॥పల్లవి॥ఇంత సేసెఁబో దైవ మింతలోననే అయ్యోసంతపాకలంజఁ దెచ్చి సన్యాసిఁ జేసె॥చ1॥పరిగెలేరేటివానిఁ బట్టపురాజుఁగానిరతభోగము లిచ్చి నిలిపినట్లుధరలోన నతిపాతకుని నన్ను నిట్లుఅరయ నిత్తడిఁ దెచ్చి యపరంజిఁ జేసె॥చ2॥కుక్కలవండుకతినే కులహీనునిఁ దెచ్చివెక్కసఁబాఁపనిఁ గావించినయట్లుదిక్కులెఱఁగఁగఁ గష్టదేహిని నన్నుఁ దెచ్చిగక్కనఁ దెలుకపిండి కస్తూరి సేనె॥చ3॥చెడుగైనదోమఁ దెచ్చి సింహపుఁగొదమఁగాబెడిదంపుఁ బ్రేమతోడఁ బెంచినయట్లుకడునధముని వేంకటపతి నను నిటుచిడిపిరాయి దెచ్చి చింతామణి సేనె రాగము: కన్నడగౌళ రేకు: 0046-03 సంపుటము: 1-282 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥భాలనేత్రానల ప్రబల విద్యుల్లతా-కేలీ విహార లక్ష్మీనరసింహాread॥చ1॥ప్రళయమారుత ఘెరభస్త్రికా పూత్కారలలితనిశ్వాసడోలారచనయాకులశైలకుంభినీకుముదహితరవిగగన-చలనవిధినిపుణ నిశ్చల నారసింహా॥చ2॥వివరఘనవదనదుర్విహసననిష్ఠ్యూత –లవదివ్య వరుషలాలాఘటనయావివిధజంతువ్రాతభువన మగ్నీకరణనవనవప్రియ గుణార్ణవ నారసింహా॥చ3॥దారుణోజ్జ్వలధగద్దగితదంష్ట్రానలవికారస్ఫులింగసంగక్రీడయావైరిదానవఘోరవంశభస్మీకరణ –కారణ ప్రకటవేంకట నారసింహ రాగము: శ్రీరాగం రేకు: 0046-02 సంపుటము: 1-281 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పరుసము సోఁకియు బ్రదుకవద్దాతిరిగి కర్మము లింక తీదీపులా॥చ1॥పడిగాలువడియున్న ప్రాణచారముల-పడఁతుల నధములఁ బాలించితియిడుమలఁ బెడఁబాప నింకనేల తెగి కొంకగడిచీటిచ్చియు నింకఁ గడ మున్నదా॥చ2॥మితిలేనిధనములు మెరసి కానుకగొనిఅతిపుణ్యలిందరి నలరించితిధృతిహీనులకునెల్ల దిక్కయి కాతువుగాకవ్రతముచెల్లిన నింక వట్టఁగట్లా॥చ3॥పాలించి నావిన్నపమున వేంకటరాయలాభించితివి నే నీలలనఁగానాయీలాగుననె లోకమింతాఁ గాతువుగాకపాలుదాగినమీఁదఁ బైకుడుపులా రాగము: శంకరాభరణం రేకు: 0046-01 సంపుటము: 1-280 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥మాయపుదనుజులమదవైరి కపి-రాయఁడు వీఁడివో రామునిబంటు॥చ1॥పెట్టిన జంగయు పెంపుమిగుల మొలఁగట్టినకానెయు గర్వముననిట్టనిలిచి పూనినచేత నడిమి-దిట్ట వీఁడువో దేవునిబంటు॥చ2॥నవ్వుచు లంకానగరపుదనుజుల-కొవ్వణఁచినకపికుంజరుఁడుమువ్వురువేల్పుల మొదలి భూతియగు-రవ్వగు సీతారమణునిబంటు॥చ3॥పంకజసంభవుపట్టముగట్టనువుంకించిన తనవొడయనిచేపొంకపుకలశాపురహనుమంతుఁడువేంకటరమణుని వేడుకబంటు రాగము: సామంతం రేకు: 0045-06 సంపుటము: 1-279 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
॥పల్లవి॥అన్ని చోట్లఁ పరమాత్మ నీవుయిన్నిరూపుల భ్రమయింతువుగా॥చ1॥పాలజలనిధినుండి బదరీవనాన నుండిఆలయమై గయలోఁ బ్రయాగ నుండిభూలోకనిధివై పురుషోత్తమాన నుండివేలసంఖ్యలరూపై విచ్చేతుగా॥చ2॥వుత్తర మధురలో నయోధ్య లోపలినుండిసత్తైన నందవ్రజాన నుండిచిత్తగించి పంచవటి సింహాద్రిలోననుండివత్తుగా లోకములు పావనము సేయఁగను॥చ3॥కైవల్యముననుండి కమలజలోకానమోవఁగ శ్రీరంగమున నుండియీవల నావల నుండి యీవేంకటాద్రిపైనీవే నీవే వచ్చి నెలకొంటిగా రాగము: ముఖారి రేకు: 0045-06 సంపుటము: 1-278 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎట్టివారికినెల్ల నిట్టికర్మములు మా-యెట్టివారికి నింక నేది తోవయ్య॥చ1॥పాముఁజంపిన యట్టిపాతకమునఁ బెద్ద –పాముమీఁద నీకుఁ బవళించవలసెకోమలిఁ జంపిన కోఱఁతవల్ల నొక్క-కోమలి నెదఁ బెట్టుకొని యుండవలసె॥చ2॥బండి విఱిచినట్టి పాతకమునఁ బెద్దబండిబోయుఁడవై పనిసేయవలనెకొండవెఱికి నట్టిగుణమునఁ దిరుమల-కొండమీఁద నీకుఁ గూచుండవలసె రాగము: సాళంగనాట రేకు: 0045-05 సంపుటము: 1-277 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥తొక్కనిచోట్లు దొక్కెడిమనసుయెక్కడ గతిలే దింకనో తెరువుread॥చ1॥పాపము వాయదు పై పై మనసునకోపము దీరదు కొంతైనాదీపన బాధయుఁ దీర దిన్నియునుయేపునఁ బెనఁగొనె నింకనో తెరువు॥చ2॥యెవ్వనమదమును నెడయదు కోరికెకొవ్వును నణఁగదు కొంతైనారవ్వగు మమకారముఁ బెడఁబాయదుయెవ్విధియును లేదింకవో తెరువు॥చ3॥వెఱపును విడువదు వెడమాయలఁబడికొఱఁతయుఁ దీరదు కొంతైనాతెఱఁ గొసఁగేటి శ్రీతిరువేంకటపతి –నెఱిఁగీ నెఱఁగలే మిఁకనో తెరువు రాగము: సామంతం రేకు: 0045-04 సంపుటము: 1-276 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥వాడల వాడల వెంట వాఁడివో వాఁడివోనీడనుండి చీరలమ్మే నేఁతఁబేహారి॥చ1॥పంచభూతములనెడి పలువన్నె నూలుచంచలపుగంజి వోసి చరిసేసికొంచెపు కండెల నూలి గుణముల నేసిమంచిమంచి చీరలమ్మే మారు బేహారి॥చ2॥మటుమాయములఁ దన మగువ పసిఁడి నీరుచిటిపొటి యలుకలఁ జిలికించఁగాకుటిలంపుఁ జేఁతలు కుచ్చులుగాఁ గట్టిపటవాళి చీరలమ్మే బలుబేహారి॥చ3॥మచ్చిక కర్మమనేటి మైల సంతలోనవెచ్చపు కర్మధనము వెలువచేసిపచ్చడాలుగాఁ గుట్టి బలువేంకటపతిఇచ్చకొలఁదుల నమ్మే ఇంటిబేహారి రాగము: వరాళి రేకు: 0045-03 సంపుటము: 1-275 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పండియుఁ బండదు చిత్తము పరిభవ యెడయదు కాంక్షలయెండలనే కాఁగితి మిఁక నేలాగోకాని॥చ1॥పదిగోట్లుజన్మంబులఁ బాయనికర్మపుఁ బాట్లువదలక వొక నిమిషములో వడిఁదీరుచు నితఁడుచెదరని నిజదాసులకును శ్రీహరి, మా కిపుడంతకహృదయము నిలువదు చంచల మేలాగోకాని॥చ2॥కూపపు బహునరకంబుల కోట్లసంఖ్యలఁ బొరలేటి-పాపము లొకనిమిషయములోఁ బాపఁగఁగలఁ డితఁడుకాపాడఁగఁ దలచిన యీకమలాపతి, నే మీతని-యేపునఁ గని మననే మిఁక నేలాగోకాని॥చ3॥జడిగొని యెన్నఁడు బాయనిసంసారపుబంధంబులవిడుమని వొకనిమిషములో విడిపించును యితఁడుకడుఁగొలిచినవారికి వేంకటపతి, నే మీతని-నెడయక కొలువఁగలేమిఁక నేలాగోకాని రాగము: మలహరి రేకు: 0045-02 సంపుటము: 1-274 Tags: Annamacharya Keerthanalu, […]పూర్తి వివరాలు ...