వార్తా విభాగం

పర్యాటకం ప్రత్యేక వార్తలు

ప్రపంచంలోనే అరుదైన కలివికోడి లంకమలలో

సుమారు వందేళ్ళ క్రితమే అంతరించిపోయిందని భావించిన కలివికోడి ఇరవై ఏళ్ళ కిందట 1986వసంవత్సరంలో మనదేశంలోని తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల, శేషాచలం పర్వతపంక్తులలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో సిద్దవటం-బద్వేలు మధ్య అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమై పక్షిశాస్త్ర వేత్తలనూ, ప్రకృతి ప్రేమికులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. కలివికోడి రక్షణకు గత ఇరవై ఏళ్ళగా పలుచర్యలను తీసుకుంటున్నారు. ..ఆ పక్షి ఉనికికే ప్రమాదం కలిగే రీతిలో జరిగిన పరిణామాలు  ప్రపంచవ్యాప్త చర్చకు  దారితీశాయి. కలివికోడికి ఆవాస ప్రాంతమైన లంకమల పరిథిలో తెలుగుగంగ […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు

కడప నుండి కలెక్టరేట్‌ వరకూ …. తప్పెట ప్రభాకర్‌రావు ఐఏఎస్‌

కలెక్టరేట్‌ ఎలా వుంటుంది? కలెక్టర్‌ కనుసన్నలలో  నడుస్తూ, ప్రభుత్వ శాసనాల అమలును పర్యవేక్షిస్తూ నిరంతరం జన సందోహంతో రద్దీగా ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం… ఇలా రద్దీగా ఉండే కలెక్టరేట్‌లోకి అడుగుపెట్టిన రాయలసీమ పిల్లోడు దానిని పర్యవేక్షించే అధికారులను దగ్గరగా గమనించాడు. తను కూడా వారిలా ప్రజా సమస్యలను తీర్చే అధికారి కావాలని కలలు కన్నాడు.ఆ తరువాత ఆ కుర్రాడే ఐఏఎస్‌ అధికారిగా ఎంపికై వివిధ హోదాలలో పని చేశాడు. *    *   * […]పూర్తి వివరాలు ...

వార్తలు

కడపలో గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ

కడప : అభ్యర్థులు ఎంతకాలంగానో కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ పరీక్ష తేదీలను ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించింది. ఈ సంవత్సరం అక్టోబరు 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థుల ప్రిపరేషన్‌కు బాగా సమయం ఉండడం కొంత సౌలభ్యం. ఇంతకుమునుపు అభ్యర్థులు కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాదు వంటి నగరాలకు వెళ్లి వేలకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇది తలకుమించిన భారంగా […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఎలాంటి బాధలేదు : వివేకా

వేంపల్లె : గవర్నర్‌ కోటా కింద తనకు ఎమ్మెల్సీ ఇవ్వనందుకు ఎలాంటి బాధ లేదని మాజీ మంత్రి వివేకానందరెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లెలో 20సూత్రాల ఆర్థిక అమలు కమిటి ఛైర్మన్‌ తులసిరెడ్డి, కాంగ్రెస్‌ నేత కందుల రాజమోహన్‌రెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఓటమిచెందితే ఎమ్మెల్సీ, మంత్రి పదవి తీసుకోకుండా సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని నేను అన్న మాటను కాంగ్రెస్‌ అధిష్ఠానం గౌరవించిందన్నారు. ఎన్నికల్లో ఓడినందున అన్నమాట ప్రకారం ఎలాంటి పదవి తీసుకోకుండా కాంగ్రెస్‌లో కొనసాగుతానన్నారు.పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

పుష్పగిరిలో సినిమా చిత్రీకరణ

కడప : జిల్లాలోని పవిత్రపుణ్యక్షేత్రం పుష్పగిరిలో శనివారం సాయంత్రం శ్రీజ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న (ఇంకాపేరుపెట్టని) ప్రొడక్షన్‌నెంబరు1 సినిమా చిత్రీకరణ జరిగింది.  నిర్మాణంలో భాగంగా హీరో రోహిత్‌, హీరోయిన్‌ శ్రీలపై సన్నివేశాన్ని చిత్రీకరించారు. పీఎన్‌రెడ్డి దర్శకత్వంలో నిర్మాత మదన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సుకుమార్‌ కాగా మగధీరా సినిమాలో నటించిన సంపత్‌రాజు ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్‌ గుడి నుంచి వస్తుండగా హీరో ఆమెను చూస్తూ అందానికి ముగ్దుడై పరవశించే సన్నివేశాన్ని చిత్రీకరించారు.పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

కడప నగరంలో తితిదే ఈ-సేవ కౌంటర్

కలియుగ ప్రత్యక్షదైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, శ్రీ వెంకటేశ్వరస్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు. అందుకే ఆయన సన్నిధి ఎప్పుడూ జనసంద్రమే. ఆ స్వామిని సులభంగా దర్శించుకునే అవకాశం కల్పించడానికి, ఆయన సన్నిధిలో ఆర్జిత సేవలందించడానికి, తిరుమల గిరిపై శ్రమ లేకుండా ఒకరోజు సేద తీరేందుకు గదిని సంపాదించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్ పద్ధతిలో ఈ-సేవ కౌంటర్లను ఏర్పాటు చేశారు.కడప నగరంలో మద్రాసురోడ్డులోని టీటీడీ కల్యాణ మండపంలో ఈ-సేవా కౌంటర్ ఏర్పాటు చేశారు.పూర్తి వివరాలు ...

పర్యాటకం

అసితాంగ భైరవుడి నెలవైన భైరేని లేదా భైరవకోన

భైరేని లేదా భైరవకోన కడప జిల్లాలోని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రము. మైదుకూరు పట్టణానికి ౩౦ కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతం లో వెలసిన భైరవకోన లేదా భైరేని  భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి ఏట శివరాత్రి సందర్భంగా భైరవకోన తిరుణాల వైభవోపేతంగా జరుగుతుంది. ఈ భైరవకోన చరిత్ర ఇలా ఉంది . పూర్వం అహోబిలం సమీపంలో నల్లమలలో ప్రవహించే భవనాశి నది జలప్రళయానికి సూచనగా ఉప్పొంగడం మొదలయ్యింది. దీనితో అహోబిల నరసింహ స్వామి ఈ […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం ప్రత్యేక వార్తలు

నిరాదరణకు గురైంది తెలంగాణా కాదు, రాయలసీమే -శ్రీ కృష్ణ కమిటీ

రాయలసీమలో 1993-94 నుంచి 2004-05 మధ్య కాలంలో మూడు ప్రాంతాలను పోల్చి చూసినట్లయితే జీవనప్రమాణాలు బాగా దిగజారాయని,నిరాదరణకు గురయిన ప్రాంతం తెలంగాణా కాదనీ రాయలసీమేనని శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర అభివృద్ధి పై దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి అవలంభించిన దృక్ఫధాన్నే శ్రీ కృష్ణ కమిటీ కూడా ప్రతిబింబించడం గమనార్హం! గ్రామీణ ప్రాంతాల్లో ఆ దశాబ్దకాలంలో ఆదాయంలో మార్పులను గమనించినట్లయితే తెలంగాణలో సంపన్న వర్గాల్లోనే ఆదాయ వృద్ధి కనిపించింది.పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు

పద్మనాభం ఇంటర్వ్యూ

అది రంగరాజపురం (చెన్నై), నాగార్జున నగర్‌లోని 12వ నెంబరు ఇల్లు … ఆ ఇంటిని చూడగానే ఆలనా పాలనా లేక వెలవెలపోతున్న ఛాయలు స్పష్టంగా కనపడతాయి. అపార్టుమెంటు మాదిరిగా ఉన్న ఆ ఇంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మెట్లపై కూర్చొని ఉన్న వ్యక్తి ఎవరు కావాలంటూ ప్రశ్నించారు. విషయం చెప్పగానే మేడ మీదున్న గది (చిన్న ఇల్లు)లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ హాలులో ఒక చెక్కబల్ల, మూడు కుర్చీలు, ఆ వెనుకాలే గోడకు ‘చింతామణి’ సినిమా పోస్టరు అంటించి ఉన్నాయి. […]పూర్తి వివరాలు ...

error: