వార్తా విభాగం

సంకీర్తనలు

ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ

తన సంకీర్తనా మాధుర్యంతో అలమేలుమంగ పతిని కీర్తించి తరించిన పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. కడప జిల్లాకు చెందిన ఈ వాగ్గేయకారుడు పాలకొండల ప్రకృతి సోయగాల నడుమ నెలవై, భక్తుల కొంగు బంగారమై భాసిల్లుతున్న వేయి నూతుల కోన (వెయ్యినూతుల కోన) నృసింహున్ని చూడరమ్మని ఇలా కీర్తిస్తున్నాడు.. ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ వేడుకఁ బరుషలెల్ల వీధినుండరమ్మా. ||పల్లవి|| అల్లదివో వోగునూతులౌభళేశు పెద్దకోన వెల్లిపాల నీటి జాలు వెడలే సోన చల్లనిమాఁ కులనీడ సంగడిమేడలవాడ […]పూర్తి వివరాలు ...

సామెతలు

కడప సామెతలు – ‘ఆ’తో మొదలయ్యేవి

‘ఆ’తో మొదలయ్యే కడప సామెతలు … ‘ఆ’ అనే అక్షరంతో తెలుగు సామెతలు. కడప జిల్లాతో పాటుగా రాయలసీమ నాలుగు జిల్లాలలో వాడుకలో ఉన్న/ఉండిన సామెతలు. ‘ఆ’ అంటే ఆరునెల్లు ఆ ఊరుకు ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరుకు ఆ ఊరూ అంతే దూరం ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు ఆకు ముళ్ళు మీద బడినా, ముళ్ళు ఆకు మీద పడినా బొక్క ఆకుకే ఆకార పుష్టి, నైవేద్య నష్టి ఆగం అడివప్పా అంటే మడిగ […]పూర్తి వివరాలు ...

సామెతలు

కడప జిల్లా సామెతలు – ‘అ’తో మొదలయ్యేవి

‘అ‘తో మొదలయ్యే కడప జిల్లా సామెతలు అందరూ బాపనోల్లే, గంప కింద కోడి ఏమైనట్లు? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నీ ఉన్నెమ్మ అణిగిమణిగి ఉంటే ఏమీ లేనమ్మ ఎగిసెగిసి పడిందంట అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలీనమ్మ ఏకాదశి నాడు చచ్చిందంట అడక్కుండా అమ్మయినా పెట్టదు అడివి పంది సేను మేసి పొతే, ఊరపంది సెవులు కోసినట్టు అడివి సెట్టుకు యానాదోడు పెట్టిందే పేరు అడుక్కునే వాడిని బుడుక్కునేవాడు అడిగినట్లు అడ్డబొట్టోడు, […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం పర్యాటకం

కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

బౌద్ధ ప్రదీప కడప కడప జిల్లాలో నందలూరు, పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నాగనాదేశ్వరుని కొండ నేలమాళిగలోని బౌద్ధ స్థూపాలు– బుద్ధుడి మధుర జ్ఞాపకాలు, భావితరాలకు నిత్య స్ఫూర్తి దీపికలు. కడప జిల్లాను కూడా బౌద్ధ పర్యాటకం లో భాగం చేసి, ఇక్కడి బౌద్ధ ప్రదేశాలను అభివృద్ధి చేయవలసిందిగా జిల్లా ప్రజలు, పర్యాటక ప్రియులు, బౌద్ధ విశ్వాసులు కోరుతున్నారు. కడప జిల్లాలో వేల సంవత్సరాల పాటు బౌద్ధం వైభవంగా విరాజిల్లింది. అనంతపురం జిల్లాలోని ఎర్రగుడిలోనూ, కర్నూలు జిల్లా పత్తికొండ […]పూర్తి వివరాలు ...

ఈ-పుస్తకాలు వేమన పద్యాలు

వేమన శతకం (వేమన పద్యాలు)

వేమన శతకం ఈ-పుస్తకం రెడ్డి సేవా సమితి కడప మరియు వందేమాతరం ఫౌండేషన్,హైదరాబాద్ ల ప్రచురణ. జూన్ 2011లో ప్రచురితం.  పద్యాల సేకరణ : కట్టా నరసింహులు, సంపాదకత్వం: ఆచార్య జి.శివారెడ్డిపూర్తి వివరాలు ...

అభిప్రాయం

ఆం.ప్ర ప్రభుత్వం వర్మ పైన కేసు పెడుతుందా?

కడపవెబ్సిరీస్ ‘ఫ్యాక్షనమ్మ రాయలసీమ అయితే ఆ అమ్మ గర్భగుడి కడప’ – వెబ్ సిరీస్ టీజర్లో వోడ్కా మరియు తొడల వర్మగా ఖ్యాతి గడించిన వీర ఫ్లాపు సినిమాల దర్శకుడి వ్యాఖ్యానం. ఇలాంటి విపరీత వ్యాఖ్యానాలకు తెగబడిన రామూది కోస్తా ప్రాంతం కావడం కాకతాళీయం కాదు. వివాదాల్లో చిల్లర వెదుక్కునే రామూ అలియాస్ రాంగోపాల్ వర్మ అనబడే ఫ్లాపు చిత్రాల దర్శకుడూ, సోషల్ మీడియా మేధావి గారూ తన కంపెనీ పేరుతో ఒకానొక పనికిమాలిన వెబ్ సిరీస్తో […]పూర్తి వివరాలు ...

ఈ-పుస్తకాలు వ్యాసాలు

సారస్వత వివేచన (వ్యాస సంపుటి) – రాచమల్లు రామచంద్రారెడ్డి

సారస్వత వివేచన ఈ-పుస్తకం రారాగా చిరపరిచితులైన రాచమల్లు రామచంద్రారెడ్డి గారి వ్యాసాల సంపుటి ‘సారస్వత వివేచన’. 1976 జులైలో ప్రచురితం. ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ. ఇందులో  రారా గారు రాసిన  17 వ్యాసాలున్నాయి.పూర్తి వివరాలు ...

కథలు

కువైట్ సావిత్రమ్మ (కథ) – చక్రవేణు

సావిత్రమ్మ కొడుకూ, కూతురూ- ఇద్దరికీ ఒకే రోజు ముహూర్తాలు నిర్ణయించి ఘనంగా పెండ్లి జరిపించింది. ఆ పెండ్లి గురించి చుట్టుపక్కల నాలుగు గ్రామాల వాళ్లూ ఘనంగా చెప్పుకున్నారు. ఇంతవరకూ ఆవైపు అంత గొప్పగా పెండ్లి జరిపినవారే లేరని కీర్తించారు. ‘ఆహా…దేశం కాని దేశానికి పోయి, సిగ్గూ శరమూ లేకుండా అయి పుట్టినోడి కిందల్లా కొంగు పరిచి సంపాయిచ్చి, తగుదునమ్మా అంటూ ముదరపెట్టి ముదరపెట్టి ముసిలోళ్లను చేసినాక బిడ్డలకు పెండ్లి చేసింది. అదీ గొప్పేనా,’ అని పెదవి విరచి […]పూర్తి వివరాలు ...

చరిత్ర రాజకీయాలు

కడప జిల్లాకు జగన్ హామీలు

వివిధ సందర్భాలలో కడప జిల్లా ప్రజలకు (జగన్ హామీలు) వైకాపా అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు: తేదీ: 7 నవంబర్ 2017, సందర్భం: విపక్షనేత హోదాలో పాదయాత్ర  ప్రదేశం: వేంపల్లి, కడప జిల్లా [divider style=”normal” top=”10″ bottom=”10″] ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోగా కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన మూడేళ్లలో కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసి 10వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాంపూర్తి వివరాలు ...

error: