కడప: వేంపల్లెలో బేస్తవారం (ఫిబ్రవరి 5వ తేదీన) ‘వేంపల్లె షరీఫ్’ రాసిన ‘తలుగు’ కథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. లిటిల్‌ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో 5వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, కథారచయిత, శాసనమండలి సభ్యుడు షేక్ హుసేన్, కర్నూలుకు చెందిన కథా రచయిత హిదాయతుల్లా, ప్రముఖ కవి వెంకటకృష్ణ, కడపకు చెందిన విమర్శకుడు తవ్వా […]పూర్తి వివరాలు ...
ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఖాళీ స్థలంలో మరో గ్యారేజి (వాహనశాల) నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించి ఆర్టీసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్న ప్రాంతంలోనే గ్యారేజీని నిర్మించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. గ్యారేజీ నిర్మాణానికి సుమారు రూ.4.20 కోట్లు కేటాయించారు. అందుకు సంబంధించి హైదరాబాదులో టెండర్లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈనెల 9వ తేదీన టెండర్లను ఓపెన్ చేసి కాంట్రాక్టు ఖరారు చేయనున్నారు. నగరాలలో సిటీ బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సంకల్పించిన నేపధ్యంలో […]పూర్తి వివరాలు ...
పులివెందుల: స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట గురువారం తెలుగు తమ్ముళ్లు జగన్ దీక్షకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టడం వింతగా కనిపిస్తోంది. ప్రభుత్వం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే జగన్ నిరసన దీక్షకు దిగడం సిగ్గుచేటంటూ తెదేపా రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించినారు. కడప జిల్లా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాలో గళమెత్తావా? ఇప్పుడెందుకు నిరసన దీక్షలు చేయబోతున్నావు? […]పూర్తి వివరాలు ...
రాష్ట్రస్థాయి పోటీల్లో 17 బంగారు, 15 రజత, 2 కాంస్య పతకాలు కడప: ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు కేరళలో జరగనున్న జాతీయస్థాయి ఈత పోటీలకు 11మంది కడప జిల్లా ఈతగాళ్ళు అర్హత సాధించడం విశేషంగా ఉంది. కర్నూలులో ఇటీవల జరిగిన సబ్‌జూనియర్, జూనియర్, వింటర్ అక్వాటెక్ ఛాంపియన్షిప్ రాష్ట్రస్థాయి పోటీల్లో కడప ఈతగాళ్ళు పతకాల పంట పండించారు. ఇందులో 17 బంగారు, 15 రజత, 2 కాంస్య పతకాలతో మొత్తం 34 పతకాలు సాధించి కడప […]పూర్తి వివరాలు ...
దేవుని కడప బ్రహ్మోత్సవాలలో గురువారం (29 జనవరి 2015) నాటి ఉత్సవ కార్యక్రమాలు… ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, అవభృథ స్నానం సాయంత్రం వూంజల్‌సేవ, హంసవాహనసేవ, ధ్వజావరోహణంపూర్తి వివరాలు ...
కడప: మూడు రాష్ట్రాల పోలీసు డాగ్ స్క్వాడ్లకు నిర్వహించిన పోటీల్లో కడప డాగ్‌స్క్వాడ్‌లు మొదటి, రెండవ బహుమతులు దక్కించుకున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ శిక్షణ అకాడమిలో ఈ పోటీలు జరిగినాయి. తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కుక్కలకు ఈ పోటీలు నిర్వహించారు. కడప జిల్లా కుక్కలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవడంతో బంగారు, రజత పతకం అందచేశారు. ఈ సందర్భంగా డాగ్‌స్క్వాడ్ భాద్యతలు చూసే రామ్మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు, పీరయ్య, శివకుమార్లను జిల్లా ఎస్పీ […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: నగరంలో దొంగతనాలు కొనసాగుతూనే ఉన్నాయి. దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని మరీ దొంగతనం చేస్తుండడంతో నగర వాసులు ఇల్లు విడిచి పోవాలంటే భయపడుతున్నారు. ఒకటి రెండు రోజుల పాటు ఆ ఇంటిని గమనిస్తూ, ఇంట్లో వారు ఎక్కడికి వెళ్లారో తెలుసుకొని దొంగలు రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం మోడంపల్లె, జిన్నారోడ్డులోని నాలుగు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన మరువక ముందే మోడంపల్లెలోని శారదా ప్రేమవాణి అనే […]పూర్తి వివరాలు ...
దేవుని కడప బ్రహ్మోత్సవాలలో ఐదోరోజు శనివారం నాటి ఉత్సవాలు… ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగింపు, స్నపన తిరుమంజనం సాయంత్రం 6గంటలకు వూంజల్‌సేవ సాయంత్రం గరుడవాహన సేవ నగరసంకీర్తన ఉత్సవాలలో భాగంగా నగరంలోని ప్రధాన పురపాలక ఉన్నత పాఠశాల వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి అభిషేకోత్సవం, అలంకరణ ఉంటుందని రుక్మిణి పాండురంగ భజన బృందం తెలిపింది. అనంతరం స్వామి గరుడసేవలో పాల్గొనే భక్తులకు అన్నదానం చేయనున్నట్లు కమిటీ పేర్కొంది. సాయంత్రం నాలుగు గంటలకు భజన బృందంతో అన్నమయ్య విగ్రహం […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా వాసుల ఆశలన్నీ ఆవిరి కందుల సోదరులను భాజపాలో చేర్చుకోవడానికి మొన్న 18న కడపకొచ్చిన వెంకయ్య నాయుడు గారు కడప జిల్లా అభివృద్ధి విషయంలో మినుకుమినుకుమంటున్న ఆశల మీద నిర్దాక్షిణ్యంగా చన్నీళ్ళు గుమ్మరించి చక్కా వెళ్ళిపోయారు. కేంద్ర కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ వాణిని బలంగా వినిపించగల నాయకుడిగా, చాలాకాలంగా ఈ ప్రాంత సమస్యలు, పరిస్థితుల గురించి అవగాహనతోబాటు బాధ్యతకూడా కలిగిన సీనియర్ నాయకుడిగా ఆయన్నుంచి కడప జిల్లావాసులు ప్రధానంగా కోరుకున్నది నాలుగు విషయాల్లో స్పష్టత – అవి: […]పూర్తి వివరాలు ...