వార్తా విభాగం

రాజకీయాలు

సభలో లేని నన్ను ఎలా సస్పెండ్ చేస్తారు?

బద్వేలు: శాసనసభకు హాజరుకాని తనను ఎలా సస్పెండ్ చేస్తారని వైఎస్సార్ జిల్లా బద్వేలు శాసనసభ్యుడు తిరువీధి జయరాములు ప్రశ్నించారు. ఐదు రోజుల క్రితం అయ్యప్పస్వామి దర్శనం కోసం శబరిమలై వెళ్లిన ఆయన శనివారం సాయంత్రం పోరుమామిళ్లలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను ఐదు రోజుల క్రితం శబరిమలైకి వెళ్లానని అందువల్ల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేకపోయానన్నారు. అయినా ఈనెల 18న తాను అసెంబ్లీలో ఉన్నట్లు ప్రకటించి స్పీకర్ తనను కూడా సస్పెండ్ చేశారన్నారు. […]పూర్తి వివరాలు ...

శాసనాలు

మాలెపాడు శాసనము

ప్రదేశము: మాలెపాడు గ్రామము, ఎర్రగుంట్ల మండలం, కమలాపురం తాలూకా, కడప జిల్లా శాసన కాలం: క్రీ.శ. 725 శాసన పాఠం: మొదటి వైపు 1.అ స్వస్తిశ్రీ చోఱమ 2.హా రాజాధిరాజ ప 3.రమేశ్వర విక్రమాది 4.త్యశక్తి కొమర వి 5.క్రమాదితుల కొడుకు 6.[ళ్ళ్]కాశ్యపగోత్ర 7.[న్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి)]శతదిన్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి)శిద్ది 8.[వే]యురేనాణ్డు ఏఱు[వే] 9.[ళు] ఏళుచు[న్డి](ఇక్కడ డవత్తును θగా చదవాలి)కొను 10.[ఱి]పాఱ రేవళ 11.మ్మ೯కాశ్యపగో 12.త్రి(త్రు)నికి ఇచ్చిన 13.[- -]చిఱుంబూరి ఉత్త 14.[- -]శ తూపు೯నదిశ […]పూర్తి వివరాలు ...

కవితలు

గట్టి గింజలు (కవిత)

పిడికెడంత సీమ గుప్పెడంత ప్రేమ వేటకుక్కల్నే యంటబడి తరిమిన కుందేళ్ళు తిరిగాడిన చరిత్ర! రాళ్ళు కూడా రాగాలు పలికిన గడ్డ! కాలికింద కరువు ముల్లై గుచ్చుకుంటే కంట్లో నెత్తురు కారుచిచ్చై కమ్ముకుంది నెర్రెలిగ్గిన ఒళ్ళుపై గుక్కెడు నీళ్ళు సిలకరించు ఒళ్లంతా గొర్రుసాల్లో ఇత్తనమై సర్రున మొలకెత్తుతుంది. నిద్రబుచ్చేటోడూ, నిందలేసేటోడూ ఇద్దరూ దొంగలే! నిజం మాట్లాడేటోడు, నిగ్గుదేల్చోటోడే నికార్సైన నాయకుడు బువ్వ పెట్టిన సేతినే బూడిదపాలు జేసినోనిపై భూమి తిరగాబడక మానదు భుక్తే భుజాల్ని కలుపుతుంది వలసే నిలేసి […]పూర్తి వివరాలు ...

వార్తలు

రైల్వేకోడూరులో ముఖ్యమంత్రి పర్యటన

రైల్వేకోడూరు : వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె మండలాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి  చంద్రబాబు శుక్రవారం పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటలకు రైల్వే కోడూరు పట్టణంలోని చిట్వేల్ రోడ్డు బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. తర్వాత ఓబులవారిపల్లి మండలం బి.కమ్మపల్లి వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. ఉద్యాన పంటలకు రుణాలను మాఫీ చేయలేమని స్పష్టం చేశారు. ఎకరాకు రూ.10వేల పరిహారం మాత్రమే ఇస్తామన్నారు. హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.45 గంటలకు కోడూరుకు వచ్చిన ఆయన తొలుత గుంజన నదిని […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు రాయలసీమ

సీమ విషయంలో ప్రభుత్వ దాష్టీకాలపై గొంతెత్తిన జగన్

రాయలసీమ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న బాబు కరెంటు కోసం సీమ ప్రాజెక్టులను గాలికొదిలేస్తారా? హైకోర్టును వేరే చోట ఏర్పాటు చెయ్యాలి 13 జిల్లాలను ఒకే విధంగా అభివృద్ధి చేయాల కడప: రాయలసీమకు జరుగుతున్న అన్యాయలపైన, రాయలసీమ విషయంలో, అభివృద్ది వికేంద్రీకరణ విషయంలో ప్రభుత్వ వివక్షను ప్రశ్నిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటిసారి బహిరంగంగా గొంతెత్తారు. మంగళవారంనాడు పులివెందుల నియోజకవర్గ పరిధిలోని సింహాద్రిపురం మండలంలో పైడిపాలెం ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజధాని చుట్టూ […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

ఏమే రంగన పిల్లా – జానపదగీతం

ఒక పడుచు పిల్లగాడు తన అందమైన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయిదేశం పోయినాడు. వాడు చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన మగడిని చూసి అలిగింది ఆ అందాలభామ. ఆ మగడు ఆమెను ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో చూడండి. వర్గం: జట్టిజాం పాట (బృందగేయం) పాడటానికి అనువైన రాగం:తిలకామోద్ స్వరాలు (మధ్యాది తాళం) ఏమే రంగన పిల్లా నీ మకమే సిన్నబాయ – సెప్పే పిల్లా ఆలూరు సంతాకు పోతాన్ పిల్లా అడిగినన్ని […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

విపక్ష నేతలూ… మా కోసం వస్తారు కదూ..!

అయ్యా.. విపక్ష నేతలూ! కడప జిల్లా ప్రజలు దుర్భర పరిస్థితుల మధ్య ఉపాధి కరువై, ప్రభుత్వ ఆదరువు లేక, రోగాల పాలై బతుకీడుస్తున్నారు. మిమ్ములను, మీ పార్టీలని ఆదరించిన జిల్లా ప్రజలపైన ప్రభుత్వం కక్ష కట్టి వివక్ష చూపుతోంది. ఇదే విషయాన్ని మీ పార్టీల నేతలే పలు సందర్భాలలో వాక్రుచ్చినారు. ఇదే సమయంలో గత రెండు మూడు నెలలుగా జిల్లా జ్వర పీడితమైంది. ఇప్పటికే సుమారు వంద మంది వరకూ సామాన్యులు ఈ జ్వరాల బారిన పడి […]పూర్తి వివరాలు ...

వార్తలు

జ్వరాలతో కడపజిల్లాలో 50 మంది మృతి?

పల్లెలను వదలని పాడు జరాలు కన్నెత్తి చూడని వైద్య సిబ్బంది నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వం జేబులు గుల్ల చేస్తున్న ప్రయివేటు ఆసుపత్రులు రాజధాని ‘శ్రద్ధ’ ప్రజారోగ్యం పై ఏదీ? కరువు దరువుకు తోడు ప్రభుత్వ ఆదరువు లేక అల్లాడుతున్న మన పల్లెలపైన పాడు జరాలు పగబట్టినాయి. కడప జిల్లాలోని పలు పల్లెలు పాడు జరాల బారిన పడి విలవిలలాడుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సుమారుగా 50కి పైగా ప్రాణాలు జ్వరాల కారణంగా గాల్లో కలిసిపోయినట్లు అనధికార సమాచారం. […]పూర్తి వివరాలు ...

కవితలు

దావలకట్టకు చేరినాక దారిమళ్ళక తప్పదు (కవిత)

పౌరుషాల గడ్డన పుట్టి పడిఉండటం పరమ తప్పవుతుందేమో కాని ..! కుందేళ్ళు కుక్కలను తరిమిన సీమలో ఉండేలులై విరుచుకపడటం తప్పే కాదు ఉరి కొయ్యలూ ..కారాగారాలూ ఈ సీమ పుత్రులకు కొత్త కాదు తిరుగుబాటు చేయడం ..ప్రశ్నించడం ఇక్కడి వీరపుత్రులకు ..బ్రహ్మ విద్య కాదు ఈభూమి చరిత్ర పుటల్ని తిరగేసి చూడు మడమ తిప్పనితనం ఇక్కడి రక్తంలో నిక్షిప్తం ఉయ్యాలవాడ ఉగ్గుపాలతో నేర్పిన నైజం హంపన్న అహం హుంకరించిన చారిత్రక నిజం పప్పూరి ..కల్లూరి..గాడిచర్ల ఈ సీమ […]పూర్తి వివరాలు ...