విభజన తరువాత తెదేపా ప్రభుత్వ దాష్టీకాన్ని చూస్తూ మదనపడిన సీమవాసులు బాబు గారు విడుదల చేసిన చీకటి జీవో 120 కారణంగా ఇప్పుడు నిరసన గళాన్ని వినిపించేందుకు స్వచ్చందంగా వీధుల్లోకి వస్తున్నారు. సీమకు జరుగుతున్న మోసాన్ని ప్రభుత్వ అనుకూల మీడియా తొక్కిపెట్టినా,కోస్తా వారి ఆధిపత్యంలో కొనసాగుతున్న మీడియా సంస్థలు ఒక ప్రాంతం కోసమే విలపిస్తున్నా, ప్రభుత్వం బరి తెగించినా…స్థానిక నాయక గణాలు, విపక్షాలు నోరు మెదపకపోయినా, గుంపులు గుంపులుగా/సంస్థలుగా ఉద్యమకారులు విడిపోయినా…ఇప్పుడు అంతా ఒకే ఆకాంక్షతో బయటికొస్తున్నారు. […]పూర్తి వివరాలు ...
కడప: నిన్న (శనివారం) జీవో 120కి నిరసనగా తిరుపతిలో జరిగిన ధర్నాకు సంబంధించి వివిధ పత్రికల కవరేజీ ఇలా ఉంది…ఒక్క సాక్షి, విశాలాంధ్ర, ప్రజాశక్తి పత్రికలు మాత్రం ఈ విషయానికి ప్రాధాన్యత ఇచ్చి మెయిన్ పేజీలలో వార్తలు క్యారీ చేయగా మిగతా తెలుగు పత్రికలు ఈ అంశాన్ని, వార్తలను అంతగా ప్రాధాన్యం లేని చిత్తూరు జిల్లా టాబ్లాయిడ్ లోపలి పేజీలకు పరిమితం చేశాయి. ఇంగ్లీషు పత్రికలైన The Hans India, The Hinduలు ఈ విషయానికి తెలుగు పత్రికలకన్నా […]పూర్తి వివరాలు ...
తిరుపతి ధర్నా విజయవంతం ప్రభుత్వ కనుసన్నల్లో ధర్నా అడ్డుకోవటానికి అధికారుల ప్రయత్నం తరలివచ్చిన విద్యార్థులు… నేతలు, రాజకీయ పక్షాలు దూరం (తిరుపతి నుండి అశోక్) రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన జోనల్ వ్యవస్థను నీరుగారుస్తూ, రాయలసీమకు అన్యాయం చేస్తూ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రవేశాల కోసం తీసుకొచ్చిన 120 జీవోను తక్షణమే రద్దు చేయాలని రాయలసీమ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. జీవో 120ని నిరసిస్తూ శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో రాయలసీమ పోరాట సమితి, విద్యార్థి సంఘాలు, […]పూర్తి వివరాలు ...
తెలుగులో రెండు సంవత్సరాల ఎం.ఏ కోర్సును అందిస్తున్న కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం నాలుగవ సెమిస్టర్ లో విద్యార్థులకు ‘తెలుగు సాహిత్య విమర్శ’ (పేపర్ 401) పేర ఒక సబ్జెక్టును బోధిస్తోంది. వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రాచపాలెం, ఆరుద్ర, ఎస్వీ రామారావు, లక్ష్మణ చక్రవర్తి, జివి సుబ్రహ్మణ్యం, బ్రహ్మానంద, వీరభద్రయ్య తదితరుల రచనలకు ఇందులో చోటు కల్పించిన యోవేవి రాచమల్లు రామచంద్రారెడ్డి రాసిన విమర్శా వ్యాసాలకు కనీసం చోటు కల్పించకపోవటం గర్హనీయం.(http://www.yogivemanauniversity.ac.in/fwd/TELUGU.pdf) తెలుగు సాహితీ జగత్తులో విమర్శలో తనదైన ముద్ర […]పూర్తి వివరాలు ...
సీమ విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కడప: శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాల ప్రవేశాలలో రాయలసీమ విద్యార్థులకు అన్యాయం చేస్తూ కోస్తా వారికి ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 120కి నిరసనగా శనివారం (సెప్టెంబర్ 5న) తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ధర్నా నిర్వహించనున్నట్లు గ్రేటర్ రాయలసీమ పోరాట సమితి, రాయలసీమ సామాజిక మాధ్యమాల ఫోరంలు ఒక ప్రకటనలో తెలియచేశాయి. రాయలసీమ విద్యార్థులకు చెందాల్సిన 107 సీట్లను 13 జిల్లాల వారికి కేటాయిస్తూ […]పూర్తి వివరాలు ...
మా రాయలసీమ ముద్దు బిడ్డడు, మా భగీరధుడు, మా రాయలసీమ లో పుట్టి మా సీమ కరవుని తలచి, విచారించి మొత్తం తెలుగు నేల అంతా కరువు ఉండకూడదని కంకణం కట్టుకొని భగీరధ ప్రయత్నం చేసిన వాడు….మా సీమ నిండా సంతోషాల సిరులు కురవాలని మనసార ప్రయత్నం చేసిన వాడు….మా రాజశేఖరుడు….మా గుండెల్లో సదా స్ఫూర్తి నింపుతూ మమ్ములను నడిపించే చుక్కాని……ఆచంద్ర తారార్కం కీర్తింపబడువాడు నేడు వైఎస్ వర్ధంతి!… కడప జిల్లా ప్రజల తరపున ఆ మహనీయుడికిది […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: పుట్టపర్తి నారాయణాచార్యుల వారి 25వ వర్థంతి సందర్భంగా మంగళవారం ఉదయం స్థానిక శివాలయం కూడలిలోని ఆయన విగ్రహానికి అభిమానులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పుట్టపర్తి సాహితీపీఠం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎంఈఓ శివప్రసాద్ మాట్లాడుతూ పుట్టపర్తి భావితరాలకు మార్గదర్శి, ఆదర్శప్రాయుడని కొనియాడారు. పుట్టపర్తి వారు కొంతకాలం పాటు ప్రొద్దుటూరు పురపాలక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేయడం ఇక్కడి వాళ్ళ అదృష్టమన్నారు. వీరపునాయునిపల్లె మండల అభివృద్ది అధికారి మొగిలిచెండు సురేష్ మాట్లాడుతూ… […]పూర్తి వివరాలు ...
కడప: అడ్డగోలుగా సీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నతెదేపా సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీమ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి కోస్తా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదానికి 23.08.2014న పద్మావతి మహిళా వైద్య కళాశాల (తిరుపతి) ప్రవేశాలకు సంబంధించి ‘జీవో 120’ని విడుదల చేసింది. ఈ సంవత్సరం కొంతమంది రాయలసీమ విద్యార్థులు కోర్టు గడప ఎక్కడంతో రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కన పట్టి బరితెగించి, అడ్డగోలుగా తెదేపా ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో 120 వ్యవహారం వెలుగులోకి వచ్చింది. […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి 25 వరకు జనవిజ్ఞానవేదిక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి తవ్వా తెలియచేశారు. శుక్రవారం స్థానిక గ్రంధాలయంలో జవివే జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి ఆయన సభ్యత్వ నమోదు గోడపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ… శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జనవిజ్ఞానవేదికలో సభ్యులుగా చేరాలని పిలునిచ్చారు. సామాజిక అంశాల విశ్లేషణ, అధ్యయనాలను శాస్త్రీయ, హేతువాద దృక్పధంతో ప్రజానీకంలో ఆలోచనలుగా […]పూర్తి వివరాలు ...