భాకరాపేట: రుణమాఫీ కాలేదని సిద్దవటం మండలంలోని భాకరాపేట భారతీయస్టేట్‌బ్యాంకు గేట్లు మూసివేసి సోమవారం ఉదయం రైతులు ఆందోళన చేశారు. ఇక్కడి బ్యాంకు శాఖలో దాదాపు 2728 మంది రైతులు పంట రుణాలు తీసుకోగా ఒక్కరికి కూడా మాఫీ కాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు నుండి రుణాలు తీసుకున్న బొగ్గిడివారిపల్లె, పెద్దపల్లె, మేఘనాపురం పంచాయతీల పరిధిలో ఉన్న దాదాపు వంద మంది రైతులు బ్యాంకు వద్దకు చేరి నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకు అధికార సిబ్బందిని […]పూర్తి వివరాలు ...
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆచార్య డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డిని పలువురు ఆదివారం సన్మానించి అభినందనలు తెలిపారు. సీపీ బ్రౌన్ భాషాపరిశోధన కేంద్రం పూర్వ బాధ్యులు విద్వాన్ కట్టా నరసింహులు, యోవేవి లలిత కళల విభాగం సహాయాచార్యులు డా.మూల మల్లికార్జునరెడ్డి, సిబ్బంది శివారెడ్డి, భూతపురి గోపాలకృష్ణ, హరిభూషణ్ రావు, రమేష్, వెంకటరమణ తదితరులు అభినందించారు. రచయిత డా.వేంపల్లి గంగాధర్ శాలువా, పూలమాలతో రాచపాళెంను సత్కరించారు. రచయిత మధు, కొండూరు జనార్థనరాజు, జిల్లా సాహితీ స్రవంతి […]పూర్తి వివరాలు ...
మలబార్ గోల్డ్, డైమండ్ షోరూం ప్రారంభం ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్ ఆదివారం కడపకొచ్చారు. స్థానిక కోటిరెడ్డిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్, డైమండ్ షోరూంను సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించారు. షోరూం ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కాజల్‌ను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. షోరూంను ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన పలు డిజైన్ల ఆభరణాలను కస్టమర్లకు చూపించారు. దాదాపు అరగంట షోరూంలోనే సందడి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాజల్ అగర్వాల్ మలబార్ గోల్డ్, డైమండ్ భారతీయ […]పూర్తి వివరాలు ...
బత్తుల ప్రసాద్ వెలువరించిన కథా సంపుటి ‘గంజిబువ్వ’ ఆవిష్కరణ శనివారం రాత్రి హైదరాబాదులోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో జరిగింది. హైదరాబాదు బుక్ ఫెయిర్‌లో భాగంగా జరిగిన కార్యక్రమంలో చలనచిత్రాల నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆవిష్కరించి మొదటి పుస్తకాన్ని తెలంగాణా దర్శకుల సంఘం అధ్యక్షుడు అల్లాణి శ్రీధర్‌కు అందించారు. ఈ సంకలనంలో బత్తుల ప్రసాద్ రాసిన 16 కథలు ఉన్నాయి.ఇవి ఇంతకు ముందు వివిధ పత్రికలలో ప్రచురితమైన కథలు. గతంలో బత్తుల ప్రసాద్ కథలు ‘సగిలేటి కథలు’ పేర […]పూర్తి వివరాలు ...
అనగనగా మంగాపురం అని ఒక ఊరు. ఆ ఊర్లో జనాలంతా కూలీ నాలీ చేసుకుని రెక్కల కష్టం మీద బతికేవోల్లు. ఉన్నట్టుండి ఒక రోజు ఆ ఊరికి వచ్చిన కొంతమంది స్థానిక యాపారులకి అక్కడ ఉన్న భూముల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తెలిసింది. వెంటనే వాళ్ళు ఆ దేశపు రాజు దగ్గరికి పోయి ఇలా అడిగినారు.. ‘రాజా… మేము మంగాపురంలో ఉన్న బంగారు నిక్షేపాలను కనుగొన్నాం. మీరు అనుమతిస్తే ఆ నిక్షేపాలను వెలికితీసి అమ్ముతాం. తద్వారా వచ్చిన […]పూర్తి వివరాలు ...
కడప: కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నవంబరు 30లోగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 23-07-2014 తేదీన కేంద్ర ఉక్కు, గనులశాఖమంత్రి తోమార్‌కు లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన కేంద్రమంత్రి 21-08-2014న ప్రతి లేఖ రాస్తూ, నవంబర్ 30లోగా సెయిల్ తన నివేదికను సమర్పిస్తుందని తెలియచేశారు. ఇవాళ డిసెంబర్ 20. అంటే బిల్లులో పేర్కొన్న ఆరు నెలల గడువు […]పూర్తి వివరాలు ...
ప్రముఖ సాహితీ విమర్శకులు, సాహితీవేత్త ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు ఈ ఏడాది కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రచించిన “మన నవలలు, మన కథలు” అనే విమర్శనా గ్రంథానికి ఈ అవార్డు ఇస్తున్నట్లు శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రకటించింది. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ప్రస్తుతం కడపలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనాకేంద్రం భాద్యులుగా వ్యవహరిస్తూ ఇక్కడి యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో గౌరవ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని కుంట్రపాకం(తిరుపతి సమీప గ్రామం)లో జన్మించిన […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నడుస్తున్న పాలశీతలీకరణ కేంద్రాల(బీఎంసీయూ) మూసివేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మహిళలను లక్షాధికారులను చేసే ఉద్దేశంతో బ్యాంకులింకేజీ, వడ్డీలేని రుణాలు తదితర కార్యక్రమాలతో పాటు బీఎంసీయూలను ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు వీటిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినారు. జిల్లాలో గతంలో 32 వేల లీటర్లకు పైగా పాలను సేకరించగా ప్రస్తుతం అన్ని బీఎంసీయూలు కలిపి 6,500 లీటర్లకు మించి సేకరణ జరగడం లేదు. జిల్లాలో 21 […]పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు: మైలవరం మండలం నావాబుపేట సమీపంలోని దాల్మియా సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన గనుల తవ్వకాలను కలెక్టర్ ఆదేశాల మేరకు నిలుపుదల చేశారు. స్థానిక ఇన్‌ఛార్జి తహశీల్దార్ సాయినాథరెడ్డి గురువారం మాట్లాడుతూ పెద్దకొమెర్ల, హనుమంతరాయునిపేట గ్రామాల్లో కార్బన్ వాయువు ప్రభావంచేత పంటలు నల్లగా మసకబారిపోతుండటంతో, అలాగే ప్రజల ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. పరిశ్రమ కోసం కొనుగోలు చేసిన భూముల్లో మండల పరిధిలోని నవాబుపేట గ్రామానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోనే సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన మైనింగ్ […]పూర్తి వివరాలు ...