వార్తా విభాగం

వేమన పద్యాలు

ముక్క వంకజూచి ముకురంబు దూరుట

తనకు ప్రాప్తిలేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల ముక్క వంకజూచి ముకురంబు దూరుట విశ్వదాభిరామ వినురవేమ దాత తనకు ద్రవ్య సహాయం చెయ్యటం లేదనే ఆక్రోశంతో అతన్ని నిందించటం అవివేకం. నిజానికి తనకా అదృష్టం ఉందా లేదా అని ఆలోచించాలి. ఇలా ఆలోచించకపోవడం ఎట్లా ఉంటుందంటే, తన ముక్కు వంకరగా ఉందని మర్చిపోయి, అద్దమే దానిని వంకర చేసి చూపించిందని తూలనాడినట్టు, అంటున్నాడు వేమన.పూర్తి వివరాలు ...

వార్తలు

పట్టుకు ప్రాకులాట: తెలుగుదేశం పార్టీతో మ్యాచ్‌ ఫిక్స్‌?

కడప: జిల్లాలో జగన్‌గ్రూపును దెబ్బతీసేందుకు మంత్రుల బృందం ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ముఖ్యంగా జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పట్టుకోసం ప్రాకులాడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో మ్యాచ్‌ ఫిక్స్‌ంగుకు సిద్దపడుతున్నారు. జిల్లాలో రెండు రోజుల నుంచి నలుగురు మంత్రులు కన్నాలక్ష్మినారాయణ, డిఎల్‌ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, వివేకానందరెడ్డి తిష్టవేశారు. సాధ్యమైనంత మేరకు జగన్‌ గ్రూపుపై పట్టు సాధించేందుకు ప్రతిపక్షాలతో సైతం దోస్తీకి కాంగ్రెస్‌ సిద్దపడుతోంది.పూర్తి వివరాలు ...

వార్తలు

మార్చి 5,6 తేదీల్లో అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగజాతర

కడప : రాయలసీమలో పేరొందిన అనంతపురం గంగజాతర శని, ఆదివారాల్లో జరగనుంది. జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. చాగలగట్టుపల్లె నుంచి ఉత్సవ విగ్రహం శనివారం ఉదయానికి జాతర ఆవరణం చేరుకోనుంది. భక్తుల చెక్క భజనలు, కోలాటాలతో అమ్మవారు, గొల్లపల్లె నుంచి మరో గంగమ్మ విగ్రహం జాతరలోకి చేరుకుంటాయి. ఏటా శివరాత్రి ముగిసిన రెండో రోజే జాతర ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది ఒక రోజు ఆలస్యంగా ప్రారంభం కానుంది. జాతర ఏర్పాట్లను ఆలయ కమిటీ కన్వీనర్‌ టి.పురుషోత్తంరెడ్డి, మేనేజరు […]పూర్తి వివరాలు ...

వార్తలు

కడపలో కాదు.. కమలాపురంలో తేల్చుకుందాం

కడప : కమలాపురం ఎమ్మెల్యే గతాన్ని గుర్తు చేసుకుని విమర్శలు చేయాలని కడప, కమలాపురం ప్రాంతాల జగన్ వర్గనాయకులు హెచ్చరించారు. 2009 ఎన్నికల్లో మేయర్ రవీంద్రనాథరెడ్డి వచ్చేంత వరకు నామినేషన్ వేయలేని వీరశివా ఇప్పుడు తేల్చుకుందాం అంటూ ప్రగల్భాలు పలుకుతావా అంటూ ప్రశ్నించారు. కడపలో కాదు.. కమలాపురం నియోజకవర్గంలో గీత గీస్తే తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వారు సవాల్ విసిరారు. వాహనాల కుంభకోణంలో పోలీసుల దాడిని తట్టుకోలేక ఆళ్లగడ్డ ఫామ్‌హౌస్‌లో దాక్కున్న ఘనత వీరశివారెడ్డికే దక్కుతుందన్నారు.పూర్తి వివరాలు ...

వార్తలు

రెండు రోజుల్లో కడప, పులివెందుల ఉప ఎన్నికల షెడ్యూల్‌

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు మరో రెండు రోజుల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ ఈరోజు విడుదల చేసింది.పూర్తి వివరాలు ...

వార్తలు

దమ్ముంటే నా మీదకు రా? కడప నడిబొడ్డులో తేల్చుకుందాం …

కడప : ‘ఏమీ చేయలేని అమాయకుల మీద కాదు ప్రతాపం చూపేది. దమ్ముంటే నా మీదకు రా? కడప నడిబొడ్డున తగుల్దాం.. ఎప్పుడైనా సరే. సవాల్‌ చేస్తున్నా..’ అంటూ కమలాపురం శాసనసభ్యుడు వీరశివారెడ్డి ఆగ్రహంతో మాజీ మేయరు రవీంద్రనాథ్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. సోమవారం ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం జరిగిన కిడ్నాప్‌ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ వీరశివ సహనం కోల్పోయారు. మాజీ మేయరుపై విరుచుకుపడ్డారు. ‘రవీంద్రనాథ్‌రెడ్డి’ పేరు ఉచ్చరించేందుకుపూర్తి వివరాలు ...

వార్తలు

కడపలో సినీ నటుడు బ్రహ్మాజీ

కడప : కడప నగరంలోని అమీన్‌పీర్‌ (పెద్ద) దర్గాను ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ ఆదివారం దర్శించి ప్రార్థనలు చేశారు. దర్గా మహిమ గురించి మిత్రులు శంకర్‌, ఉత్తేజ్‌ తదితరులు తనకు చెప్పడంతో పాటు రెహమాన్‌ తరచు ఇక్కడికి రావడం తెలిసి రెండేళ్లుగా తాను రావాలని అనుకుంటున్నట్లు బ్రహ్మాజీ విలేకరులతో చెప్పారు. ఇన్నాళ్లకు ఆ భాగ్యం కలిగిందని అన్నారు. గురువులకు పూలచాదర్‌ సమర్పించి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ప్రస్తుతం తాను నటించిన ‘దొంగల […]పూర్తి వివరాలు ...

వార్తలు

కాంగ్రెస్‌ పార్టీని వీడి నేనెప్పుడు పోయా

కడప : ‘కాంగ్రెస్‌ పార్టీని వీడి నేనెప్పుడు పోయా.. నేను పోలేదు. జగనే రాజీనామా చేసిపోయారు. ‘ అని ప్రొద్దుటూరు మాజీ శాసన సభ్యుడు వరదరాజులురెడ్డి అన్నారు. ఆదివారం ఇందిరాభవన్‌కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకుని తాను ఉండలేనని, ఆత్మగౌరవం ఉన్న చోటే ఉంటానని స్పస్టంచేశారు. జగన్‌ వర్గంలోకి పోయారు కదా అని ప్రశ్నించగా.. ఎందుకు, అక్కడికి పోయానో.. ఎందుకు తిరిగి వచ్చానో చెబుతాను. ఆ విషయాన్ని సోమవారం ఇక్కడే (ఇందిరాభవన్‌) విలేకరుల […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఆయన మొండిగా వ్యవహరిస్తున్నారు…

స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేస్తే ఏకగ్రీవంగా గెలిపించుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేవగుడి ఆదినారాయణరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కమలమ్మ అన్నారు. కడప నగరంలోని వైఎస్ గెస్ట్‌హౌస్‌లో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా పోటీ చేయాలని మధ్యవర్తి ద్వారా తాము ప్రతిపాదించినప్పటికీ వివేకానందరెడ్డి సుముఖత చూపలేదన్నారు. ఆయన మొండిగా వ్యవహరించడం అందరికీ బాధాకరంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే తామంతా పదవులు […]పూర్తి వివరాలు ...

error: