఇన్ఫో గౌరవ్సంపాదకులు, రచయిత తవ్వా ఓబులరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర విభజనానంతర పరిణామాలు రాయలసీమకు వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటున్నాయని […]పూర్తి వివరాలు ...
రైల్వేకోడూరు మండల పరిధిలోని ఆర్.రాచపల్లె తోటలలో శుక్రవారం తెల్లవారుజామున చిరుతపులి తిరగడంతో స్థానికులు బెంబేలెత్తారు. మూడు రోజులుగా ఈ ప్రాంతంలోని అరటితోటల్లో చిరుతపులి తిరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో నీటితడులు కట్టిన తర్వాత ఏదో అడవిజంతువు తిరుగుతుందని పాదాల గుర్తులు చూసి అనుకున్నామని , అయితే శుక్రవారం వేకువజామున తమ తోటలో నీరు తడి కట్టేందుకు వెళ్లానని భాస్కర్‌రాజు అనే రైతు పేర్కొన్నారు. గ్రామ సమీపంలోని తన తోటలో నిలబడి ఉన్న చిరుతపులిని చూసి భయపడి […]పూర్తి వివరాలు ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాయలసీమ రాజధాని సాధన సమితి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐజీ హనుమంతరెడ్డి సహా ఇతరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోస్తా జిల్లాలతో పోలిస్తే రాయలసీమ జిల్లాలు చాలా వెనకబడి ఉన్నాయన్న జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, ఇదే విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ సైతం […]పూర్తి వివరాలు ...