చలసాని, శివాజీలకు బైరెడ్డి హెచ్చరిక అనంతపురం: మేధావిగా చెప్పుకునే చలసాని, సినీనటుడు శివాజి రాయలసీమ పిల్లోల్లపై జరిగిన దాడులపై 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో వాళ్ళ ఇళ్ళ దగ్గర విద్యార్థులు నిరసనలకు దిగుతారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు సోమవారం అనంతపురంలో చలసాని, శివాజీల ప్రోద్భలంతో విద్యార్థి సంఘ నాయకులు క్రిష్ణానాయక్, ప్రతాప్‌రెడిలప్డై జరిగిన దాడిని నిరసిస్తూ రాయలసీమకు చెందిన వివిధ సంఘాల నేతృత్వంలో మంగళవారం నగర పాలక సంస్థ […]పూర్తి వివరాలు ...
98.89 శాతం ఉత్తీర్ణత 797 మందికి పదికి పది జిపిఏ కడప: పదోతరగతి ఫలితాల్లో మళ్లీ మనోళ్ళు సత్తా చాటారు. కడప జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపారు. పదోతరగతిలో కడప జిల్లా విద్యార్థులు 98.89 శాతం ఉత్తీర్ణత (Pass) సాధించి జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టారు. మొత్తం 797 మంది విద్యార్థులు (2.2 శాతం) పదికి పది జీపీఏ సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచారు. జిల్లా విద్యాశ్ఖాదికారులు తెలిపిన సమాచారం ప్రకారం 2015-16 విద్యాసంవత్సరానికి గాను జిల్లాలో […]పూర్తి వివరాలు ...
కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన కె.వి.సత్యనారాయణ బదిలీపై వెళుతున్న కలెక్టర్ కె.వి. రమణ నుంచి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేసిన కె.వి.రమణ గృహనిర్మాణశాఖ ఎండీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సత్యనారాయణను ప్రభుత్వం కడప జిల్లా కలెక్టరుగా నియమించింది. సత్యనారాయణ స్వస్థలం కృష్ణా జిల్లాలోని గన్నవరం. బాధ్యతలు తీసుకున్న అనంతరం వేద పండితులు కొత్త కలెక్టర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. పలువురు అధికారులు, […]పూర్తి వివరాలు ...
ఓ స్వయం ప్రకటిత మేధావీ గారు.. చాల్లే చూశాం గానీ… కొన్నేళ్ల క్రితం వరకు మేధావులంటే చాలా అంచనాలుండేవి. మేధావులు ప్రపంచానంతా ఒక యూనిట్ గా చూస్తారని అనుకునే వాడిని. వారికి ప్రాంతాలు, కులాలు, మతాలతో సంబంధం ఉండదనుకునే వాడిని. కానీ ఏపీలో స్వయంప్రకటితులుగా వెలసిన కొందరు మేధావులను చూశాక మేధావుల వెనుక కూడా మర్మాలుంటాయని అర్థమైంది. చలసాని శ్రీనివాసరావు. సమాజం గౌరవించదగ్గ వ్యక్తి. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పగానే జనం కోసం నడుం బిగించారు. […]పూర్తి వివరాలు ...
ప్రత్యేకహోదా డ్రామా వికటించింది ఒకే రోజులో డ్రామా కట్టేశారు (అనంతపురం నుండి మా విశేష ప్రతినిధి) అనంతపురంలో ప్రత్యేకహోదా పేరుతో నిన్నటి నుండి నిరవధిక దీక్ష చేస్తున్న చలసాని శ్రీనివాస్, ఈ రోజు అక్కడికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సినిమా నటుడు శివాజీలను సీమ సమస్యలపై ప్రశ్నించిన రాయలసీమ సోషల్ మీడియా ఫోరంకు చెందిన యువకుడిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనతో నిన్నటి నుండి ప్రత్యేక హోదా పేరుతో చలసాని, శివాజీలు కలిసి రక్తి కట్టిద్దామనుకున్నడ్రామా కాస్తా […]పూర్తి వివరాలు ...
జిల్లా రైతులకు ముఖ్యమంత్రి పరోక్ష సందేశం కడప: రైతులు కడప జిల్లాలో వరి సాగు చేయకుండా ఉద్యాన పంటలు పండించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరోక్షంగా సందేశమిచ్చారు. అలాగే కడప జిల్లాను హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, అందుకే ఇక్కడి నుంచి ఉద్యాన రైతుల రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. స్థానిక పురపాలిక మైదానంలో శనివారం ఉద్యాన రైతుల రుణ ఉపశమన పత్రాలు మరియు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా […]పూర్తి వివరాలు ...
కడప: కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మించాలని, గుండ్రేవుల వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ తో రేపు (మే 5న) భాజపా ఆధ్వర్యంలో ‘ఛలో సిద్ధేశ్వరం’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేవైఎం జాతీయ కార్యవర్గసభ్యుడు నాగోతు రమేష్ తెలిపారు. మంగళవారం రాజంపేటలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ రెండు ప్రాంతాల్లో అలుగు, బ్యారేజీ నిర్మాణం వల్ల రాయలసీమకు సుమారు 40 టీఎంసీల నీరు అదనంగా వచ్చే అవకాశముందన్నారు. వీటిని నిర్మించాలని […]పూర్తి వివరాలు ...
యనమల రామకృష్ణుడు గారు 2016 -17 ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బడ్జట్ శాసనసభలో ప్రవేశ పెడుతూ చేసిన ప్రసంగంలో “గోదావరి, క్రిష్ణా జిల్లాల ప్రాంతమంత 160 సంవత్సరాల క్రితం దుర్భర దారిద్ర్యములో ఉండేదని, సర్ ఆర్దర్ కాటన్ మహాశయుడు ధవలేశ్వరం మరియు విజయవాడల దగ్గర బ్యారేజిల నిర్మాణం చేయడం వలన ఆ ప్రాంతాలు ధాన్యాగారాలుగా మారాయి” అని వివరించారు. అదేవిధంగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి రాయలసీమను ధాన్యాగారంగా మారుస్తుందని చెప్పారు. గోదావరి నదిని క్రిష్ణానదితో అనసంధానించడం ద్వారా […]పూర్తి వివరాలు ...
కడప: 2015-16 సంవత్సరానికి గానుఅం.ప్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ యాజమాన్య అవార్డుకు ఎర్రగుంట్లలోని ‘జువారి సిమెంట్స్’ కర్మాగారం ఎంపికైందని ఆ సంస్థ మానవ వనరుల విభాగం సీనియర్ మేనేజర్ శ్రీరాం కడప.ఇన్ఫోకు తెలిపారు. కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విజయవాడ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (వర్క్స్) వైఎస్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. కర్మాగారంలో అనుసరించిన ఉత్తమ విధానాల కారణంగా తమకు ఈ […]పూర్తి వివరాలు ...