తెలుగువారందరి ప్రత్యేక రాష్ట్రం విశాలాంధ్ర ఏర్పాటుకు అంగీకరించి రాయలసీమ వాసులు అన్ని విధాలా నష్టపో యారు. సర్కారు జిల్లాలతో ఐక్యత పట్ల నాటి సీమ నేతలలో పలువురికి ఆంధ్ర మహాసభ కాలం నుండి అనుమానాలు ఉండేవి. ఆంధ్ర విశ్వవిద్యా లయ కేంద్రాన్ని అనంతపురం లో ఏర్పాటు చేయాలంటూ యూనివర్సిటీ సెనేట్ కమిటీ 1926లో చేసిన తీర్మానాన్ని సైతం లెక్కచేయక దాన్ని విజయవాడ నుండి విశాఖపట్టణానికి తరలించారు. ఇలాంటి వైఖరి కారణంగానే తమిళుల ఆధిపత్యం వదు ల్చుకొని సర్కారు […]పూర్తి వివరాలు ...
1980, 90 దశకాలలో రాయలసీమ జిల్లాలలో ఎక్కడ ఓ మోస్తరు దొంగతనం జరిగినా మరుసటి నాటి దినపత్రికలలో పోలీసుల ప్రకటన ఇలా ఉండేది. ‘దొంగతనం జరిగిన తీరును చూస్తోంటే ఇది స్టూవర్టుపురం ముఠాల పని అయి ఉంటుందని పోలీసులు ప్రాధమిక విచారణలో తేలింది’ అనేది ఆ ప్రకటనల సారాంశం. సదరు వార్తలు చదివిన వారికి స్టూవర్టుపురం దొంగల వెర్రితనం ఆశ్చర్యం కలిగించేది. ఎందుకంటే ఒకప్పుడు గుంటూరు జిల్లాలో భాగంగా ఉండిన చీరాలకు దగ్గరలో ఉన్న స్టూవర్టుపురం అనే […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని పోతన సాహిత్యపీఠం మరియు తితిదే ధర్మప్రచారమండలి ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండరామాలయంలో గురువారం జరిగిన భాగవత పద్యార్చనకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య శ్యాంసుందర్ పోటీలను ప్రారంభింపద్యార్చనకు హాజరైన విద్యార్థులను చూసి వారు ఆశ్యర్యచకితులయ్యారు. వీరు తెలుగుభాషా గతవైభవాన్ని గుర్తుకు తెస్తున్నారని వైవీయూ ఉపకులపతి శ్యాంసుందర్ అన్నారు. తెలుగుభాషకు సేవ చేస్తున్న […]పూర్తి వివరాలు ...
యోవేవి పాలకుల తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం విశ్వవిద్యాలయ బంద్‌కు పిలుపునిచ్చినట్లు రాయలసీమ విద్యార్థి వేదిక కోకన్వీనరు దస్తగిరి, ప్రతినిధి నాగార్జున ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఉన్న సమస్యలు, విద్యార్థులపై అక్రమ కేసులు నమోదు, పరీక్షల విభాగం ప్రక్షాళన, పీహెచ్డీ ప్రవేశాల ప్రకటన వంటి అంశాల సాధన కోసం బంద్ చేస్తున్నామన్నారు.పూర్తి వివరాలు ...
వైకుంఠ ఏకాదశి(ముక్కోటి దేవతలు వేచి దర్శనం పొంది స్వామి అనుగ్రహం పొందిన రోజు)ని పురస్కరించుకుని గురువారం దేవునికడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశి కావడంతో గురువారం తెల్లవారుజామున 4 గంటలకే స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. గోవిందనామస్మరణల నడుమ కడపరాయుడిని ఉత్తరద్వారం వద్ద దర్శించి తరించారు. ఆలయప్రధాన అర్చకులు శేషాచార్యులు పూజలు చేసిన అనంతరం భక్తులను స్వామి దర్శనానికి అనుమతించినారు. వైకుంఠ ఏకాదశి అంటే? ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: జయహో జనగణమన చతుర్థ వార్షికోత్సవాల సందర్భంగా ప్రొద్దుటూరు అనిబిసెంట్ పురపాలక ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం వివిధ విద్యాసంస్థలకు చెందిన ఆరు వేలమంది విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. 1911 డిసెంబరు 27వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని రచించి ఆలపించిన సందర్భంగా అందరిలో ఐక్యతాభావం, జాతీయతా భావం, దేశభక్తిని పెంపొందించేందుకు, మహనీయులను స్మరించుకునేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సుమారు 6 వేల మంది విద్యార్థులు మైదానానికి చేరుకున్నారు. మాజీమున్సిపల్ […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: లెజెండ్ సినిమా చేయడం తన పూర్వ జన్మ సుకృతమని హిందూపురం శాసనసభ్యుడు, కథా నాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. చలనచిత్ర సీమలో లెజెండ్ సినిమా ఒక లెజెండ్‌గా మిగిలిపోతుందన్నారు. లెజెండ్ చలనచిత్రం 275 రోజులు ప్రొద్దుటూరులోని అర్చనా థియేటర్లో ప్రదర్శింపబడిన నేపధ్యంలో విజయోత్సవ సభను ఆదివారం స్థానిక రాయల్ కౌంటీ రిసార్ట్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రం యూనిట్‌తో కలిసి వచ్చిన బాలకృష్ణ మాట్లాడుతూ నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చిత్రానికి అన్ని సదుపాయాలు కల్పించారన్నారు. […]పూర్తి వివరాలు ...
కడప: ప్రస్తుతం వైకాపాలో ఉన్న కందుల సోదరులు భాజపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వీరు భాజపా నేతలతో జరుపుతున్న చర్చలు కొలిక్కి వచ్చినట్లు మీడియాలో కధనాలు వెలువడ్డాయి. కందుల రాజమోహన్‌రెడ్డి ఆ పార్టీ ముఖ్యనేతతో భేటీ అయ్యి, చేరిక తేదీని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. జనవరి 9వ తేదీన విజయవాడకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నారు. ఆయన సమక్షంలో చేరేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ అది కుదరకపోతే 18వ తేదీన కడప నగరంలో […]పూర్తి వివరాలు ...
రాయలసీమ అభివృద్ధిపై వివక్ష రాష్ర్టానికి, జిల్లాకు ఒరిగిందేమీ లేదు టీడీపీకి ఎక్కువ స్థానాలు రాలేదన్న అక్కసుతోనే ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదు ఎర్రచం’ధనం’ సీమ కోసం ఖర్చు చేయాల కడప: రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివక్ష చూపుతున్నారని శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఈ రోజు (శుక్రవారం) స్థానిక కాంగ్రెస్ పార్టీ (జిల్లా) కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిల్లాలో స్టీలు ప్లాంటు ఏర్పాటు […]పూర్తి వివరాలు ...