వార్తా విభాగం

సంకీర్తనలు

ఏది కడ దీని కేది మొదలు | వట్టి … – అన్నమయ్య

॥పల్లవి॥ఏది కడ దీని కేది మొదలు | వట్టి …వేదనలు తన్ను విడుచు టెన్నఁడు॥చ1॥తొడరినహృదయమే తోడిదొంగయైవడిగొని తన్ను వలఁబెట్టఁగానుకడఁగి కర్మములఁ గడచు టెన్నడునిడినిబంధముల నీఁగు టెన్నఁడు॥చ2॥తతిగొన్న తలఁపులే దైవయోగమైమతినుండి తన్ను మరిగించఁగానుప్రతిలేని యాపదఁ బాయు టెన్నఁడుధృతిమాలిన యాస దీరు టెన్నఁడు॥చ3॥పొదలిన మమతయే భూతమై తన్నుఁబొదిగొని బుద్ధి బోధించఁగానుకదిసి వేంకటపతిఁ గనుట యెన్నఁడుతుదలేనిభవములఁ దొలఁగు టెన్నఁడు రాగము: కన్నడగౌళ రేకు: 0036-06 సంపుటము: 1-225 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥అన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటావన్నెల నప్పులుగొన్నవారువో వీరుread॥చ1॥తెగనీక అప్పులెల్లాఁ దీసితీసి | వారుతగిలినఁ బెట్టలేక దాఁగి దాఁగివెగటునఁ బారిపోఁగా వెంట వెంట | పెక్కుపగల నప్పులుగొన్న వారువో వీరు॥చ2॥సేయరానిపనులెల్లఁ జేసిచేసి | తవ-రాయడికి లోలోనే రాసిరాసికాయములోచొచ్చిచొచ్చి కాఁచికాఁచి | మున్నువ్రాయనిపత్రాల కాఁగేవారువో వీరు॥చ3॥దొరయై యప్పులవారిఁ దోసితోసి | యీ-పరిభవములనెల్లఁ బాసిపాసిసిరులవేంకటపతిఁ జేరిచేరి | యిట్టి …వరుసనే గెలిచినవారువో వీరు రాగము: వరాళి రేకు: 0036-05 సంపుటము: 1-224 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, [&పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

సకల భూతదయ చాఁలఁగ గలుగుట – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥సకల భూతదయ చాఁలఁగ గలుగుటప్రకటించి దేహ సంభవమైన ఫలముis-aber.net॥చ1॥తలకొన్నఫలవాంఛఁ దగులకుండఁగఁ జిత్త-మలవరించుట కర్మియైనఫలముపలుకర్మములలోన బ్రహ్మార్పణపుబుద్ధిగలుగుట హరికృపగలిగినఫలము॥చ2॥యెప్పుడుఁ దిరివేంకటేశు సేవకుఁడౌటతప్పక జీవుఁడు దానైనఫలముకప్పినసౌఖ్యదు: కర్మములు సమముగానొప్పుట విజ్ఞానమొదవినఫలము రాగము: సామంతం రేకు: 0036-04 సంపుటము: 1-223 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తనవారని యాస దగిలి భ్రమయనేల – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥తనవారని యాస దగిలి భ్రమయనేలతనువుఁ బ్రాణునికంటె తగులేది॥చ1॥తనువుఁ బ్రాణుడు రెండు తగిలి గర్భమునందువొనర నేకమై యుదయించిదినములు చెల్లిన తివిరి యాప్రాణుఁడుతనువువిడిచిపోయ దయలేక॥చ2॥ప్రాణికై దేహము పాపపుణ్యముసేయుప్రాణి వెంటనె బొంది పాశుండదుప్రాణి యచ్చటనైన బాధలఁ బడకుండప్రాణి రక్షించు బొందిబడి దాఁ బోయనా॥చ3॥యెరవుల దేహలివి నిజమని నమ్మియెరిఁగీనెఱుఁగలే రిది యాలాఅరయఁ బరమునకు నాది పురుషుఁడైపరగుశ్రీ వేంకటపతి గలిగుండఁగా రాగము: వరాళి రేకు: 0036-03 సంపుటము: 1-222 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏమి సేయఁగవచ్చు నీశ్వరాధీనంబు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఏమి సేయఁగవచ్చు నీశ్వరాధీనంబుతామసపుబుద్ధి కంతలు దూరవలసెread॥చ1॥తెగి దురాపేక్షఁబడ తివియ గతిలేదుగనపగగొన్న వగలకూపములఁ బడవలసెతగుమోహసలిలంబు దాఁట మతి లేదుగనమగుడఁబడి భవముతో మల్లాడవలసె॥చ2॥పాపకర్మములఁ జంపఁగ శక్తిలేదుగనకోపబుద్ధులచేత కొరమాలవలసెరూపములఁ బొడగాంచి రోయఁదరిలేదుగనతాపములచేఁ బొరలి తగులుగావలసె॥చ3॥తిరువేంకటాచలాధిపుఁగొలువలేదుగనగరిమెచెడి విషయకింకరుఁడు గావలసెపరతత్వమూర్తిఁ దలఁపఁగఁ బ్రొద్దులేదుగనదొరతనం బుడిగి యాతురుఁడు గావలసె రాగము: ఆహిరి రేకు: 0036-02 సంపుటము: 1-221 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులుఆడుకొన్న మాటలెల్లా నవి నిజాలా॥చ1॥తొలుకారు మెఱుపులు తోచి పోవుఁగాకనెలకొని మింట నవి నిలిచీనాపొలఁతుల వలపులు పొలసిపోవుఁగాకకలకాలం బవి కడతేరీనా॥చ2॥యెండమావులు చూడ నేరులై పారుఁగాకఅండకుఁబోవ దాహ మణఁగీనానిండినట్టి మోహము నెలఁతల మదిఁ జూడవుండినట్టేవుండుఁగాక వూఁతయ్యీనా॥చ3॥కలలోనిసిరులెల్ల కనుకూర్కులేకాకమెలఁకువఁ జూడ నవి మెరసీనాఅలివేణులమేలు ఆసపాటేకాకతలఁపు వేంకటపతిఁ దగిలీనా రాగము: పాడి రేకు: 0036-01 సంపుటము: 1-220 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

హరినెఱఁగనిపుణ్య మంటేరుగాన – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥హరినెఱఁగనిపుణ్య మంటేరుగానదురితాలే దురితాలే దురితాలే సుండీread॥చ1॥దొడ్డపుణ్యములు సేసి తుదలేనిసంపదలుఅడ్డగించుకొని రాసులగుగురుతుజడ్డులేనిహారికధ చవిలేకుండిన నిట్టేగొడ్డేరే గొడ్డేరే గొడ్డేరే సుండీ॥చ2॥వలేనని మేలేల్ల వడిఁజేసి కైవల్య-మలమి చేతికిలోననగు గురుతుతలఁపు వైష్ణవభక్తిఁ దగులకుండిన నంతాఅలయికే అలయికే అలయికే సుండీ॥చ3॥తిరమైన తీర్ధాలు దిరిగి యందరిలోనధరఁ బుణ్యఁడవుట యంతకు గురుతుతిరువేంకటపతిఁ దెలియకుండిన నంతావిరసాలే విరసాలే విరసాలే సుండీ రాగము: ఆహిరి రేకు: 0035-06 సంపుటము: 1-219 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏమి గలిగెను మా కిందువలన – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఏమి గలిగెను మా కిందువలనవేమారుఁ బొరలితిమి వెఱ్ఱిగొన్నట్లు॥చ1॥తటతటన నీటిమీఁదట నాలజాలంబు-లిటునటుఁ జరించవా యీఁది యీఁదిఅటువలెనెపో తమకమంది సంసారంపు-ఘటనకై తిరిగితిమి కడ గానలేక॥చ2॥దట్టముగఁ బారావతముల మిన్నుల మోవకొట్టఁగొన కెక్కవా కూడి కూడివట్టియాసలనే యిటువలెనేపో యిన్నాళ్ళుబట్ట బయ లీఁదితిమి పనిలేనిపాట॥చ3॥బెరసి కుమ్మరపురువు పేఁడలోపలనెల్లపొరలదా పలుమారుఁ బోయిపోయివరుస జన్మముల నటువలెనె పొరలితిమితిరువేంకటాచలాధిపుఁ దలఁచలేక రాగము: ఆహిరి రేకు: 0035-05 సంపుటము: 1-218 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

వెరపులు నొరపులు వృధా వృధా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥వెరపులు నొరపులు వృధా వృధాధరపై మరయంతయును వృధా॥చ1॥తడయక చేసినదానంబులు వృథయెడనెడ నెఱిఁగిన యెఱుక వృథావొడలిలోనిహరి నొనరఁగ మతిలోఁదడవనిజీవమె తనకు వృథా॥చ2॥జగమునఁ బడిసినసంతానము వృథతగిలి గడించినధనము వృథజగదేకవిభుని సకలాత్ముని హరిఁదెగి కొలువనిబుద్దియును వృధా॥చ3॥పనివడికూడిన పరిణామము వృథవొనరఁగనుందినవునికి వృథాఘనుఁడుగు తిరువేంకటగిరి హరిఁగనిమననేరని జన్మములు వృథా రాగము: ముఖారి రేకు: 0035-04 సంపుటము: 1-217 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారిపూర్తి వివరాలు ...

error: