కడప : కడప లోక్‌సభకు మే 8వ తేదీన జరగనున్న ఉప ఎన్నిక రసవత్తరం కానున్నది. 1989 సంవత్సరం జరిగిన ఎంపి ఎన్నికల నాటి నుంచి 2009 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ కడప లోక్‌సభను హస్తగతం చేసుకుంది. కాగా దివంగత వైయస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులే ఎంపిలుగా ఎన్నికయ్యారు. కాగా 1977 సంవత్సరంలో జరిగిన కడప లోక్‌సభ ఎన్నికలలో రెడ్డికాంగ్రెస్ అభ్యర్థి కందుల ఓబులరెడ్డి, జనతాపార్టీ అభ్యర్థి రామిరెడ్డిపై గెలుపొందారు.పూర్తి వివరాలు ...
కడప: వైఎస్ఆర్ జిల్లాలోని తుమ్మలపల్లె గని నుంచి తక్కువ గ్రేడ్ యురేనియంను (0.2 శాతం కన్నా తక్కువ) వెలికితీసేందుకు బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్) సరికొత్త విధానాన్ని కనుగొంది. ఇది ఆర్థికంగా లాభసాటి ప్రక్రియని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో చాలా దశలు తగ్గుతాయని బార్క్‌పూర్తి వివరాలు ...
ప్రతిపక్షం అదే. ఆరోపణలూ అవే. కానీ అసత్యాలంటూ ఒకపుడు వాటన్నిటినీ తిప్పికొట్టిన పాలక పక్షం… ఇపుడు ‘అవునా?’ అని ఆశ్చర్యం నటిస్తోంది. మనమే విచారిద్దాం… అంటూ సభా సంఘానికి సరేనంది. మొత్తమ్మీద అన్ని పక్షాలూ కలిసి ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కారణం ఒక్కటే. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారు లేకపోవటం. ఆత్మగౌరవం కోసం నేను సోనియాగాంధీని ఎదిరించటం. ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్న ఈ కుట్ర అసలు లక్ష్యం వేరే ఉంది. అది… ఎల్లో […]పూర్తి వివరాలు ...
ఏప్రిల్ 11న నోటిఫికేషన్.. మే 8న పోలింగ్.. మే 13న కౌంటింగ్ జిల్లాలో అమల్లోకి ఎన్నికల నియమావళి కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ స్థానాల ఉప ఎన్నికల షెడ్యూలు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా మొత్తం నాలుగు రాష్ట్రాల్లోని ఐదు స్థానాలకు (రెండు లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాలకు) ఉప ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఈ షెడ్యూలు ప్రకారం కడప, పులివెందుల స్థానాల్లో మే 8వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల […]పూర్తి వివరాలు ...
పికము వనములోన విలసిల్ల పలికిన భంగి ప్రాజ్ఞజనుల పలుకు గులుకు కాకి కూత బోలు కర్మబద్ధుల కూత విశ్వదాభిరామ వినురవేమ బుద్ధిమంతుల మాటలు తోటలోని కోకిల స్వరంలాగ మనోహరంగా ఉంటాయి. కాని అల్ప బుద్ధుల మాటలు అట్లా కాదు. కాకి కూతల్లా కర్ణ కఠోరంగా ఉంటాయంటున్నాడు వేమన. ప్రాజ్ఞుడు అంటే పండితుడు. అతడు కర్మదూరుడు. అంటే కర్మల్లో చిక్కుపడనివాడు. కోకిల లాగ మధురంగా మాట్లాడుతాడు. రెండోవాడుపూర్తి వివరాలు ...
తుంట వింటి వాని తూపుల ఘాతకు మింటి మంటి నడుమ మిడుక తరమె? ఇంటి యాలి విడిచి యెట్లుండవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ కుటుంబ వ్యవస్థ లోపల గాని, బయటగాని విరహం విరహమే. ఈ భూమ్యాకాశాల మధ్య విరహమంతటి దుస్తర బాధ లేదని అంటున్నాడు వేమన. వేమన జీవితంలోని పరిణామాన్ని ఈ పద్యం సూచిస్తుందేమో తెలియదు. గతంలో భర్తతో సయోధ్య లేని భార్య గురించి అనేక పద్యాలు చెప్పాడు. వేశ్యా జీవితాలనుపూర్తి వివరాలు ...
1929 (౧౯౧౯౨౯) మే 17 వ తారీఖున గాంధీజీ కడప జిల్లాలో ప్రవేశించి కొండాపురం, మంగపట్నం, మారెడ్డిపల్లి, ముద్దనూరు, చిలమకూరు, నిడుజువ్వి, ఎర్రగుంట్ల గ్రామాల మీదుగా రాత్రి 11 గంటలకు ప్రొద్దుటూరుకు చేరినారు. మహాత్మా గాంధి అమ్మవారిశాలను సందర్శించి శ్రీ వాసవీ మాతను సేవించారు. ఈ అన్ని చోట్లా గాంధీజీని అత్యంత ఉత్సాహముతో ఆదరించి సన్మానించారు. ముద్దనూరులో… గాంధీజీ రాత్రి 9 గంటలకు ముద్దనూరు చేరినారు. ముద్దనూరులో గాంధీజీ దర్శనార్థం , అక్కడకు 12 మైళ్ళ దూరములో ఉన్న జమ్మలమడుగు […]పూర్తి వివరాలు ...
రాయించినది: కుల్కరిణీ శంకరప్ప నల్లమల పర్వతమందు ఉన్న అహోబిల నారసింహ క్షేత్రానికి దక్షిణ భాగమున యోజన ద్వయ స్థలమున పూర్వము వాల్మీకి తపస్సు చేస్తూ ఉండేవాడు. అందువలన ఈ స్థలమును వాల్మీకి పురం అని ప్రజలు చెప్పుకుంటున్నారు… ఇటు తరువాత చోళ మహారాజు రాజ్యం చేసేటప్పుడు (కలియుగమందు కొంత కాలం జరిగిన తరువాత) నర్ర గొల్లలు అనే వాళ్ళు ఈ స్థలములో నర్రవుల మందలు ఆపు చేసుకుని ఉండేవారు. అప్పుడు వాళ్ళు ఉండేటందుకు () గాను కొట్టాలు […]పూర్తి వివరాలు ...
తనకు ప్రాప్తిలేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల ముక్క వంకజూచి ముకురంబు దూరుట విశ్వదాభిరామ వినురవేమ దాత తనకు ద్రవ్య సహాయం చెయ్యటం లేదనే ఆక్రోశంతో అతన్ని నిందించటం అవివేకం. నిజానికి తనకా అదృష్టం ఉందా లేదా అని ఆలోచించాలి. ఇలా ఆలోచించకపోవడం ఎట్లా ఉంటుందంటే, తన ముక్కు వంకరగా ఉందని మర్చిపోయి, అద్దమే దానిని వంకర చేసి చూపించిందని తూలనాడినట్టు, అంటున్నాడు వేమన.పూర్తి వివరాలు ...